శరీరానికి అవసరమైన న్యూట్రిషన్స్ ని అందించటంలో డ్రై ఫ్రూట్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. బాదం, పిస్తా, వాల్నట్స్ వంటి అనేక రకాల డ్రై ఫ్రూట్స్… మన శరీరానికి కావలసిన విటమిన్స్, మినరల్స్, న్యూట్రిషన్స్, యాంటి ఆక్సిడెంట్లు, యాంటి బ్యాక్టీరియల్ లక్షణాలని అందిస్తాయి. నిత్యం వీటిని తీసుకోవడం వల్ల బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే బాడీలోని కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా హార్ట్ రిలేటెడ్ ప్రొబ్లెమ్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది.
అయితే ఇన్ని రకాల ప్రయోజనాలని అందించే డ్రై ఫ్రూట్స్‌ని ఏ టైమ్ లో తింటే మంచిది అనే డౌట్ చాలామందికి వచ్చే ఉంటుంది. నిజానికి డ్రై ఫ్రూట్స్ తినే విషయంలో కరెక్ట్ మెథడ్, కరెక్ట్ టైమ్ మైంటైన్ చేయటం చాలా అవసరం అంటున్నారు హెల్త్ స్పెషలిస్ట్స్. తినకూడని సమయంలో తింటే అనేక ఆరోగ్య సమస్యలు కూడా కలుగుతాయని అంటున్నారు.
డ్రై ఫ్రూట్స్‌ని ఉదయాన్నే లేచిన వెంటనే తింటే చాలా మంచిది. అలా కాకుండా రాత్రి వేళలో ముఖ్యంగా పడుకునే ముందు వీటిని తింటే చాలా సమస్యలు వస్తాయి. ఆ సమస్యలేమిటో ఇప్పుడు చూద్దాం..
ఇదికూడా చదవండి: డ్రై ఫ్రూట్స్‌ని ఎలా తింటే మంచిది?
- డ్రై ఫ్రూట్స్ వార్మింగ్ ప్రభావాన్ని కలిగి ఉండటంచేత రాత్రిపూట ఈ డ్రై ఫ్రూట్స్ తిన్న వారి బాడీ టెంపరేచర్ పెరుతుంది. ఇంకా దీని ప్రభావం హెల్త్ పై కూడా పడుతుంది.
- న్యూట్రిషన్ వ్యాల్యూస్ ఎక్కువగా ఉండే ఈ డ్రైఫ్రూట్స్‌ని నైట్ టైమ్ తింటే…అవి డైజెస్ట్ అవ్వటానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా బరువు సమస్యలు ఎదురవుతాయి.
- నిద్రించే ముందు డ్రై ఫ్రూట్స్ తింటే కడుపులో వేడి పుట్టి… కడుపు నొప్పి, మల బద్ధకం, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి.
ఇవేకాదు, మరెన్నో ఆరోగ్య సమస్యలు నైట్ టైమ్ డ్రై ఫ్రూట్స్ ని తినటం వల్ల వస్తాయి. అందుకే నైట్ టైమ్ వీటిని స్కిప్ చేయండి, దాని బదులు డే టైమ్ తినటానికి ట్రై చేయండి.
ముగింపు
ఫైనల్ గా చెప్పాలంటే, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి బెస్ట్ టైమ్ అనేది మీ యొక్క లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. సరైన వ్యాయామం, అలవాట్లు కలిగి ఉన్నవాళ్ళు ఏ టైమ్ లో తిన్నా తప్పులేదు కానీ, అలా కాని వాళ్ళు రకరకాల టైమింగ్స్ లో తినే ప్రయోగం చేస్తే…అనేక రకాల ఆరోగ్య సమస్యలని ఎదుర్కొనాల్సి వస్తుంది. అందుకే, అందరినీ దృష్టిలో పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ ని ఉదయం పూట తినటం మంచిదని చెప్తారు.
డిస్క్లైమర్:
ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.