మైగ్రేన్‌తో బాధపడుతుంటే… తక్షణమే ఇలా చేయండి!

భ‌రించ‌లేని నొప్పులలో మైగ్రైన్ తలనొప్పి ఒకటి. ఒక  అర గంట‌, గంట పాటు త‌ల‌నొప్పి వ‌స్తేనే అల్లాడిపోతుంటాం. అలాంటిది మైగ్రేన్‌ గంట‌ల‌తో మొద‌లై… రోజుల వ‌ర‌కు ఉంటుంది. సాధారణ తలనొప్పి అయితే ట్యాబ్లెట్లతో నయం చేసుకోవచ్చు, కానీ మైగ్రేన్‌ అలాకాదు. వస్తే ఒక పట్టాన ఒదిలి పోదు. ఎందుకంటే, మైగ్రేన్ అనేది ఒక సాధారణ సమస్య కాదు. చాలాకాలం పాటు మనల్ని ప్రభావితం చేస్తుంది. అందుకే, దీని చికిత్స కూడా చాలా కాలం పాటు కొనసాగుతుంది.

ఇక మైగ్రేన్ వ‌చ్చిన‌ప్పుడు విపరీతమైన గందరగోళానికి గురవుతుంటాం. తలనొప్పితో పాటు, వికారం, వాంతులు, మైకము, చూపు మ‌స‌క‌బారడం, కళ్ళు గుంజడం, లేదా నొప్పి, చెవి నొప్పి, దవడ నొప్పి, అల‌స‌ట‌, రుచి, వాసన కోల్పోవటం  ఇలా ఎన్నో సమస్యలు ఎదుర‌వుతాయి. నిజానికి తలనొప్పి కంటే… మైగ్రేన్ ఎక్కువ నొప్పిని కలిగిస్తుంది. చిన్న విషయానికి కూడా చాలా చిరాకు పడతారు. చిన్న శబ్దం విన్నా… తల బద్దలయినట్లు అనిపిస్తుంది. ఈనేపథ్యంలో తక్షణమే కొన్ని ఇంటి చిట్కాలు ఉపయోగించి మైగ్రేన్‌ కి చెక్‌ పెట్టొచ్చు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఎండు ద్రాక్ష:

మైగ్రేన్ వల్ల కలిగే తలనొప్పికి ఎండు ద్రాక్ష సమర్థంగా పనిచేస్తుంది. ఇందులో ప్రోటీన్, ఐరన్, ఫైబర్, కాపర్,, కాల్షియం, పొటాషియం, విటమిన్ బి6, కార్బోహైడ్రేట్స్, ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే మైగ్రేన్‌ వచ్చినప్పుడు ఎండుద్రాక్ష తినడం వల్ల నొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. అలానే క్రమంగా దాని తీవ్రతను కూడా తగ్గిస్తుంది.

లావెండర్ నూనె: 

లావెండర్ నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల మైగ్రేన్ నుండి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. మాములుగా కూడా ఈ లావెండర్ ఆయిల్‌తో తలకు మసాజ్ చేసుకోవచ్చు. దానివల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గడంతోపాటు మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ అనుభూతి కొన్ని గంటల తరబడినిలిచి ఉంటుంది. నిజానికి మైగ్రేన్ సంభవించడానికి ప్రధాన కారణం ఒత్తిడి. అందుకే దీనికి లావెండర్ ఆయిల్‌ తో మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది. క్రమంగా మైగ్రేన్ తగ్గుముఖం పడుతుంది.

Glass of jeera water and mint leaves for gas relief in hot summer
వేసవిలో గ్యాస్ వస్తే… హోమ్ రెమెడీ ఇదే బాస్!

గసగసాలు: 

తలనొప్పి లేదా మైగ్రేన్ కి గసగసాలు మంచి రెమెడీ. దీనితో తయారు చేసిన ఖీర్ వల్ల బాడీ టెంపరేచర్  బ్యాలెన్స్ అవుతుంది. దీంతో బాడీ కూల్ అవుతుంది. అలాగే, ఎసిడిటీ సమస్య ఉంటే కూడా మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో కూడా పొట్ట ఆరోగ్యం కోసం గసగసాలు తినండి.

లవంగాలు: 

లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో నొప్పిని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందుకే లవంగాలు జలుబు, దగ్గు వంటి సమస్యలను నివారించడంలో బాగా పనిచేస్తాయి. మైగ్రేన్ సమస్య ఉన్నప్పుడు లవంగాల టీ తాగడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఈ టీ తీసుకోవడం వల్ల చాలా వరకు తలనొప్పి తగ్గుతుంది. 

పుదీనా:

మైగ్రేన్‌తో బాధపడేవారు క్రమం తప్పకుండా పుదీనా తీసుకుంటే చాలా మంచిది. లేదా నొప్పి ఉన్నంతకాలం రోజూ పుదీనా టీ తాగినా ఫలితం ఉంటుంది.

అల్లం:

అల్లంలో కూడా మైగ్రేన్ నొప్పిని తగ్గించే గుణం ఉంది. అందుకే సాదారణ తలనొప్పి, లేదా మైగ్రేన్ ఈ రెండిటిలో ఏది వచ్చినా అల్లం టీ తాగితే రిలీఫ్ ఉంటుంది.

Applying coconut oil as the ultimate remedy for itching relief
ఒక్క చుక్క నూనె – ఇక దురదలకు గుడ్‌బై

డిస్క్లైమర్:

పైన తెలిపిన అంశాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే! నొప్పి తీవ్రతరం అయినప్పుడు, లేదా దీర్ఘకాలం పాటు నొప్పి ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ ని సంప్రదించి తగు సలహాలు, సూచనలు తీసుకోవటం మంచిది. అలానే వైద్యుని సలహా మేరకు మాత్రమే మెడిసిన్ వాడాల్సి ఉంటుంది.

Leave a Comment