సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారా..! అయితే ఇలా చేయండి!

మాన్సూన్ వచ్చేసింది. డిసీజెస్ తెచ్చేసింది. మారుతున్న వాతావరణం ఆరోగ్య పరిస్థితులని కూడా మార్చేస్తుంది. అప్పటిదాకా ఎంతో ఆరోగ్యంగా ఉండే మనం సీజన్ మారగానే సడెన్ గా జబ్బుల బారిన పడుతుంటాం. జలుబు, దగ్గు, జ్వరం, వాంతులు, విరోచనాలు ఇలా రకరకాల రోగాలతో సతమతమవుతూ ఉంటాం. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఇదే పరిస్థితి. మరి అలాంటి మాన్సూన్ డిసీజెస్ నుండీ ఎలా బయట పడొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Digital illustration showing a person walking after eating to reduce heart attack risk
భోజనం తర్వాత 15 నిమిషాల వాకింగ్ గుండెపోటుని తగ్గిస్తుందా?

మాన్సూన్ డిసీజెస్:

  • జలుబు
  • దగ్గు 
  • జ్వరం 
  • జలుబు, మరియు ఫ్లూ
  • మలేరియా
  • డెంగ్యూ
  • టైఫాయిడ్ 
  • వాంతులు 
  • విరోచనాలు 
  • కలరా 
  • డయేరియా
  • హెపటైటిస్

మాన్సూన్ డిసీజెస్ లక్షణాలు:

  • గొంతు మంటతో మొదలై… జ్వరం దాకా తీసుకు వెళ్తుంది.
  • జలుబు కారణంగా ముక్కు నుండి నీరు కారుతూనే ఉంటుంది. 
  • ఊపిరాడకుండా వచ్చే దగ్గు ఇబ్బంది పెడుతుంది.
  • గొంతు పొడిబారుతుంది.
  • తలనొప్పి పెరుగుతూ పోతుంది.
  • జ్వరం కూడా రావచ్చు.
  • ఏది తిన్నా నోటికి రుచి ఉండదు. తిన్న ఆహారాన్ని వాంతి చేసుకొంటారు. 
  • ఒక్కోసారి విరోచనాలు కూడా అవుతుంటాయి. మోషన్ నీళ్ళ రూపంలో వెళ్తుంది. దీంతో రోగి నీరసించి పోతాడు.

ఇతర లక్షణాలు:

  • సీజనల్ ఫీవర్‌తో పాటు ఇన్‌ఫ్లుఎంజా కూడా  వచ్చే ప్రమాదం ఉంది. 
  • ఇన్ఫ్లుఎంజా వస్తే… 3-4 రోజులపాటు విపరీతమైన జ్వరం ఉంటుంది. 
  • కొన్నిసార్లు చలి, వణుకు, విపరీతంగా  చెమటలు పట్టటం వంటివి సంభవిస్తాయి. 
  •  ఛాతీ నొప్పి ఉంటుంది.
  • పొత్తికడుపు నొప్పి వస్తుంది.
  • తల తిరగడం, గందరగోళం ఏర్పడటం జరుగుతుంది.
  • అలసటగా ఉంటుంది.
  • చురుకుదనం తగ్గిపోతుంది.
  • మూత్రవిసర్జన తగ్గుతుంది.
  • తీవ్రమైన బాడీ పెయిన్స్ ఉంటాయి.
  • ఏ పని చేయాలన్నా ఉత్సాహం లేకపోవడం, నిస్సత్తువగా ఉండటం వంటివి జరుగుతాయి. 

నివారణ:

  • సాధారణంగా, సీజనల్ వ్యాదులలో వచ్చే జలుబు 4-5 రోజులు ఉంటుంది. తర్వాత దానంతట అదే తగ్గిపోతుంది. కానీ, సమస్య మరీ ఎక్కువ కాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు అవసరం. 
  • అందుకోసం పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకోండి.
  • జలుబు ప్రారంభమైన వెంటనే యాంటీబయాటిక్స్ అస్సలు తీసుకోవద్దు. కనీసం 48 గంటలపాటైనా వేచి ఉండాలి.
  • రెండు రోజులైనా జ్వరం తగ్గకపోతే వైద్యులకు చూపించాలి.
  • డాక్టర్ సలహా మేరకు మాత్రమే నెబ్యులైజర్లను ఉపయోగించాలి.
  • నివారణ కోసం ఆవిరి పట్టండి.
  • కషాయాన్ని తాగండి. 
  • పాలలో పసుపు వేసి తాగితే మరింత మంచిది.

ముగింపు:

పైన తెల్పిన అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే! ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు మాత్రమే ఏవైనా చేయాలి. సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

Eating carrots daily reduces cancer risk and improves blood health
క్యారెట్ తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందా?

Leave a Comment