ఈ లక్షణాలు కనిపిస్తే… ఊపిరితిత్తులు డేంజర్‌లో పడినట్లే!

కరోనా వచ్చిన తర్వాత మనం తరచుగా వింటున్న మాట… లంగ్స్ ఇన్‌ఫెక్షన్. లంగ్స్ అనేవి రెస్పిరేటరీ సిస్టంలో ఉన్న మెయిన్ ఆర్గాన్. ప్రక్కటెముకలు వీటిని రక్షిస్తుంటాయి. ఈ ఊపిరితిత్తులు మ‌నం పీల్చుకునే గాలిలో ఉండే ఆక్సిజ‌న్‌ను గ్రహించి… కార్బన్ డై ఆక్సైడ్ ను విడుదల చేస్తాయి. దీంతో శ్వాసక్రియ ప్రక్రియ పూర్తవుతుంది.
మనం జీవించటానికి అవసరమైన గాలిని ప్రొడ్యూస్ చేసేవి కూడా ఈ ఊపిరితిత్తులే! అయితే, అప్పుడప్పుడూ ఈ ఊపిరితిత్తుల్లోని టిష్యూస్ దెబ్బతింటూ ఉంటాయి. అప్పుడు న్యుమోనియా, లంగ్ క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది.
లంగ్స్ కి ఇన్‌ఫెక్షన్ సోకినప్పుడు అవి స‌రిగ్గా ప‌నిచేవు. ఎప్పుడైతే అవి సక్రమంగా పనిచేయవో… అప్పుడు ఊపిరితిత్తులు డేంజర్ లో పడుతున్నట్లు లెక్క. మరి ఈ లంగ్స్ ఇన్ఫెక్షన్ కి గురయ్యేముందు ఎలాంటి సింటమ్స్ మనలో కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

  • అనేక కారణాల వలన ఊపిరితిత్తుల‌కు ఇన్ఫెక్షన్లు వస్తాయి. ముఖ్యంగా దగ్గు ఎక్కువగా వస్తున్నట్లయితే… వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన సలహాలు, చికిత్స తీసుకోవటం మంచిది. ఎందుకంటే, లంగ్స్ డ్యామేజ్ కి ముందు వచ్చే మెయిన్ రీజన్ ఇదే!
  • తరచూ ఛాతిలో నొప్పి వస్తున్నట్లితే… ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ వచ్చినట్లు అనుమానించాలి. ఛాతీకి ఎటువైపు నొప్పి వచ్చినా… రెండు ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది.
  • తరచుగా జ్వరం వస్తుంటే… లోపల లంగ్ ఇన్‌ఫెక్షన్ ఉండే అవ‌కాశం ఉంది. జ్వరంతో పాటు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, ముక్కు, మరియు నోటి నుంచి నీరు కారటం ఇవన్నీ కూడా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కు దారితీసే కారణాలు.
  • శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే… అది ఖచ్చితంగా లంగ్స్ ఇన్‌ఫెక్షన్ కి కారణమవుతుంది.
  • విపరీతమైన అలసటకు గురవుతుంటే… ఊపిరితిత్తులు పనితీరుపై అనుమానించాల్సి ఉంటుంది.
  • తీవ్ర స్థాయిలో గురక వస్తుంటే… ఊపిరితిత్తుల పనితీరుపై దాని ప్రభావం ఉంటుంది.
  • దీర్ఘకాలిక కఫంతో ఇబ్బంది పడుతున్నట్లితే… ఊపిరితిత్తుల పనితీరుపై ఒకసారి ఆలోచించాలి.

పైన పేర్కొన్న లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా… నిర్లక్ష్యం చేయకుండా… వెంటనే వైద్యుడిని సంప్రదించటం బెటర్. దానిద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు.

Leave a Comment