Site icon Healthy Fabs

తల వెనుక నొప్పి వస్తుందా..! కారణాలు ఇవే కావొచ్చు!

What Causes Pain in the Back of the Head

తల నొప్పి అనేది అందరికీ కామన్ గా వచ్చే రుగ్మత. అయితే కొంతమందికి మాత్రం తల అంతా నొప్పి రాకుండా… కేవలం తలలోని ఒక భాగం మాత్రమే నొప్పి వస్తుంది. వాళ్ళు తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు ఆ నొప్పి మరింత పెరుగుతుంది. ఇలా వచ్చే నొప్పి అనేక కారణాల వల్ల వస్తుంది.

వెన్నెముకలో అన్నింటికన్నా పైన ఉండే వెన్నుపూసను ‘అట్లాస్‌ – C1’ అంటారు. ఇది పుర్రెను రెండో వెన్నుపూసతో కలుపుతుంది. మన తల భాగం కదలటానికి తోడ్పడేది, తల మొత్తాన్ని మోసేది ఇదే! అయితే, రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌ వంటి సమస్యలు ఏర్పడ్డప్పుడు, అలాగే ఏవైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ అట్లాస్‌ పూస ఒక్కోసారి అది ఉన్నచోటు నుంచి జరిగిపోతుంది. దీంతో ఆ ప్రాంతంలో నాడి నొక్కుకుపోవటం వల్ల అక్కడ పెయిన్ వస్తుంది.

తల వెనకాల, మెడ పైభాగంలో ఉండే ప్రదేశాన్ని “ఆక్సిపటల్‌” అంటారు. అక్కడ వచ్చే నొప్పి కాబట్టి ఈ డిసీజ్ ని “ఆక్సిపిటల్ న్యూరల్జియా” అంటారు. ఈ ఆక్సిపిటల్ న్యూరల్జియా స్పైనల్ కార్డ్ నుండి తలలోకి వెళ్లే నరాలు ఎర్రబడినప్పుడు సంభవించే పరిస్థితి. ఇది తరచుగా మైగ్రేన్ ఉన్న వ్యక్తులకు ఉంటుంది. ఇంకా ఇది చాలా బాధాకరమైన నొప్పిని కలిగిస్తుంది. తలలో ఏదో పొడుస్తున్నట్టు, సుత్తితో బాదుతున్నట్టు నొప్పి పుడుతుంది. ఇది మెడలో తల దిగువ భాగాన మొదలై… స్కాల్ప్ వైపు కదులుతుంది.

కారణాలు:

లక్షణాలు:

డయాగ్నోసిస్:

ఆక్సిపిటల్ న్యూరల్జియా అనేది ఒక గమ్మత్తైన వ్యాధి. ఎందుకంటే ఈ రోగనిర్ధారణను బహిర్గతం చేసే ఒక నిర్దిష్ట పరీక్ష అంటూ ఏదీ లేదు. ఫిజికల్, మరియు న్యూరలాజికల్ టెస్టులు మాత్రం చేస్తారు. స్పెషల్‌ సీక్వెన్స్‌ ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్, సర్వైకల్‌ స్పైన్‌ స్కాన్ వంటివి చేసి నిర్దారించాల్సి ఉంటుంది.

తలను పైకెత్తినప్పుడు కానీ, కిందికి దించినప్పుడు కానీ పూస ఎలా ఉంటోంది, ఎటువైపుకు జరుగుతుంది అనేది వీటిల్లో తెలుస్తుంది. ఒకవేళ అట్లాస్‌ పూస నిజంగానే పక్కకి జరిగినట్లు తేలితే… సర్జరీతో సరి చేయాల్సి ఉంటుంది.

చికిత్స:

ఓరల్ మెడికేషన్:

సర్జరీ:

డిస్క్లైమర్:

సమస్య మరింత తీవ్ర రూపం దాల్చినప్పుడు న్యూరాలజిస్ట్‌ను, గానీ న్యూరోసర్జన్‌ను గానీ సంప్రదించండి. అవసరమైన పరీక్షలు చేసి, తగు చికిత్స సూచిస్తారు.

Exit mobile version