ఈ లక్షణాలు కనిపిస్తే… కిడ్నీలో రాళ్లు ఉన్నట్టే..!

మానవ శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ ఒకటి. ఇది రక్తాన్ని శుద్ధిచేసి, మలినాలను బయటకి పంపటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అటువంటి కిడ్నీలో ఒక్కోసారి రాళ్ళు ఏర్పడుతుంటాయి. వాటి కారణంగా అనేక ఇబ్బందులు ఏర్పడుతుంటాయి.

సాదారణంగా మూత్రపిండాలు వ్యాధుల బారిన పడటానికి కారణం మన అనారోగ్యకరమైన జీవనశైలే. చెడు ఆహారపు అలవాట్లు, విపరీతమైన డ్రగ్స్ అలవాటు కిడ్నీ స్టోన్స్‌ కి దారితీస్తాయి.

ప్రారంభ సంకేతాలు:

  • కిడ్నీలో స్టోన్స్ ఏర్పడినప్పుడు పొత్తి కడుపు, మరియు దాని వెనుక భాగంలో కూడా విపరీతమైన నొప్పి ఏర్పడుతుంది.
  • వెన్నుపూస క్రింద కిడ్నీలు ఉండే ప్రదేశంలో నొప్పితో పాటు, వాపు కనిపిస్తుంది.
  • మూత్ర విసర్జన చేసేటప్పుడు ఒక్కోసారి రక్తం కూడా పడవచ్చు. దీనిని ‘హెమటూరియా’ అని పిలుస్తారు.
  • మూత్రంతో పాటు వచ్చే ఈ రక్తం ఎరుపు, గులాబీ, లేదా గోధుమ రంగులో ఉంటుంది.
  • యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువై మూత్రంలో తీవ్రమైన మంట ఏర్పడుతుంది.
  • ఈ కారణంగా జ్వరం కూడా వస్తుంది.
  • మలం గాడమైన దుర్వాసనతో కూడి ఉంటుంది.
  • అకస్మాత్తుగా చెమటలు పట్టడం ప్రారంభమవుతుంది.

కిడ్నీలో స్టోన్స్ ఏర్పడినట్లు తెలియచేసే ప్రారంభ సంకేతాలు ఇవి. ఈ సంకేతాల ఆధారంగా ఫ్యూచర్ లో మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడబోతున్నట్లు ఊహించాలి. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడ్ని సంప్రదించాలి.

నివారణ:

  • కిడ్నీలో స్టోన్స్ ఏర్పడకుండా ఉండాలంటే మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌ గా ఉంచుకోవాలి.
  • అందుకోసం నీరు ఎక్కువగా తాగాలి.
  • ఆహారంలో సోడియంని చేర్చాలి.
  • విత్తనాలు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు వంటివి తీసుకోకూడదు.
  • తులసి టీ, తులసి నీళ్ళు, తులసి కషాయం వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
  • ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో కలిపి తులసి ఆకులని నమిలితే, కిడ్నీలో స్టోన్స్ కరిగి బయటకు వచ్చేస్తాయి.
  • ద్రాక్ష ఎక్కువగా తీసుకోవాలి.
  • జామకాయ తినడం వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ ఏర్పడవు.

ముగింపు:

మీ మూత్రంలో మార్పులు రావటం, లేదా నొప్పి ఉంటే, వికారం లేదా వాంతులు – ముఖ్యంగా జ్వరం, మరియు చలి వంటివి ఉంటే వెంటనే మీ వైద్యుడిని కలవండి.

Leave a Comment