ఈ లక్షణాలు కనిపిస్తే…త్వరలో కాలేయం పాడవబోతుందని అర్థం!

మన శరీరంలోని అతి ముఖ్యమైన భాగాలలో కాలేయం ఒకటి. ఇది మన శరీరంలో ఉండే మలినాలని శుభ్రపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇంకా అనేక వ్యాధులని నయం చేస్తుంది. .కాలేయం సరిగ్గా పనిచేయకపోతే అనేక సమస్యలని ఎదుర్కొనవలసి వస్తుంది. అందుచేత కాలేయం పాడవబోతున్నట్లు సూచించే ముందస్తు లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సంకేతాలు మరియు లక్షణాలు:

  • చర్మం, మరియు కళ్ళు పసుపు రంగులోకి మారటం. (పచ్చ కామెర్లు)
  • పొత్తి కడుపు నొప్పి, మరియు వాపు
  • కాళ్లు, మరియు చీలమండలలో వాపు
  • చర్మం పొడిబారడం, దురద పెట్టడం
  • జుట్టు రాలడం
  • దీర్ఘకాలిక అలసట
  • కళ్ల చుట్టూ నల్లటి వలయాలు
  • ఆకలి లేకపోవడం
  • వికారం, లేదా వాంతులు
  • ముదురు రంగు మూత్రం
  • లేత రంగు మలం
  • సులభంగా గాయాల పాలు అవ్వడం

ముగింపు:

పై లక్షణాలన్నీ కనిపిస్తుంటే త్వరలో లివర్ డ్యామేజ్ కాబోతుందని అర్ధం. వెంటనే అప్రమత్తం అయ్యి వైద్యుడ్ని సంప్రదించడం బెటర్. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

Leave a Comment