సాదారణంగా ఏడుస్తున్న వ్యక్తికి ఓ గ్లాసుడు మంచినీళ్ళు అందిస్తారు ఎందుకో తెలుసా! ఆ నీటిని తాగటం వల్ల వాళ్ళ శరీరంలో కోల్పోయిన వాటర్ పెర్సంటేజ్ ని ఫుల్ ఫిల్ చేసుకోవటానికే! అయితే మీరనుకోవచ్చు, కొంచెం సేపు ఏడ్చినంత మాత్రాన మన శరీరంలో నీటిశాతం అలా ఎలా తగ్గుతుంది అని.
నిజానికి మన శరీరంలో 70% నీరు ఉంటుంది. అందులో ఏ కొంచెం తగ్గినా మన శరీరం దాన్ని ఎక్స్ పోజర్ చేస్తుంది. ఏడ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, అపస్మారక స్థితిలోకి వెళ్ళినప్పుడు, బాగా అలసిపోయినప్పుడు, వ్యాయామం వంటివి చేసినప్పుడు, డీ హైడ్రేషన్ కి గురైనప్పుడు, మూర్ఛ వచ్చినప్పుడు, రక్తపోటు పెరిగినప్పుడు, గుండె నొప్పికి గురైనప్పుడు ఇలా అనేక సందర్భాలలో శరీరంలో ఉండాల్సిన దానికన్నా… వాటర్ పర్సంటేజ్ తగ్గుతుంది. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయి.
మన శరీరంలో మెదడు, మరియు నెర్వ్ సెల్స్ వంటివి పనిచేయటానికి బాడీ నేచురల్ గా ప్రొడ్యూస్ చేసే కెమికల్ ఒకటి ఉంటుంది. దానినే ‘సెరోటోనిన్’ అంటారు. ఈ సెరోటోనిన్… ఏడ్చినప్పుడు కన్నీళ్ళ ద్వారా ఎక్కువగా బయటకి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు దీనిని ఫుల్ ఫిల్ చేయాలంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి.
అలాగే, ఏడ్చినప్పుడు పొట్ట కండరాలు ఎక్కువగా ఒత్తిడికి గురవుతాయి. అప్పుడు ఆ కండరాల మద్య ఎయిర్ చేరుతుంది. దీనివల్ల పొట్ట నొప్పి కూడా వస్తుంది. సరిగ్గా అదే సమయంలో నీటిని తీసుకోవటం వల్ల మజిల్స్ తిరిగి మామూలు స్థితికి చేరుకుంటాయి.
ఏడుస్తున్నప్పుడు వచ్చే కన్నీళ్లు… మెదడులోని ఒక నాడి ద్వారా ప్రేరేపించబడతాయి. అలాంటి సమయంలో, ఒక గ్లాసు నీరు తాగితే… ఆ నాడి రిలాక్స్ అయి, కన్నీళ్లు కారడం తగ్గుముఖం పడుతుంది. అంటే… ఇది భావోద్వేగ తీవ్రతని కొంతమేర తగ్గిస్తుంది లేదా నిరోధిస్తుంది.
ఇక మరో విషయం ఏమిటంటే, ఏడుస్తున్న సమయంలో మనం ఊపిరి బలంగా తీసుకుంటాం. ఒకపక్క వచ్చే వచ్చే కన్నీటిని గొంతులోకి దిగమింగుకుంటూ… పదే పదే గుటక వేస్తుంటాం. మరోపక్క గొంతు తడారిపోతూ ఉంటే… ముక్కు బదులు, నోటితో గాలిని పీల్చుకుంటూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో నోటిద్వారా మన శరీరంలోకి ఎయిర్ వెళ్లి చేరుతుంది. అందుకే ఒకానొక స్టేజ్ లో గుటక వేయటం కూడా కష్టమైపోతుంది. సరిగ్గా ఇలాంటప్పుడే మనకి నీరు అవసరమవుతుంది. అప్పుడు వాటర్ తాగినట్లైతే తిరిగి మామూలు స్థితికి చేరుకుంటుంది.
అంతేకాదు, ఏడుస్తున్న సమయంలో నీరు తాగడం వల్ల మానసిక స్థితిలో కూడా మార్పు వస్తుంది. చిన్న మెదడు మన భావోద్వేగ భాగాన్ని నియంత్రిస్తుంది. మనం బాగా ఒత్తిడికి గురైనప్పుడు, అడ్రినల్ గ్రంథి ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్‌ని విపరీతంగా ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఇలా ఒత్తిడి మనలో మానసిక, శారీరక ప్రతికూల ప్రభావాలని అందిస్తాయి. వాటిని తగ్గించాలంటే తగినంత నీరు తాగాలి. ఈ రీజన్ వల్లనే ఏడుస్తున్న వ్యక్తికి మంచినీరు అందిస్తుంటారు.