నేలపై కూర్చొని తినటం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలివే!

కాలంతో పాటు మనుషులు, వారి అలవాట్లు కూడా మారిపోతున్నాయి. ఒకప్పుడైతే ఏ పని చేయాలన్నా కింద నేలపై కూర్చొని చేసేవారు. కానీ ఇప్పుడలా కాదు, కుర్చీలలో కూర్చొని చేస్తున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ భోజనం చేసే విధానం. పూర్వ కాలంలో ఎవరైనా భోజనం చేయాలంటే కింద కూర్చొని తినేవారు. కానీ, ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినటం అలవాటై పోయింది.

పూర్వీకులు ఊరికే చెప్పలేదు, వారు చేసే ప్రతి పని వెనుక అర్ధం, ఆరోగ్యం అన్నీ దాగి ఉంటాయి. కానీ, నేటితరం వాటిని నిర్లక్ష్యం చేసి లేనిపోని సమస్యలని కొని తెచ్చి పెట్టుకుంటున్నారు. ఈరోజు మనం నేలపై కూర్చొని తినటం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

నేలపై కూర్చొని తినడం వల్ల శరీరం నిటారుగా ఉంటుంది. ఇక కాళ్ళు రెండూ మడుచుకొని, బాడీ స్ట్రెయిట్ గా ఉంచి కూర్చొనే భంగిమ అంటే…ఒకరకంగా పద్మాసన స్థితిలో ఉన్నట్లే!

ఈ ఆసన స్థితిలో ఉన్నప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం దృష్టి అంతా తినే ఆహారంపైనే ఉంటుంది. అందువల్ల అతిగా తినే ఛాన్స్ లేదు. అలాగే, తిన్న ఆహారం కూడా నేరుగా జీర్ణాశయం ద్వారా అన్ని శరీర భాగాలకు చేరుతుంది. దీంతో జీర్ణవ్యవస్థ రిలాక్స్ అవుతుంది.

కుర్చీల్లో కూర్చుని తినేవారికి నడుం చుట్టూ రింగ్ లాగా కొవ్వు పేరుకొని పోతుంది. తర్వాత పొట్ట పెరుగుతుంది. ఆ తర్వాత బరువు పెరుగుతారు. అదే కింద కూర్చొని తింటే.. వంగుతూ, లేస్తూ తుంటూ ఉంటారు కాబట్టి నడుము కింద భాగంలో ఉండే కండరాలు యాక్టివేట్ అవుతాయి. పొట్ట చుట్టూ ఉండే కండరాల నొప్పులు తగ్గుతాయి. అందువల్ల బరువు అదుపులో ఉండి ఊబకాయం తగ్గుతుంది.

  • రక్త ప్రసరణ పెరుగుతుంది:

నేలపై కూర్చుని తిన్నప్పుడు మన శరీరంలోని రక్తనాళాలు సక్రమంగా పనిచేస్తాయి. దీని వల్ల శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. తినే ఆహారం ద్వారా లభించే విటమిన్లు, ప్రోటీన్లు నేరుగా రక్తంలో కలిసిపోతాయి. ఆ రక్తం శరీర భాగాలన్నిటికీ సులువుగా ప్రసరిస్తుంది. ఇంకా గుండెకి రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. అదే కుర్చీపై కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు ఇది జరగదు.

  • జీర్ణంవ్యవస్థ మెరుగుపడుతుంది:

వెన్నెముకని నిటారుగా ఉంచి, ముందుకు వంగి ఆహారం తీసుకోవటం వల్ల అలిమెంటరీ కెనాల్ ద్వారా తిన్న ఆహారం నేరుగా జీర్ణవ్యవస్థకు చేరుతుంది. దీనివల్ల కడుపునొప్పి, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తవు. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

  • ఎసిడిటీ తగ్గుతుంది:

నేలపై కూర్చొని భోజనం చేయడం శరీరంలోని జీర్ణవ్యవస్థకు మేలు చేకూరుతుంది. ముఖ్యంగా ఎసిడిటీ, గ్యాస్ వంటివి ఏర్పడే ఛాన్సే ఉండదు.

  • మజిల్ యాక్టివిటీ పెరుగుతుంది:

నేలపై కూర్చొని తిన్నప్పుడు కాళ్ళు మడిచి తింటుంటాం. రోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఇలా కింద కూర్చునే తింటే… మోకాళ్లకు వ్యాయామం జరిగినట్లే! దీని వల్ల కీళ్ల నొప్పులు, ఎముకల బలహీనత వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అప్పుడు కీళ్ళు శరీర బరువును ఎక్కువసేపు భరించగలవు.

ఇక వెన్నెముక నిటారుగా ఉంచి తింటుంటాం. దీనివల్ల వెన్ను సమస్యలు రావు. బ్యాక్ పెయిన్, ఇంకా ఇతర నడుము సంబందిత నొప్పులు రాకుండా అరికడుతుంది.

  • కుటుంబంలో ఐక్యత నెలకొంటుంది:

నేలపై కూర్చొని భోజనం చేసేటప్పుడు కుటుంబంలో వారంతా కలిసి తింటారు. దీనివల్ల కుటుంబ సభ్యుల మద్య ప్రేమ పెరుగుతుంది. అలానే ఐఖ్యత కూడా నెలకొంటుంది. అంతేకాదు, మైండ్ రిలాక్స్ అయి… స్ట్రెస్ తగ్గుతుంది. తద్వారా బాడీలో ఆక్సిజన్ ఫ్లోటింగ్ పెరుగుతుంది. అందువల్ల ఎక్కువకాలం జీవించే అవకాశం ఉంది.

దీంతోపాటు తినే ఆహారం విలువ తెలుస్తుంది. అందువల్ల ఆహారం వృథా కాదు. ఇంకా త్వరగా పొట్ట నిండిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇది పాత తరం నుంచి కొత్త తరానికి అందిస్తున్న సంస్కృతి.

ముగింపు:

ఇదంతా చదివాక అయినా మీ ఆహారపు అలవాట్లని మార్చుకోవటానికి ట్రై చేయండి. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసమే! కానీ ఆచరిస్తే మరీ మంచిది.

Leave a Comment