గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్తుంటారు. అందుకే డాక్టర్లు సైతం దీనిని సిఫార్సు చేస్తుంటారు. గుడ్డులో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడతాయి. ఇందులో ఉండే ఐరన్, కాల్షియం, సెలీనియం, ఫాస్పరస్ వంటివి మెదడు, మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో దోహదపడతాయి.
గుడ్డులో ఉండే కోలిన్ మెదడు, మరియు శరీరంలోని ఇతర ముఖ్యమైన విధులను నియంత్రించడంలో సహాయపడుతుంది.
గుడ్డు సొనలో లూటీన్, జియాక్సంతిన్ అనే రెండు పవర్ఫుల్ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి కంటి రెటీనా పొరను బలోపేతం చేస్తాయి. అలాగే, శుక్లాలు, సైట్ వంటి వాటినుండీ కూడా దూరంగా ఉంచుతాయి.
ఇక బ్రౌన్ కలర్ ఎగ్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సంవృద్దిగా ఉంటాయి. ఇవి రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
అంతేకాక, ఇన్ఫెక్షన్‌ను ప్రేరేపించడానికి అవసరమగు ఫ్రీ రాడికల్స్ కు కారణమయ్యే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని ఎదుర్కొంటాయి.
గోధుమ రంగు గుడ్లు Vs తెలుపు రంగు గుడ్లు:
గోధుమ రంగు గుడ్లు, మరియు తెలుపు రంగు గుడ్లు ఈ రెండిటిలోనూ పోషకాల విషయంలో ఎటువంటి తేడా ఉండదు. కాకపోతే బ్రౌన్ ఎగ్స్, వైట్ ఎగ్స్ కంటే ఖరీదు ఎక్కువ. వాటిని పెట్టే కోళ్లలో తేడాలు ఉంటాయి. అలాగే ఆ కోళ్ళను పెంచే విధానం, వాటికి ఇచ్చే ఆహారంలో వ్యత్యాసం వంటి వాటిని బట్టి రేట్లల్లో తేడాలుంటాయి.
గోధుమ రంగు గుడ్లు:
గోధుమ రంగు గుడ్లు సాధారణంగా మనకి మార్కెట్లల్లో లభిస్తాయి. వీటిని నాటుకోళ్ళు పెడతాయి. వీటికి ఫారంలో పెంచే లేయర్ కోళ్లలా పోషకాహారం ఉండదు. రోజూ వాటికి దొరికిన ఆహారాన్ని తింటాయి. మొక్కలు, కీటకాలతో కూడిన సహజమైన ఆహారాన్ని ఇవి తింటాయి. అందువల్ల ఇవి ఒక ట్రిప్పుకి 80 నుంచి 150 గుడ్లను మాత్రమే పెడతాయి. అందుకే వీటి ఖరీదు ఎక్కువ.
తెలుపు రంగు గుడ్లు:
తెలుపు రంగు గుడ్లు ఎక్కువగా సూపర్ మార్కెట్లల్లో లభిస్తాయి. వీటిని లేయర్ కోళ్ళు పెడతాయి. వీటిని కోళ్ల ఫామ్‌లలో పెంచుతారు. ఎప్పటికప్పుడు పోషకాహారం అందిస్తారు. అందువల్ల ఇవి ఒక ట్రిప్పుకి 300 కి పైగా గుడ్లు పెడతాయి.
గుడ్డు తినని వారితో పోలిస్తే… గుడ్డు తినే వారిలో గుండె జబ్బులు, స్ట్రోక్ వంటివి వచ్చే ప్రమాదం చాలా తక్కువని ఓ అధ్యయనంలో తేలింది. ఎలాగంటే, గుడ్లను తక్కువగా తినే వ్యక్తుల రక్తంలో అపోలిపోప్రొట్రీన్ A1 అని పిలిచే ప్రోటీన్ అధిక స్థాయిలో ఉన్నట్టు గుర్తించారు. ఈ ప్రొటీన్ కల్గిన వ్యక్తుల రక్తంలో HDL అణువులను కలిగి ఉంటారు. గుండె ఆరోగ్యానికి హెచ్డిఎల్ చాలా అవసరం.
డిస్క్లైమర్:
పై సమాచారమంతా కేవలం మీ అవగాహన కోసం మాత్రమే! మీ డైట్‌లో ఏదైనా చేంజ్ చేయాలని అనుకొంటే తప్పనిసరిగా మీ ఫ్యామిలీ డైటీషియన్ సలహా తీసుకోండి.