మనిషికి ఎంత నిద్ర అవసరం?

ఆరోగ్యకరమైన జీవన విధానానికి మంచి నిద్ర చాలా అవసరం. ప్రతి ఒక్కరూ రోజుకి కనీసం 8 గంటలు నిద్రపోవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. కానీ, ఈ ఉరుకులు, పరుగుల జీవితంలో నిద్ర వేళల్లో మార్పులు వచ్చాయి. ఈ కారణంగానే జీవనశైలిలో కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.

తగినంత నిద్ర పోయినప్పుడే బాడీ రిలాక్స్ అవుతుంది. అలాకాక, నిద్రలో ఎక్కువ, తక్కువలు జరిగితే, ఆ ప్రభావం కేవలం మైండ్ మీద మాత్రమే కాదు, టోటల్ బాడీ మీద పడుతుంది. నిజానికి సరిగ్గా నిద్రపోకపోతే డయాబెటిస్, గుండె పోటు, నరాలకు సంబంధించిన సమస్యలు, యాంగ్జైటీ, డార్క్ సర్కిల్స్, శరీరంపై ముడతలు ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.

నిద్రించే సమయంలో శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. పగలంతా కష్టపడి పని చేయడం వల్ల కండరాలు అలసిపోతాయి. అవి పునరుత్తేజం పొంది… కొత్త కణాలు రూపొందేందుకు, అలాగే మెదడు పనితీరు మెరుగుపర్చుకునేందుకు నిద్ర ఎంతో అవసరం. మరి అలాంటి నిద్ర మనిషికి ఎంత అవసరం? ఏ వయసువారికి ఎంత నిద్ర కావాలి? ఇలాంటి వివరాలను గురించి వరల్డ్ స్లీప్ ఫౌండేషన్ కొన్ని లెక్కలను విడుదల చేసింది. దాని ప్రకారం…

  • 0-3 నెలల వయస్సు కలిగిన శిశువులకు రోజుకు 14-17 గంటలు అవసరం.
  • 4-11 నెలల వయస్సు కలిగిన శిశువులకు రోజుకు 12-15 గంటలు అవసరం.
  • 1-2 సంవత్సరాలు వయస్సు కలిగిన పసిబిడ్డలకు రోజుకు 11-14 గంటలు అవసరం.
  • 3-5 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రీస్కూల్ పిల్లలకు రోజుకు 10-13 గంటలు అవసరం.
  • 6-13 సంవత్సరాల వయస్సు కలిగిన కిడ్స్ కు రోజుకు 9-11 గంటలు అవసరం.
  • 14-17 సంవత్సరాల వయస్సు కలిగిన టీనేజర్స్ కు రోజుకు 8-10 గంటలు అవసరం.
  • 20-65 సంవత్సరాల వయస్సు కలిగిన పెద్దలకు 7-9 గంటలు అవసరం.
  • 65 సంవత్సరాలకు పైబడిన వృద్ధులకు రోజుకు 7-8 గంటలు అవసరం.
  • గర్భం దాల్చిన మొదటి 3 నెలల్లో మహిళలకు సాధారణం కంటే చాలా ఎక్కువ గంటలు నిద్ర అవసరం.
  • పగటిపూట బోర్ కొట్టిన సమయంలో, లేదా ఖాళీ సమయంలో మగత అనిపిస్తే, అటువంటప్పుడు కూడా ఎక్కువ గంటలు నిద్ర అవసరం.
  • అలసటగా, నీరసంగా ఉన్నట్లయితే, ఎక్కువ నిద్ర అవసరం. అటువంటప్పుడు 9-10 గంటలు నిద్రపోవాల్సి వస్తుంది.
  • వాతావరణ పరిస్థితులు మారినప్పుడు… ఆ మార్పును బాడీ వెంటనే అంగీకరించదు. అలాంటి సమయంలో కూడా ఎక్కువ నిద్ర అవసరం.
  • పీరియడ్స్ సమయంలో స్త్రీలకి శరీరంలో అంతర్గతంగా అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ మార్పుల వల్ల తీవ్రమైన అలసట, మరియు మగతతో ఇబ్బంది పడుతుంటారు. అందువల్ల ఋతు చక్రం సమయంలో వీరికి దాదాపు 9 గంటల నిద్ర అవసరం. అప్పుడే హుషారుగా ఉండగలుగుతాడు.

ముగింపు:

ఇలా వయసును బట్టి, వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ప్రతి ఒక్కరి నిద్ర గంటల్లో మార్పులు ఉంటాయి.

Leave a Comment