హైపర్‌టెన్షన్‌ ని కంట్రోల్‌లో ఉంచే బెస్ట్ స్లీపింగ్ పొజిషన్ ఇదే!

ఇటీవలికాలంలో చాలామంది ఎదుర్కొంటోన్న ఆరోగ్య సమస్యల్లో హైపర్‌టెన్షన్‌ ఒకటి. ఇది గుండె పోటు, కిడ్నీ సమస్యలు, బ్రైయిన్‌ స్ట్రోక్‌ వంటి ఎన్నో అనర్థాలకు మూల కారణం అవుతుంది. మన లైఫ్‌స్టైల్‌ లో మార్పులే… ఈ అధిక రక్తపోటుకి కారణమవుతాయి.

సాదారణంగా నిద్రలేమి, ఒత్తిడి, వ్యాయామం చేయకపోవడం, పైయిన్‌ కిల్లర్స్‌ ఎక్కువగా వాడడం, గర్భ నిరోధక మాత్రలు ఎక్కువగా తీసుకోవడం, ఉప్పు ఎక్కువగా తినడం వంటివి హైబీపీకి ప్రధాన కారణాలు.

నిద్రకు, బీపీకి మధ్య గల సంబంధం:

హైబీపీకి, నిద్రకి మధ్య స్ట్రాంగ్‌ లింక్ ఉంది. ముఖ్యంగా చాలామందికి తెలియని ఒకే ఒక విషయం ఏంటంటే హైపర్‌టెన్షన్‌ ఎక్కువశాతం నిద్రలేమి వల్లే వస్తుందని. శరీరానికి తగినంత నిద్ర అవసరం. అది తగ్గినప్పుడు స్ట్రెస్‌ హార్మోన్ల‌ స్థాయి పెరుగుతుంది. దీంతో బీపీ పెరిగుతుంది.

ఎడమవైపు తిరిగి నిద్రించటం:

ఇక సరైన నిద్ర పట్టాలంటే పడుకొనే పొజిషన్ సరిగ్గా ఉండాలి. అప్పుడే అటు నిద్రలేమి, ఇటు హైపర్‌టెన్షన్‌ రెండూ కూడా రాకుండా ఉంటాయి. మరి అలాంటప్పుడు ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఏ పొజిషన్‌లో నిద్రించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సాదారణంగా హైబీపీ ఉన్నవారు ఎడమ వైపుకు తిరిగి పడకుంటే మంచిది. దీనివల్ల రక్తనాళాలపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.

స్లీప్ అప్నియా ఉన్నవాళ్ళు బోర్లా తిరిగి పడుకుంటే మంచిది. దీనివల్ల ప్రశాంతంగా నిద్రపడుతుంది.

అయితే ఎలా పడుకున్నప్పటికీ, రోజుకి ఖచ్చితంగా 7-8 గంటలు నిద్ర పోవటం అవసరం.

గర్భణీలు:

ఇక గర్భిణీలై ఉండి… అధిక రక్తపోటుతో బాధపడుతూ ఉన్నట్లయితే, వారుకూడా ఎడమవైపుకి తిరిగి పడుకోవడం మంచిది. దీనివల్ల శిశువు అంతర్గత అవయవాలపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే, రక్త ప్రసరణ బాగా జరిగి హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంటుంది.

ముగింపు:

ఏదేమైనా ఈ సమస్యతో బాదపడుతూ ఉన్నప్పుడు వీలైనంత వరకూ డాక్టర్ ని సంప్రదించటమే మంచిది.

Leave a Comment