ఫుడ్‌ పాయిజనింగ్‌ అయితే ఇలా చేయండి!

ఫుడ్ పాయిజనింగ్ అనేది ఒక విధమైన అనారోగ్యం. తిన్న ఆహారంలో బ్యాక్టీరియా, లేదా వైరస్ చేరి ఉంటే… అలాంటి ఆహారాన్ని తీసుకోవటం వల్ల కొద్ది గంటలు, రోజులు, లేదా వారాల తర్వాత కడుపులో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. తద్వారా వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, వికారం, జ్వరం వంటివి ఏర్పడతాయి. అయితే, ఈ దీనినుండీ ఉపశమనం పొందాలంటే కొన్ని రెమెడీస్ పాటించవలసి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఫుడ్ పాయిజనింగ్ నివారణ చర్యలు:

జీర్ణ సమస్యలన్నిటికీ అల్లం మంచి ఔషదంగా ఉపయోగపడుతుంది. అందుకే కొద్దిగా అల్లం తీసుకొని దానిని మెత్తగా నూరి రసం తీసుకోవాలి. అందులో ఒక స్పూన్‌ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని తీసుకొన్నట్లయితే చక్కని ఉపశమనం లభిస్తుంది.
ఒక కప్పు వేడి నీటిలో 2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ ద్రావణాన్ని తాగితే ఫుడ్ పాయిజనింగ్ సమస్య నుంచి బయటపడొచ్చు.
ఓ టీస్పూన్ నిమ్మరసం తీసుకొని అందులో చిటికెడు చక్కెర కలిపి రోజుకు 2 నుంచి 3 సార్లు తీసుకోవాలి. అలా చేస్తే ఫుడ్ పాయిజనింగ్ సమస్య తగ్గుముఖం పడుతుంది.
ఒక స్పూన్‌ పెరుగు తీసుకొని, అందులో ఒక స్పూన్‌ మెంతి గింజలను కలపాలి. ఆ మిశ్రమాన్ని నమలకుండా మింగేస్తే కడుపు నొప్పి, వాంతి సమస్యలను తగ్గిస్తుంది.
జీలకర్రను వేయించి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని సూప్‌లో కలుపుకుని తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది.
తులసి ఆకులను తీసుకొని, వాటిని రసం చేసి, అందులో కొంచెం తేనె కలుపుకొని తాగినా కడుపు నొప్పి క్రమంగా తగ్గుతుంది.
అరటిపండును పెరుగులో వేసి మెత్తగా గుజ్జు చేసి, ఆ తర్వాత తినాలి. ఫుడ్ పాయిజనింగ్ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఇదో చక్కటి పరిష్కారం.
ముగింపు:
ఈ రెమెడీస్ పాటించిన తర్వాత ఫుడ్ పాయిజనింగ్ సమస్య నుండీ ఈజీగా బయట పడొచ్చు. అయినప్పటికీ ఇంకా సమస్య తీవ్రతరం అయినట్లు అనిపిస్తే, వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.

Leave a Comment