తల వెనుక నొప్పి వస్తుందా..! కారణాలు ఇవే కావొచ్చు!

తల నొప్పి అనేది అందరికీ కామన్ గా వచ్చే రుగ్మత. అయితే కొంతమందికి మాత్రం తల అంతా నొప్పి రాకుండా… కేవలం తలలోని ఒక భాగం మాత్రమే నొప్పి వస్తుంది. వాళ్ళు తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు ఆ నొప్పి మరింత పెరుగుతుంది. ఇలా వచ్చే నొప్పి అనేక కారణాల వల్ల వస్తుంది.

వెన్నెముకలో అన్నింటికన్నా పైన ఉండే వెన్నుపూసను ‘అట్లాస్‌ – C1’ అంటారు. ఇది పుర్రెను రెండో వెన్నుపూసతో కలుపుతుంది. మన తల భాగం కదలటానికి తోడ్పడేది, తల మొత్తాన్ని మోసేది ఇదే! అయితే, రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌ వంటి సమస్యలు ఏర్పడ్డప్పుడు, అలాగే ఏవైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ అట్లాస్‌ పూస ఒక్కోసారి అది ఉన్నచోటు నుంచి జరిగిపోతుంది. దీంతో ఆ ప్రాంతంలో నాడి నొక్కుకుపోవటం వల్ల అక్కడ పెయిన్ వస్తుంది.

తల వెనకాల, మెడ పైభాగంలో ఉండే ప్రదేశాన్ని “ఆక్సిపటల్‌” అంటారు. అక్కడ వచ్చే నొప్పి కాబట్టి ఈ డిసీజ్ ని “ఆక్సిపిటల్ న్యూరల్జియా” అంటారు. ఈ ఆక్సిపిటల్ న్యూరల్జియా స్పైనల్ కార్డ్ నుండి తలలోకి వెళ్లే నరాలు ఎర్రబడినప్పుడు సంభవించే పరిస్థితి. ఇది తరచుగా మైగ్రేన్ ఉన్న వ్యక్తులకు ఉంటుంది. ఇంకా ఇది చాలా బాధాకరమైన నొప్పిని కలిగిస్తుంది. తలలో ఏదో పొడుస్తున్నట్టు, సుత్తితో బాదుతున్నట్టు నొప్పి పుడుతుంది. ఇది మెడలో తల దిగువ భాగాన మొదలై… స్కాల్ప్ వైపు కదులుతుంది.

కారణాలు:

  • ఎగువ గర్భాశయ వెన్నెముక యొక్క ఆస్టియో ఆర్థరైటిస్
  • ఆక్సిపిటల్ నరాలకు గాయం
  • క్షీణించిన గర్భాశయ వెన్నెముక
  • గర్భాశయ డిస్క్ వ్యాధి
  • C2 మరియు C3 నరాల మూలాలను ప్రభావితం చేసే కణితులు
  • గౌట్
  • మధుమేహం
  • రక్తనాళాల వాపు
  • ఇన్ఫెక్షన్

లక్షణాలు:

  • నిరంతర నొప్పి
  • మంట, మరియు దడ
  • కళ్ళ వెనుక నొప్పి
  • మెడ, మరియు తల వెనుక భాగంలో విద్యుత్ షాక్ కొట్టినట్లు అనిపించటం; అలానే పదునైన కత్తిపోటు దిగినట్లు ఉండటం
  • కాంతిని తట్టుకోలేక పోవటం
  • మెడను కదిల్చేటప్పుడు నొప్పి

డయాగ్నోసిస్:

ఆక్సిపిటల్ న్యూరల్జియా అనేది ఒక గమ్మత్తైన వ్యాధి. ఎందుకంటే ఈ రోగనిర్ధారణను బహిర్గతం చేసే ఒక నిర్దిష్ట పరీక్ష అంటూ ఏదీ లేదు. ఫిజికల్, మరియు న్యూరలాజికల్ టెస్టులు మాత్రం చేస్తారు. స్పెషల్‌ సీక్వెన్స్‌ ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్, సర్వైకల్‌ స్పైన్‌ స్కాన్ వంటివి చేసి నిర్దారించాల్సి ఉంటుంది.

తలను పైకెత్తినప్పుడు కానీ, కిందికి దించినప్పుడు కానీ పూస ఎలా ఉంటోంది, ఎటువైపుకు జరుగుతుంది అనేది వీటిల్లో తెలుస్తుంది. ఒకవేళ అట్లాస్‌ పూస నిజంగానే పక్కకి జరిగినట్లు తేలితే… సర్జరీతో సరి చేయాల్సి ఉంటుంది.

చికిత్స:

  • నొప్పి ఉన్న ప్రదేశంలో హీటింగ్ ప్యాడ్‌లు లేదా పరికరాలను ఉంచినప్పుడు రోగులు తరచుగా ఉపశమనం పొందుతారు
  • ఫిజికల్ థెరపీ లేదా మసాజ్ థెరపీ

ఓరల్ మెడికేషన్:

  • పెయిన్ కిల్లర్స్
  • కండరాల సడలింపులు తగ్గించే మందులు
  • పెర్క్యుటేనియస్ నెర్వ్ బ్లాక్స్ ఇంజెక్షన్లు
  • బోటులినమ్ టాక్సిన్ (బొటాక్స్) ఇంజెక్షన్లు

సర్జరీ:

  • ఆక్సిపిటల్ నెర్వ్ స్టిమ్యులేషన్
  • స్పైనల్ కార్డ్ స్టిమ్యులేషన్
  • C2,3 గ్యాంగ్లియోనెక్టమీ

డిస్క్లైమర్:

సమస్య మరింత తీవ్ర రూపం దాల్చినప్పుడు న్యూరాలజిస్ట్‌ను, గానీ న్యూరోసర్జన్‌ను గానీ సంప్రదించండి. అవసరమైన పరీక్షలు చేసి, తగు చికిత్స సూచిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay in Touch

To follow the best weight loss journeys, success stories and inspirational interviews with the industry's top coaches and specialists. Start changing your life today!

spot_img

Related Articles