మీ ఆరోగ్యం గురించి… మీ నాలుక ఏం చెబుతుంది?

నాలుక మన ఆరోగ్యానికి ఇంపార్టెంట్ ఇండికేటర్. ఎందుకంటే, అది మన శరీరంలో ఏమి జరుగబోతుందో ముందే చెప్పేస్తుంది. మనకి తెలిసి నాలుక ఆహారం రుచిని గుర్తిస్తుంది. కానీ, తెలియని విషయం ఏమిటంటే, నాలుక రంగు ఆరోగ్యాన్ని గుర్తిస్తుంది. అందుకేనేమో… డాక్టర్ వద్దకి వెళ్ళినప్పుడు వాళ్ళు ముందుగా మన క‌ళ్లు, నాలిక, గోర్లు వంటివి పరీక్షిస్తారు. అయితే, నాలుక రంగును బ‌ట్టి మ‌న‌కు ఏయే అనారోగ్య స‌మస్య‌లు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుపు రంగు నాలుక:

మీ నాలుక రంగు తెల్లగా మారినట్లయితే, అది తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం. మీ బాడీ బాగా డీహైడ్రేట్ అయిందని అర్ధం. నాలుక రంగు తెల్లబడుతుంది అంటే… ల్యూకోప్లాకియా, లైకెన్ ప్లానస్, సిఫిలిస్ వంటి వ్యాధుల ప్రారంభ లక్షణాలను సూచిస్తుంది.

ఎరుపు రంగు నాలుక:

మీ నాలుక ఎరుపు రంగులోకి మారినట్లయితే, మీలో విటమిన్ B, ఐరన్‌ లోపించిందని అర్ధం. నాలుక రంగు ఎర్రబడింది అంటే… మీరు జ్వరం, ఇన్ఫెక్షన్ బారిన పడ్డారని సూచిస్తుంది.

నలుపు రంగు నాలుక:

మీ నాలుక నలుపు రంగులోకి మారినట్లితే, తీవ్ర అనారోగ్యానికి సంకేతం. నాలుక నల్లబడింది అంటే… క్యాన్సర్, ఫంగస్, అల్సర్ వంటి వ్యాధులను సూచిస్తుంది. అలాగే, గొంతులో ఏర్పెడిన బ్యాక్టీరియా లేదా ఫంగస్ ని కూడా ఇది తెలియచేస్తుంది.

పసుపు రంగు నాలుక:

మీ నాలుక పసుపు రంగులోకి మారినట్లితే, డీహైడ్రేషన్ కి సంకేతం. అతిగా తినడం వల్ల కూడా ఇలా వస్తుంది. నాలిక పచ్చబడింది అంటే… కాలేయ వ్యాధులు, నోటిలో అధిక బ్యాక్టీరియా పేరుకుపోవటం వంటివి సూచిస్తుంది. వీటితోపాటు నోటి దుర్వాసన, అలసట, జ్వరం వంటి సమస్యలు కూడా వస్తాయి.

గులాబీ రంగు నాలుక:

పింక్ కలర్‌లో ఉన్న నాలుక ఆరోగ్యంగా, సాధారణమైనదిగా ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉన్నట్లు సూచిస్తుంది.

ఊదా రంగు నాలుక:

ఊదా రంగు నాలుక శరీరంలో మంట, లేదా ఇన్ఫెక్షన్ ఉందని తెలియచేస్తుంది. ఇంకా గుండె సమస్యలు, రక్త ప్రసరణ సరిగా జరగక పోవటాన్ని సూచిస్తుంది.

నీలం రంగు నాలుక:

నీలం రంగు నాలుక బలహీనమైన ఆక్సిజన్ ప్రసరణకు సంకేతం. లంగ్ ఇన్ఫెక్షన్, లేదా కిడ్నీ ఇన్ఫెక్షన్ కి సంకేతం.

బూడిద రంగు నాలుక:

కొన్నిసార్లు జీర్ణ సమస్యలు మీ నాలుకను బూడిద రంగులోకి మార్చవచ్చు. పెప్టిక్ అల్సర్ లేదా రింగ్ వార్మ్ కూడా దీనికి కారణం కావొచ్చు.

బ్రౌన్ రంగు నాలుక:

బ్రౌన్ రంగు నాలుక నోటి క్యాన్సర్ కి గుర్తు. ఇంకా పొగాకు ఎక్కువగా వాడేవారికి కూడా ఇలానే కనిపిస్తుంది,

నారింజ రంగు నాలుక:

నారింజ రంగు నాలుక నోరు పొడిబారడం, నోటి పరిశుభ్రత సరిగా లేకపోవటాన్ని సూచిస్తుంది.

నాలుక పూత-

  • నాలుకపై మందపాటి పూతలా ఏర్పడితే అది పేగు అనారోగ్యం, లేదా జీర్ణ సమస్యలను సూచిస్తుంది.
  • నాలుకపై పసుపు పూత ఏర్పడితే అది శరీరంలో ఇన్ఫెక్షన్ ను సూచిస్తుంది.
  • నాలుకపై బూడిద, లేదా నలుపు పూత ఏర్పడితే అది క్రానిక్ డైజెస్టివ్ డిసీజ్ ని సూచిస్తుంది. ఇంకా, మీ ఫిజికల్ హెల్త్ దెబ్బతినబోతోంది అని కూడా తెలుపుతుంది.
  • నాలికపై మందపాటి తెల్లటి పూత ఉంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉందని అర్ధం.

నాలుక ఆకారం –

  • నాలుక కొసలు ఉబ్బిన అంచులతో ఉంటే, శరీరంలో పోషకాలు తగ్గి బలహీనపడినట్లు అర్ధం.
  • నాలుక కొరికేసినట్లు ఎగుడుదిగుడుగా, లేదా పొక్కులుగా కనిపిస్తే అది క్యాన్సర్, లేదా ఫంగస్ కి సూచన.
  • నాలుక సన్నగా, పలుచగా ఉంటే డీ హైడ్రేషన్ కి సంకేతం.
  • నాలుక ఒక పక్కకు వాలిపోతున్నట్లు ఉంటే అది పక్షవాత లక్షణం.

చివరిమాట:

సో ఫ్రెండ్స్! ఈ ఆర్టికల్ చదివిన తర్వాత మీరు కూడా రొటీన్ గా మీ నాలికని చెక్ చేసుకుంటూ ఉంటారని ఆశిస్తున్నాను. ఇది నా కోసం కాదండోయ్! మీ ఆరోగ్యం కోసమేనని మర్చిపోకండి.

డిస్క్లైమర్:

ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే! అంతకుమించి healthy fabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment