DJ సౌండ్ తో ఆకస్మిక గుండెపోటు

రాను రాను శబ్ద కాలుష్యం ఎక్కువై పోతుంది. అది ఎంతకి దారి తీస్తుందంటే… గుండె పోటుకి కారణమవుతుంది. ఈ మద్య కాలంలో ప్రతి చిన్న ఈవెంట్ కి DJ సౌండ్ ఉండి తీరాల్సిందే! అది వివాహమైనా, సంతాపమైనా, కిట్టీ పార్టీలైనా, పొలిటికల్ మీటింగులైనా అన్నిటికీ డీజే సౌండ్ కామనే! మితిమీరిన ధ్వని శబ్దాల వల్ల గుండెకొట్టుకొనే వేగంలో మార్పులొస్తాయి. అదే కొంచెం బలహీనమైన గుండె ఉన్నవాళ్ళు అయితే వారి గుండె ఆగిపోతుంది.

అయితే ఇటీవలికాలంలో కొందరు ఏదైనా ఈవెంట్ లో డ్యాన్స్ చేస్తూ… హఠాత్తుగా గుండెపోటు వచ్చి మరణించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దానికి కారణం విపరీతమైన మ్యూజిక్ శబ్దాలే! శబ్దం గుండెపై అదనపు ఒత్తిడిని పెంచుతుంది. దీని కారణంగా ఆకస్మిక గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

గత కొన్నేళ్లుగా గుండెపోటు బారిన పడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా యువతలో ఆకస్మిక గుండెపోటు కేసులు ఎక్కువైపోయాయి. ఈ విషయమై జరిపిన పరిశోదనల్లో తేలింది ఏంటంటే… DJ, లేదా లౌడ్ స్పీకర్ల సౌండ్స్ హార్ట్ ఎటాక్ కు దారి తీస్తాయని.

పెద్ద శబ్దం గుండెపోటుకు కారణమవుతుందా?

మీరు విన్నది నిజమే! లౌడ్ స్పీకర్ల సౌండ్, లేదా డీజే సౌండ్ వంటివి వచ్చే ప్రాంతంలో హార్ట్ వీక్ ఉన్నవాళ్ళు కానీ, లేదంటే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ళు కానీ వెళ్లొద్దు. దీనివల్ల సడన్‌గా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇలాంటి సందర్భంలో ఎవరికైనా గుండెపోటు వస్తే… వెంటనే కార్డియో పల్మనరీ రిససిటేషన్ (CPR) అందివ్వాలి. ఈ ప్రక్రియలో ఛాతీపై రెండు చేతులతో బలంగా రుద్దటం వల్ల శ్వాస తీసుకోవడంలో కొంతమేరకు రిలీఫ్ లభిస్తుంది.

పెద్ద శబ్దాలు ప్రమాదకరమా?

డీజే, లేదా లౌడ్ స్పీకర్ల నుండీ వచ్చిన పెద్ద శబ్దం కారణంగా… అరికాలి నుంచీ మెదడు వరకూ నరాల్లో విపరీతమైన వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం. హాఠాత్తుగా పెరుగుతున్న శబ్దం మీ హృదయ స్పందనను పాడు చేస్తుంది. ఇటువంటి పరిస్థితిని మెడికల్ టెర్మినాలజీలో ‘కర్ణిక దడ’ అని కూడా అంటారు. దీని కారణంగా బ్లడ్ క్లాట్స్, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు సంభవించవచ్చు.

ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయా?

పెద్ద పెద్ద శబ్దాల మధ్య ఎక్కువసేపు ఉండే వ్యక్తులకు ఆ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల కలిగే నాయిస్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. DJ సౌండ్స్ నుండి వెలువడే సౌండ్ వేవ్స్ హార్ట్ పై తీవ్ర ప్రభావం చూపుతాయి. కేవలం గుండెపైనే కాకుండా చెవులపై కూడా దాని ఎఫెక్ట్‌ ఉంటుంది.

కరోనా తర్వాత జాగ్రత్త అవసరమా?

కరోనా సోకిన వ్యక్తులకు ఆ ఇన్ఫెక్షన్ కారణంగా అనేక గుండె సంబంధిత వ్యాధులు చుట్టుముడతాయి. కోవిడ్ -19 వచ్చి… వ్యాధి నయమైన తర్వాత కూడా చాలా జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఈ వైరస్ గుండెపై చాలా ప్రభావం చూపుతుంది. దీని కారణంగా చాలా మంది తమకి తెలియకుండానే గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో ఏ చిన్నపాటి ధ్వని విన్నా ఆ గుండె తట్టుకోలేకపోతుంది. అందుకే గతంలో కరోనా బాధితులుగా మారిన వారు ఎప్పటికప్పుడు తమ గుండెను పరీక్షించుకోవాలి. గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడానికి జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. దీంతో పాటు, మద్యపానం, ధూమపానం నుండి కూడా దూరంగా ఉండాలి.

డిస్క్లైమర్:

పైన చెప్పుకొన్న విషయాలన్నీ కొన్ని రీసర్చిల ఆధారంగా తేలినవే! డాక్టర్లు సైతం ఈ DJ సౌండ్స్ వల్ల ఏర్పడే నాయిస్ పొల్యూషన్ ని తప్పు పడుతున్నారు. కానీ, అధికారులు మాత్రం చూసీ చూడనట్లు పోతున్నారు. అందుకే ఈ సౌండ్స్ ని అరికట్టలేకపోయినా… కనీసం వాటికి దూరంగా అయినా ఉండటం మంచిది.

Leave a Comment