వర్షాకాలంలో మీ పిల్లలను దోమ కాటు నుంచి రక్షించాలంటే… ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి!

మాన్ సూన్ సీజన్ వచ్చిందంటే చాలు.. సీజనల్ వ్యాధులు చుట్టుముడుతూ ఉంటాయి.  ముఖ్యంగా చికన్‌గన్యా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలని దోమలు  మోసుకువస్తాయి.  శిశువులు, లేదా పిల్లలు ఎక్కువగా ఈ వ్యాదులబారిన పడుతుంటారు. 

పిల్లలనగానే ఎక్కడపడితే అక్కడ ఆడుకుంటూ ఉంటారు; అలానే ఏది పడితే అది తింటుంటారు. నిజానికి వీరు దోమల కాటు నుంచి తమని తాము రక్షించుకోలేరు. అందుకే పెద్దవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సింపుల్ టిప్స్ పాటించి తమ తమ పిల్లల్ని దోమకాటునుండీ కాపాడుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

Illustration showing a person taking control of their healthcare journey with health icons like fitness, nutrition, medical checkups, and technology.
హెల్త్ టిప్స్: హెల్త్‌కేర్ జర్నీని కంట్రోల్ చేయడానికి 6 మార్గాలు

దోమకాటు లక్షణాలు:

దోమ కుట్టిన తర్వాత ఆ ప్రదేశంలో ఒక ఎర్రటి బంప్ ఏర్పడుతుంది. తరువాత నొప్పి ఏర్పడుతుంది. కొంత సేపటికి దురద కూడా కలుగుతుంది. దాన్ని గోకగానే ఆ ప్రాంతమంతా దద్దురు వస్తుంది. అలా ఏర్పడిన దద్దురు ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది.  కాలక్రమేణా  అది గట్టి పడుతుంది.  కొన్ని సార్లు శరీరం అంతా కూడా దద్దుర్లు, వాపు వంటి లక్షణాలను కూడా గమనించవచ్చు. దీనిని నివారించడానికి, సహజ దోమల నివారణ చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి. 

చిట్కాలు:

దోమ కాటు తర్వాత దురద సమస్యగా మారుతుంది. ఇది కొన్ని గంటలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఉంటుంది. ఇది అటు పిల్లలకు, ఇటు తల్లిదండ్రులకు కూడా చికాకు కలిగిస్తుంది. దోమలు కుట్టిన ప్రదేశంలో గోకడం ఆపడం చాలా కష్టం. అంతేకాక లోతైన గీతలు, చర్మం పై ర్యాషెస్ రావడం వంటివి కూడా ఏర్పడతాయి. అందుకోసం కొన్ని నేచురల్ టిప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 

A person drinking water in summer to prevent heat stroke
వడదెబ్బ ఎవరినీ వదలదు… దాన్ని ఇలా హ్యాండిల్ చేయండి

నివారణ చర్యలు:

  • దోమలు నివాసం ఉండే నీటి గుంటలు, చెరువులు, తోటలు, వంటి ప్రాంతాలకు పిల్లలను పంపడం మానుకోండి. 
  • సాయంత్రం అవ్వగానే తలుపులు, కిటికీలను మూసివేయడం ద్వారా మీ ఇంటిని దోమలు, మరియు కీటకాలనుంచి రక్షించుకోండి. 
  • ఈ కాలంలో వీలైనంతవరకూ చేతులు పూర్తిగా కవర్ అయ్యే విధంగా టాప్స్/షర్ట్స్,  ఫుల్ ప్యాంట్‌లు లేదా లెగ్గింగ్‌ల వంటి దుస్తులు ధరించండి. 
  • పిల్లలను ఆరుబయటకి పంపే ముందు వారికి మస్కిటో  క్రీమ్స్ అప్లై చేయండి.
  • పిల్లలు నిద్రించే సమయంలో దోమతెరను ఉపయోగించండి. 
  • రాత్రిపూట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వెళ్ళకండి. వీలైతే ఇండోర్ హోటల్‌లు, లేదా రెస్టారెంట్‌లకు వెళ్లండి.

రక్షణ చర్యలు:

  • దోమ కుట్టిన ప్రాంతాన్ని క్లీన్ చేయడానికి సబ్బు నీటిని ఉపయోగించండి. 
  • వాపును తగ్గించడానికి ఆ ప్రదేశంలో కోల్డ్ ప్యాక్ వేయండి. 
  • దురదను తగ్గించడానికి, యాంటీ ఇచ్ క్రీమ్, లేదా  యాంటి హిస్టామైన్ లేపనం అప్లై చేయండి.

డిస్క్లైమర్:

సాధారణంగా దోమకుట్టిన తర్వాత కొన్ని గంటల్లోనే ఉపశమనం లభిస్తుంది. అయితే దురద ఎక్కువ రోజుల పాటు ఉన్నా…  లేదా ప్రభావిత ప్రాంతంలో ఎక్కువగా ర్యాషెస్ వచ్చినా… అలెర్జీ ఏర్పడినా… వెంటనే  వైద్యుడిని సంప్రదించాలి. అంతేకాదు.. పిల్లల్లో జాయింట్ పెయిన్స్, తలనొప్పి, జ్వరం, వాంతులు, విరేచనాలు, లేదా దద్దుర్లు వంటి ఇతర లక్షణాలు ఏవైనా కనిపిస్తే… వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Leave a Comment