ఇమ్యూనిటీని పెంచే ఈ పాలని ఎప్పుడైనా ట్రై చేశారా..!

పాలలో ఎన్నో రకాల షోషకాలు దాగి ఉన్నాయి. అందుకే, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పాలని ఎవరైనా తాగవచ్చు. పాలలో కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు సంవృద్దిగా ఉన్నాయి. అందుకే ప్రతి రోజూ కనీసం 1 గ్లాసు పాలైనా సరే తాగమని డాక్టర్లు చెపుతారు.

అలాంటి పాలలో 3 రకాల పదార్థాలను మిక్స్ చేసి తీసుకున్నట్లయితే… అది ఇమ్యూనిటీ బూస్టర్ లా పని చేస్తుందని చెప్తున్నారు వైద్య నిపుణులు. మరి ఆ పదార్దాలేవో ఇప్పుడు చూద్దాం.

పాలలో బాదంపప్పుని కలుపుకుని తాగడం వల్ల శరీరానికి ఎక్కువ న్యూట్రిషన్స్ అందుతాయి. ఎదిగే పిల్లలకు పాలలో బాదంపప్పు పొడిని కలిపి ఇవ్వవచ్చు.

తయారు చేయు విధానం:

1 గ్లాసు పాలు తీసుకొని, అందులో 5 లేదా 6 బాదంపప్పులను చిన్న ముక్కలుగా చేసి కానీ, లేదా మెత్తగా నూరి కానీ అందులో వేయాలి. ఈ పాలను బాగా మరిగించిన తర్వాత అందులో కొద్దిగా షుగర్ వేసి చల్లారిన తర్వాత తాగాలి.

  • పసుపు పాలు:

పాలలో పసుపు కలుపుకొని తాగటం వల్ల ఎన్నో వ్యాధులు దూరమవుతాయి. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడతాయి. రోజూ క్రమం తప్పకుండా ఈ పసుపు పాలు తాగినట్లితే… వ్యాదులన్నిటికీ చెక్ పెట్టేయెచ్చు. పసుపు పాలనే గోల్డెన్ మిల్క్ అని కూడా అంటారు. కరోనా వచ్చినప్పటినుండీ ఈ గోల్డెన్ మిల్క్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు.

తయారు చేయు విధానం:

1 గ్లాసు పాలలో కొంచెం పసుపు పొడి కలిపి బాగా మరిగించాలి. తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ పాలను తాగాలి.

  • దాల్చిన చెక్క పాలు:

పాలలో దాల్చిన చెక్క పొడిని కలుపుకొని తాగటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. దాల్చిన చెక్క రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. అందుకే దాల్చిన చెక్క కలిపిన పాలని తీసుకున్నట్లయితే, ఇమ్యూనిటీ పెరగటంతో పాటు, డయాబెటీస్ ని కూడా కంట్రోల్ చేస్తుంది.

తయారు చేయు విధానం:

1 గ్లాసు పాలను తీసుకొని బాగా మరిగించి, అందులో దాల్చిన చెక్క పొడి కలుపుకొని గోరువెచ్చగా ఉండగా తాగాలి.

ముగింపు:

ఇందులోని అంశాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే! వీటిని ట్రై చేసే ముందు నిపుణుల సలహాలు తీసుకోవటం మంచిది.

Leave a Comment