బిజీలైఫ్ వర్క్ శాటిస్ ఫ్యాక్షన్ ఇస్తుందేమో కానీ, సెల్ఫ్ శాటిస్ ఫ్యాక్షన్ ని మాత్రం ఇవ్వదు. కారణం ఎప్పుడూ ఏదో ఆదుర్దా… హాడావుడి… ఫలితంగా గుండె జబ్బులు. అంతేకాదు, బాడీలో విటమిన్స్, మినరల్స్ లోపించి… యుక్త వయసులోనే తీవ్ర అనారోగ్యాల బారిన పడటం. ఇదీ ఈ జనరేషన్ లైఫ్ స్టైల్.
ఇలాంటి లైఫ్ స్టైల్ వల్ల కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఎక్కువగా పెరిగి… మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని వరల్డ్ హార్ట్ అసోసియేషన్ రీసర్చెస్ తెలుపుతున్నాయి. అసలు ఈ గుండె జబ్బులనేవే రాకుండా ఉండాలంటే, వ్యాధి చికిత్స కంటే నివారణే ముఖ్యం. అందుకోసం 30 ఏళ్లు దాటిన వాళ్ళంతా గుండె ఆరోగ్యంపై బాగా శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు నిపుణులు. అందుకోసం ఈ క్రింద తెల్పిన టిప్స్ ఫాలో అవ్వాలి.
నడక, వ్యాయామం:
వ్యాయామాలన్నిటిలోనూ నడక ఉత్తమ వ్యాయామం. క్రమం తప్పకుండా రోజూ వాకింగ్ చేయడం వల్ల గుండె జబ్బుల బారినుండీ బయట పడొచ్చు. అలాగే, బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ నిల్వలని కంట్రోల్ చేయొచ్చు. ఇంకా అధిక బరువుని అరికట్టవచ్చు. అందుకోసం ప్రత్యేకించి జిమ్ కి వెళ్ళాల్సిన పనిలేదు, ఫిట్‌నెస్ ట్రైనర్స్ అసలే అక్కర్లేదు. కేవలం మీ ఇంట్లోనే సాధారణ వ్యాయామాలు చేయవచ్చు. డైలీ మార్నింగ్ వాక్, సైక్లింగ్ వంటివి చేస్తే చాలు.
సరైన నిద్ర:
మంచి ఆరోగ్యానికి మంచి నిద్ర కూడా అవసరం. రోజుకు కనీసం ఎనిమిది గంటలపాటు నిద్రపోవాలని చెప్తారు. అలాగని ఖచ్చితంగా 8 గంటలు అవసరం లేదు. సరిపడినంత నిద్ర ఉంటే చాలు. మెదడుకి సరైన రెస్ట్ లేకపోతే… ఆ ప్రభావం గుండెపై ఉంటుంది. బ్లడ్ పంపింగ్ లో అప్ అండ్ డౌన్స్ ఏర్పడి… దాని భారం మొత్తం గుండెపై పడుతుంది. ఈ కారణంగా కూడా గుండె జబ్బులకి దారితీసే అవకాశం ఉంది.
బరువు నిర్వహణ:
శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించటానికి వెయిట్ మేనేజ్ మెంట్ చాలా ముఖ్యం. అధిక బరువు గుండెకు ప్రమాదం. ఆ భారమంతా గుండెపై పడటంతో దాని పనితీరు మందగిస్తుంది. ఫలితంగా గుండె జబ్బులకి దారితీస్తుంది.
పోషకాహారం:
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచాలంటే… మంచి ఆహార నియమాలను పాటించాలి. అందుకోసం ఆకుకూరలు, బ్రోకలీ, మిరపకాయ, పండ్లలో స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ. వాల్నట్, బాదం, సోయా, ప్రోటీన్ వంటి ఆహారాలను తీసుకోవాలి. ఈ ఆహారాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటం చేత, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
పొగాకు, మద్యానికి దూరంగా:
ధూమపానం, మద్యపానం వల్ల పలు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అందుకే ఈ అలవాట్లకి దూరంగా ఉండాలి. చిన్న వయసులోనే వీటికి అలవాటు పడటం వల్ల కూడా గుండె జబ్బులు ఎక్కువగా తలెత్తుతున్నాయి.
ఒత్తిడి నుంచి దూరంగా:
డైలీ రొటీన్ లో ఆందోళన, ఒత్తిడి కలిగించే అంశాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ డిప్రెషన్‌తో బాధపడుతుంటే… మానసిక వైద్యుని సంప్రదించాలి. ఎప్పుడూ ప్రశాంత జీవితాన్ని గడుపుతూ ఆలోచనలకి దూరంగా ఉండాలి. అప్పుడే గుండె జబ్బులని అరికట్టవచ్చు.
ముగింపు:
30 ఏళ్ళు పైబడ్డ వారంతా ఈ టిప్స్ తప్పక ఫాలో అయి చూడండి. ఇక గుండె జబ్బులు రమ్మన్నా రావు.
ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే కానీ https://healthyfabs.com ఎలాంటి బాధ్యతా వహించదు. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.