డ్రై ఫ్రూట్స్‌ని ఎలా తింటే మంచిది?

డ్రై ఫ్రూట్స్ వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసిందే. వీటిలో పోషకాలు ఎక్కువ. యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి ఫైబర్ మరియు విటమిన్ల యొక్క గొప్ప మూలం. ఇంకా ఐరన్ మరియు కాల్షియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. మరి అలాంటి డ్రై ఫ్రూట్స్‌ని ఎలా తింటే మంచిదో తెలుసుకుందాం.

డ్రై ఫ్రూట్స్‌ ని ఎలా తినాలి?

డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్‌గా గానీ లేదా రోస్ట్ రూపంలో గానీ తింటే డైజెస్ట్ అవటానికి ఎక్కువ సమయం పడుతుంది. వీటిని నానబెట్టడం వల్ల ఫైటేట్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీంతో ఈజీగా జీర్ణమవుతాయి. అంతేకాక, వాటిలో ఉండే ప్రోటీన్లు కూడా నానబెట్టడం వలన జరీరానికి పడతాయి. అందుకే డ్రై ఫ్రూట్స్‌ని రాత్రిపూట నానబెట్టి, మరుసటి రోజు ఉదయాన్నే తినాలని చెప్తారు.

డ్రై ఫ్రూట్స్‌ ని ఎందుకు నానబెట్టాలి?

డ్రై ఫ్రూట్స్‌ని నీటిలో నానబెట్టడం వల్ల అవి మొలకెత్తుతాయి. ఇలా చేయటం వల్ల వాటిలో పోషకాలు మరింత పెరుగుతాయి. వాస్తవానికి వాటి పై ఉండే తొక్కలు అనేక పోషకాలను లోపలే నిలిపి చేస్తాయి. నానబెట్టిన డ్రై ఫ్రూట్స్‌లో ఈ అవరోధం తొలగిపోతుంది. అందుకే పోషకాలు నేరుగా శరీరానికి చేరతాయి.

డ్రై ఫ్రూట్స్‌ని ఎలా నానబెట్టాలి?

అరటిపండ్లు, ఖర్జూరం, ఎండుద్రాక్ష మరియు ఆప్రికాట్ వంటి డ్రై ఫ్రూట్‌లను నానబెట్టే ముందు వాటిని శుభ్రమైన నీటితో కడగాలి. అలా కడగడం వల్ల వాటిపై ఉన్న కెమికల్స్ క్లీన్ అవుతాయి. పప్పులు, కొన్ని తృణధాన్యాలను ముందుగా నానబెట్టినట్లే, అందువల్ల వాటిలో ఉండే ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది.

నానబెట్టకపోవడం వల్ల కలిగే నష్టాలేవి?

  • డ్రై ఫ్రూట్స్‌లో ఉండే ఫైటిక్ యాసిడ్ కారణంగా… జీర్ణశయంలోనూ ప్రేగులలోనూ సమస్యలను కలిగిస్తాయి.
  • నానపెట్టకపోవడం వల్ల వాటిలో ఉండే పోషకాలు సరిగా అందవు.
  • వీటిలో ఉండే ఎంజైమ్స్ జీర్ణ సమస్యలను కలిగిస్తాయి.
  • నానబెట్టి తినడం వల్ల డ్రై ఫ్రూట్స్ పోషక విలువలు మాత్రమే కాకుండా వాటి రుచి కూడా పెరుగుతుంది.

డ్రై ఫ్రూట్స్‌ ని ఏ టైమ్‌లో తినాలి?

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో డ్రైఫ్రూట్స్‌ తినడం మంచిదని అంటారు. సాయంత్రం స్నాక్‌గా కూడా వీటిని తినొచ్చని సూచిస్తున్నారు. ఇలా తింటే ఆహారం ఎక్కువగా తినాలనే కోరిక తగ్గుతుంది.

డ్రై ఫ్రూట్స్‌ ని ఎన్ని తినాలి?

జీర్ణశక్తి ఎక్కువగా ఉన్నవారు, రోజూ వ్యాయామం చేసేవారు, నీళ్లు ఎక్కువగా తాగేవారు, ఆరోగ్యంగా ఉన్నవారు రోజూ ఒక పిడికెడు నట్స్‌ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు, కడుపు ఉబ్బరం, అసిడిటీ, విరేచనాలు, పెద్దప్రేగు సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలని సూచించారు.

డ్రై ఫూట్స్‌ ఎక్కువగా తినడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం, విరేచనాలు, అధిక వేడి, బరువు పెరగడం, ఆకలి మందగించడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీటిలో 80% వరకు కొవ్వు ఉంటుంది కాబట్టి.

చివరి మాట:

డ్రై ఫూట్స్‌ పోషకాహారానికి గొప్ప వనరుగా ఉన్నాయి. డ్రై ఫ్రూట్‌లను స్టోర్ చేయడం మరియు ట్రాన్స్ పోర్ట్ చేయడం చాలా సులభం, కాబట్టి వీటిని తరచుగా స్నాక్స్ లేదా గిఫ్ట్ రూపంలో కొనుగోలు చేస్తారు.

డిస్క్లైమర్:

ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment