ఆముదం నూనె దీనినే కాస్టర్ ఆయిల్ అని కూడా అంటారు. భారతీయులు దీనిని తరతరాలుగా ఉపయోగిస్తూ వస్తున్నారు. ఈ ఆముదం నూనెను ఆముదం చెట్టు విత్తనాల నుంచి తీస్తారు. ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆముదం నూనె ఎన్నో ఔషద గుణాలని కలిగి ఉండటం వల్ల దీనిని అనేక రకాల మెడిసిన్స్, మరియు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తయారీలో ఉపయోగిస్తున్నారు.
కాస్టర్ ఆయిల్ యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ- బ్యాక్టీరియల్, యాంటీ-ఫంగల్, యాంటీ-వైరల్, మరియు యాంటీ-మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల పలు అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. మరి అలాంటి ఆముదం నూనె ఉపయోగించి ఏయే అనారోగ్యాలని నయం చేసుకోవచ్చో ఇప్పడు తెలుసుకుందాం.
- పని రీత్యా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పాదాల్లో వాపు, నొప్పి వంటివి కలుగుతుంటాయి. దీనివల్ల కాళ్లలో రక్త సరఫరా తగ్గుతుంది. అప్పుడు కండరాల నొప్పులు వస్తుంటాయి. కొన్నిసార్లు ఈ నొప్పి పెద్దగా బాదించక పోయినా… కొన్నిసార్లు మాత్రం భరించలేనంత బాధ కలుగుతుంది. అలాంటి సమయాల్లో పెయిన్ కిల్లర్స్ కి బదులు ఈ ఆముదం నూనెను రాస్తే నొప్పినుండీ ఉపశమనం కలుగుతుంది.
- ఆముదం జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. తద్వారా జీర్ణాశయం, మరియు పేగుల్లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. అందుకే, మలబద్దకం సమస్య ఉన్నవారు ఎవరైనా సరే రాత్రి నిద్రించే ముందు అర టీస్పూన్ మోతాదులో దీన్ని తీసుకొన్నట్లైతే, మరుసటి రోజు ఉదయాన్నే సుఖ విరేచనం అవుతుంది.
- వాతావరణంలోని మార్పులు కారణంగా చర్మం పొడిబారి నిర్జీవంగా మారినట్లయితే… ఆముదం నూనె రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే, చర్మం మంట, దురద వంటి వాటి నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది.
- రోజూ రాత్రి పడుకునే ముందు ఆముదం నూనెని పాదాలకు పట్టించి… మసాజ్ చేస్తే కండరాల్లో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. దీని వల్ల ప్రశాంతమైన నిద్ర కూడా పడుతుంది.
- ఇది మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటివి రాకుండా ఉండేలా చేస్తుంది. ఒకవేళ ఉంటే తగ్గిస్తుంది.
- శరీరానికి ఆముదాన్ని బాగా మర్దన చేసి స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. చర్మ సమస్యలు అస్సలు ఉండవు.
- ఆముదం నూనెను వేడి చేసి ఆముదం ఆకులపై రాసి, కాళ్లలో వాపు ఉన్నచోట కట్టు కట్టాలి. అలా చేస్తే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒకవేళ ఆముదం ఆకులు దొరకకపోతే, వాపు ఉన్న ప్రాంతాన్ని ఆముదంతో మసాజ్ చేసి, గుడ్డతో కప్పి ఉంచాలి. రాత్రంతా అలా ఉంచితే కాళ్ళవాపులు తగ్గిపోతాయి.
- ఆముదం నూనె జుట్టు రాలడాన్ని అరికట్టి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
- ఆముదం నూనె గాయాలు త్వరగా మానేలా చేస్తుంది. ఇంకా కణజాల పెరుగుదలను వేగవంతం చేస్తుంది.
- ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం చేత చర్మానికి రాసుకుంటే చర్మం పగలకుండా ఉంటుంది. మృదువుగా మారుతుంది. అలాగే, ముడతలను నివారిస్తుంది. ఇంకా చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది.
- ఆముదం నూనెలో ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండటంవల్ల స్ట్రెచ్ మార్క్స్ పై రోజూ రాస్తే తగ్గిపోతాయి.
- మడమల పగుళ్లను తగ్గించుకోవడానికి కూడా ఈ ఆముదం నూనెను ఉపయోగించవచ్చు. ఇందుకోసం పాదాలను శుభ్రంగా కడిగి, చీలమండలపై ఆముదంతో మసాజ్ చేయాలి. దీని వల్ల మడమల పగుళ్లు తగ్గిపోతాయి.
- ఆముదంలో ఉండే రిసినోలిక్ యాసిడ్ వల్ల హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది.
- ఆముదం నూనెని ఉపయోగించి పళ్ళు తోముకుంటే దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉండవు. దంతాలు దృఢంగా మారుతాయి. చిగుళ్ల నుంచి రక్తస్రావం తగ్గుతుంది. అలాగే, నోట్లో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. ఇంకా నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.
ముగింపు:
ఇవేకాక మరెన్నో అనారోగ్య సమస్యలని ఆముదం నూనె తగ్గిస్తుంది. అందుకే పూర్వకాలంలో మన పెద్దలు ఎక్కువగా ప్రిఫర్ చేసేవారు.