శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే దానికి పోషకాహారం అందించాలి. అందుకోసం మీ డైట్‌లో చియా సీడ్స్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే చియా సీడ్స్ లో ప్రోటీన్స్, మినరల్స్, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి అనేక వ్యాధులని అరికడతాయి. ఇంకెందుకు ఆలస్యం అసలు ఈ చియా సీడ్స్ తో కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
బరువు తగ్గిస్తుంది:
ప్రొటీన్, ఫైబర్‌తో నిండిన చియా సీడ్స్ ని తినటం ద్వారా ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ కారణంగా ఆకలిని అధిగమిస్తారు. దీంతో ఈజీగా బరువు తగ్గుతారు. చియా గింజలను నీటిలో నానపెట్టినప్పుడు అందులో ఉండే ఫైబర్ కరిగి నీటిని పీల్చుకుంటుంది. దీనిని తీసుకున్నప్పుడు అది మీ కడుపులో మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అందువల్ల కొన్ని గంటలపాటు ఆకలి అనేది అనిపించదు.
గుండెకి మేలుచేస్తుంది:
చియా సీడ్స్ లో హెల్దీ ఫాట్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ గింజలలోని కరిగే ఫైబర్ బ్లడ్ లో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీంతో బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. అలాగే ఆక్సీకరణ అనేది స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గిస్తాయి.
డయాబెటిస్ ని తగ్గిస్తుంది:
చియా సీడ్స్ లో ఫైబర్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ యొక్క హై కంటెంట్ బాడీలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ ని మేనేజ్ చేస్తాయి. ఈ గింజలు టైప్ 2 డయాబెటిస్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి. ఇంకా వయస్సుతో పాటు మెమరీ పవర్ తగ్గున్న వారు వీటిని తినడం ద్వారా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది:
చియా విత్తనాలలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి ముఖ్యమైన పోషకాలను అధికంగా ఉన్నాయి. అందుచేత ఇవి బోన్ డెన్సిటీ పెరగటానికి సహాయపడతాయి. బోలు ఎముకల వ్యాధి వంటి ఎముక సంబంధిత చికిత్సలకు కూడా ఈ చియా సీడ్స్ ఎంతగానో సహాయపడతాయి.
ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది:
చియా విత్తనాల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఆక్సీకరణ, స్ట్రెస్ వంటి కారణాల వల్ల చర్మం దెబ్బతినకుండా నిరోధిస్తాయి. ఇవి స్కిన్ ఇన్ఫ్లమేషన్ నుంచి ఉపశమనం కల్గిస్తాయి. సూర్యరశ్మి వల్ల చర్మం దెబ్బతినకుండా కాపాడతాయి. వేగంగా టిష్యూ రిపేర్ ని ప్రోత్సహిస్తాయి. ఇంకా ఇవి మొటిమలను తగ్గిస్తాయి. అలాగే చర్మం ముడతలు పడకుండా కూడా కాపాడుతాయి.
ముగింపు:
మీరు చియా విత్తనాల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను పొందాలనుకుంటే, వాటిని మీ ఆహారంలో భాగంగా చేర్చడానికి ప్రయత్నించాలి. అంటే వీటిని స్మూతీస్, ఓట్ మీల్, పెరుగు వంటి వాటిలో మిక్స్ చేసి తినాలి.