బ్లాక్ రైస్ బెనిఫిట్స్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!

బ్లాక్ రైస్ బెనిఫిట్స్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకో తెలుసా! ఇందులో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకప్పుడు ఈ బియ్యాన్ని కేవలం రాజుల కోసం మాత్రమే పండించేవారు. కారణం దీని ధర ఎక్కువ. సామాన్య ప్రజలు దీనిని కొనలేరు. అటువంటి నల్ల బియ్యాన్ని పూర్వకాలంలో భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో మాత్రమే సాగు చేసేవారు. ఆ తర్వాత చైనీయులు దీనిని పండించటం మొదలుపెట్టారు. వీరు బ్లాక్ రైస్ నే ఎక్కువ ఇష్టంగా తినటం వల్ల అది బాగా ఫేమస్ అయింది. ఇక ఇప్పుడు భారతదేశంలో ఈశాన్య ప్రాంతంతో పాటు, దక్షిణ ప్రాంతాల్లో కూడా విస్తృతంగా పండిస్తున్నారు.

దీని వాడకం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. అలాగే, దీని పోషక విలువలు కూడా ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తోంది. బ్లాక్ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియెంట్స్, ఫైటో కెమిక‌ల్స్‌, విట‌మిన్ E, ప్రోటీన్స్, ఫైబ‌ర్, ఐర‌న్ స‌మృద్ధిగా ఉంటాయి. అందుకే మిగిలిన అన్ని రైస్‌ల క‌న్నా ఈ రైస్‌లో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయని చెప్పొచ్చు. మరి అవేంటో తెలుసుకుందాం.

డయాబెటిస్ ని నివారిస్తుంది:

వైట్ రైస్ తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయని, బరువు కూడా పెరుగుతారని చెప్తారు. అందుకే మధుమేహులు తెల్ల అన్నానికి బదులుగా నల్ల అన్నాన్ని తినటం బెటర్ అని చెప్తున్నారు బ్లాక్ రైస్ వల్ల డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. అందుకే డాక్టర్స్ కూడా దీనిని సిఫార్సు చేస్తారు. బ్లాక్ రైస్‌లో ఫైబర్ పుష్కలంగా ఉండటంచేత షుగర్ లెవెల్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, డయాబెటిస్ ముప్పు నుండి బయటపడటానికి బ్లాక్ రైస్ తీసుకుంటే చాలా మంచిది.

గుండెకు మేలు చేస్తుంది:

నల్ల బియ్యం గుండెకి మేలు చేస్తుంది. ఎలాగంటే, ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి, గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో హృదయ సంబంధ వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది:

బ్లాక్ రైస్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని తీసుకున్న తర్వాత కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. పొట్ట నిండుగా అనిపించడం వల్ల ఆహారం ఎక్కువ తినలేరు. ఈ కారణంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

జీర్ణసంబంధ సమస్యలను తగ్గిస్తుంది:

బ్లాక్ రైస్‌లో ఉండే ఫైబర్ జీర్ణసంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఇది పేగులను శుభ్రపరుస్తుంది. మలబద్ధకం, ఉబ్బరం, విరేచనాలు వంటి జీర్ణ సంబందిత సమస్యలని తగ్గించడంలో సహాయకారిగా ఉంటుంది.

కాలేయాన్ని రక్షిస్తుంది:

కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం కారణంగా లివర్ వ్యాధి వస్తుంది. బ్లాక్ రైస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్యాట్ ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇంకా లివర్ పనితీరుని ఊదా పునరుద్దరిస్తుంది.

కళ్ళకు మేలు చేస్తుంది:

నల్ల బియ్యంలో విటమిన్ ఇ, కెరొటీనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందత్వానికి దారి తీసే కంటి సంబంధిత వ్యాధులని నయం చెయ్యడంలో సహాయపడుతుంది. అలాగే ఇది కళ్ళపై యూవీ రేడియషన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది.

డిస్క్లైమర్:

కేవలం ఇది మీ అవగాహన కోసం మాత్రమే. కానీ, వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి.

Leave a Comment