కొంతమందికి ప్రయాణం అంటే చాలు ఎక్కడలేని వాంతులు పుట్టుకొచ్చేస్తాయి. కారు, బస్సు, రైలు, విమానం ఇలా ఏదైనా సరే ప్రయాణం అంటే చాలు… ఇక వాంతులే! వాంతులు. జర్నీ స్టార్ట్ అయింది మొదలు కడుపులో ఏదో తిప్పుతున్నట్లు అనిపిస్తుంది. ఇక గత్యంతరం లేక జర్నీ మొత్తం అలానే కంటిన్యూ చేస్తారు. కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే… ఈ సమస్య నుండీ బయట పడవచ్చు. అవేంటంటే –
- మనం కూర్చునే సీటు కంఫర్టబుల్ గా లేకపోతే వాంతులు వస్తున్న భావన కలుగుతుంది. అందుకే కూర్చునే సీటు వీలుగా చూసుకోవాలి.
- కారులో వెనక సీటులో కూర్చుంటే వాంతులయ్యే అవకాశమెక్కువ. అందుకే వెనక సీటుకంటే ముందు సీటులో కూర్చోవటం చేయాలి.
- బస్సులో అయితే వీలైనంతవరకు ముందు వరుసలో కూర్చోవటం బెటర్.
- రైలులో మాత్రం కిటికీ పక్కన కూర్చుంటే మంచిది.
- ప్రయాణాలలో కొందరికి బుక్స్ చదివే అలవాటు ఉంటుంది. కానీ అలా చేయడం వల్ల వాంతులు వస్తున్న ఫీల్ కలుగుతుంది. అటువంటప్పుడు బుక్ రీడింగ్ ఆపేసి, కిటికీలోంచి దూరంగా ఉన్న వస్తువులను చూడాలి. దీంతో కాన్సంట్రేషన్ డైవర్ట్ అయి… వాంతులు వస్తున్నట్లు అనిపించే ఫీలింగ్ తగ్గుతుంది.
- అలాగే జర్నీస్ చేసేముందు కడుపు ఫుల్ చేయకూడదు. ముఖ్యంగా వేపుళ్లు, మసాలాలు, ఆయిల్ ఫుడ్, పుల్లటి పదార్థాల అస్సలు జోలికి వెళ్లొద్దు. ఇవి జీర్ణాశయంలో యాసిడ్ లెవెల్స్ ని పెంచుతాయి. దీంతో కడుపులో తిప్పుతున్నట్లు అనిపిస్తుంది.
- ప్రయాణాలలో వీలైతే తులసి ఆకులు నమలండి. అలా చేయటం వల్ల వామ్టింగ్ సెన్సేషన్ తగ్గుతుంది.
- ట్రావెల్ చేస్తున్న సమయంలో వీలైనంత వరకూ నచ్చిన మ్యూజిక్ వినండి. మ్యూజిక్ వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
ఇలా అంతా చేస్తే, ప్రయాణాల్లో వాంతులు బాధించవు.