ఫాస్టింగ్ వల్ల బీపీ తగ్గుతుందా…?

రెగ్యులర్ గా ఫాస్టింగ్ చేయడం వల్ల శరీరానికి ఎంతో హెల్ప్ ఫుల్ అవుతుందని అంటారు. ఫాస్టింగ్‌ ఇంపార్టెన్స్ గురించి దానివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి ఆయుర్వేదం ఎప్పుడో తెలిపింది. డీటాక్సింగ్ నుండీ వెయిట్ లాస్ వరకూ ఫాస్టింగ్‌కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే, ఈ ఫాస్టింగ్ వల్ల బీపీ తగ్గుతుందా…! అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మారింది.

ఫాస్టింగ్ వల్ల ఉపయోగాలు

నిజానికి ఉపవాసం అనేది ఒక మంచి ఆరోగ్య లక్షణం. రెలిజియస్ రీజన్స్ వల్ల కావచ్చు, లేదంటే, డైట్ కంట్రోల్ వల్ల కావచ్చు, ఏదైతేనేమి రెగ్యులర్ గా ఉపవాసం ఉండటం వల్ల ఆరోగ్యంపై దాని ప్రభావం ఉంటుంది. ఫాస్టింగ్ వల్ల బాడీలో పేరుకుపోయి ఉన్న కొన్ని టాక్సిన్స్ రిమూవ్ అవుతాయి. దీనివల్ల బరువు తగ్గడం, దీర్ఘకాలిక వ్యాధుల బారి నుండి బయటపడటం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా, గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది బ్లడ్ ప్రెజర్ ని తగ్గిస్తుంది. స్ట్రోక్, మరియు కార్డియాక్ అరెస్ట్ వంటి గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఇంకా డయాబెటీస్ ని కూడా కంట్రోల్ లో ఉంచుతుంది.

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల ప్రయోజనాలు

ఫాస్టింగ్ అనేది హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ని తగ్గిస్తుంది, మరియు దీర్ఘాయువుని పెంచుతుందని స్టడీస్ చెప్తున్నాయి. క్రమం తప్పకుండా చేసే ఉపవాసం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గి… మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల గట్ మైక్రోబయోటా రీషేప్ అయి… హైపర్ టెన్షన్ తగ్గుతుంది. హైబీపీ వల్ల స్ట్రోక్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. అందుకే, గట్ బ్యాక్టీరియా యొక్క కాంపోజిషన్‌లో ఫాస్టింగ్ ఒక కీ రోల్ ప్లే చేస్తుందని తెలుస్తుంది. దీనివల్ల కార్డియో వాస్య్కులర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయనీ రీసెర్చర్స్ చెబుతున్నారు.

హైపోటెన్షన్ ని కలిగిస్తుంది

ఇదికూడా చదవండి: హైపో టెన్షన్ లక్షణాలు ఏమిటి?

ఉపవాసం రక్తపోటును గణనీయంగా తగ్గిస్తుంది కాబట్టి, లో బ్లడ్ ప్రెజర్ లేదా హైపోటెన్షన్ ఉన్న వ్యక్తులు బ్లడ్ పర్సంటేజ్ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ పరిస్థితి తలనొప్పి, మైకము, అలసట మరియు మూర్ఛ వంటి లక్షణాలను కలిగిస్తుంది.

హైపర్ టెన్షన్ ని తగ్గిస్తుంది

ఫాస్టింగ్ వల్ల గట్ మైక్రోబయోటా యొక్క కాంపోజిషన్‌ని రీషేప్ చేస్తే, హైపర్ టెన్షన్ రెడ్యూస్ అవ్వవచ్చని స్పష్టమవుతుంది. అందుకే బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ అవ్వడానికి ఫాస్టింగ్ చాలావరకూ ఉపయోగపడుతుంది.

ఫాస్టింగ్ ఎవరెవరు చేయకూడదు?

కొంతమంది ఫాస్టింగ్ చేయటం వల్ల సమస్యలను కొని తెచ్చుకొన్న వారవుతారు. అలాంటివారు ఈ ఫాస్టింగ్ చేయకపోవటమే మంచిది. వాళ్ళెవరంటే…

  • వృద్ధులు
  • గర్భిణీ స్త్రీలు లేదా పాలిచ్చే తల్లులు
  • ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ ఉన్నవారు
  • మధుమేహం మరియు లో బ్లడ్ షుగర్ ఉన్నవాళ్ళు
  • మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నవాళ్ళు
  • బరువు తక్కువగా ఉన్నవారు
  • ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు
  • ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్ళు
  • ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకొన్న వాళ్ళు
  • క్రానికల్ డిసీజెస్ ఉన్నవాళ్ళు

ఈ పాస్టింగ్ చేయకపోవటమే మంచిది. దీనివల్ల ఏర్పడే డీ-హైడ్రేటింగ్ కారణంగా హైపోటెన్షన్‌కు దారి తీస్తుంది, కాబట్టి వీరు ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండటం అవసరం.

ముగింపు

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల కేవలం బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ అవ్వటమే కాదు, అంతకు మించిన ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీరు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడంలో సహాయపదుతుందని చెప్పొచ్చు.

డిస్క్లైమర్:

ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment