కిడ్నీ ఫెయిలయ్యే ముందు కనిపించే సంకేతాలివే!

కిడ్నీలు మన శరీరంలో ఉండే మేజర్ ఆర్గాన్స్ లో ఒకటి. ఇవి రక్తాన్ని శుభ్రపరచడం, వ్యర్థ పదార్థాలను తొలగించడం, ద్రవ సమతుల్యతను కాపాడటం, మరియు రక్తపోటును నియంత్రించడం వంటి అనేక ముఖ్యమైన పనులను నిర్వహిస్తాయి. కిడ్నీల పనితీరు తగ్గిపోయినా లేదా సమస్యలు ఎదురైనా, మన శరీరం ఎన్నో సంకేతాలను చూపించగలదు. వీటిని గమనించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ముందే వాటిని గుర్తిస్తే చికిత్స ఈజీ అవుతుంది. ఈ రోజు ఈ ఆర్టికల్ లో కిడ్నీ ఫెయిలయ్యే ముందు కనిపించే కొన్ని హెచ్చరిక సంకేతాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం. పదండి!

కిడ్నీ ఫెయిలయ్యే ముందు కనిపించే సంకేతాలు

కిడ్నీలు పూర్తిగా దెబ్బతినకముందే మన శరీరంలో కొన్ని సంకేతాలు చూపిస్తుంటాయి. ఈ సంకేతాలు కిడ్నీ దెబ్బతినడానికి 7 రోజుల ముందే మన శరీరంపై కనిపిస్తాయి. ఈ సంకేతాలు కనిపిస్తే కిడ్నీ ఫెయిల్ అయిందని అర్థం చేసుకోవాలి. మరి ఆ సంకేతాలేవో తెలుసుకుందామా..!

తరచుగా మూత్ర విసర్జన

మీరు తరచుగా, ముఖ్యంగా రాత్రి సమయంలో, మూత్ర విసర్జనకి వెళ్తే, ఇది కిడ్నీ సమస్యకు సంకేతం కావచ్చు. ఎందుకంటే, మూత్రపిండాల వడపోత సామర్థ్యం దెబ్బతినడం వల్ల ఇది సంభవిస్తుంది.

మూత్రంలో మార్పులు

  • మూత్రం రంగు చిక్కటి పసుపు లేదా నారింజ రంగులోకి మారటం
  • మూత్రంలో రక్త్జం పడటం
  • మూత్రంలో ప్రోటీన్లు ఎక్కువైనప్పుడు నురుగు లేదా బుడగలు ఏర్పడటం
  • మూత్రం పోయేటప్పుడు మంట లేదా నొప్పి కలుగుతుండడం

శరీర ఉబ్బరము

కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే, శరీరంలో సోడియం నిల్వ ఎక్కువ అవుతుంది, దాంతో చేతులు, కాళ్లు, తొడలు, మోకాళ్లు, ముఖం ఉబ్బిపోయే అవకాశం ఉంది.

అలసట మరియు బలహీనత

కిడ్నీలు సరిగా పని చేయకపోతే, అవి తగినంత ఎర్రరక్త కణాలను ఉత్పత్తి చేయలేవు. ఫలితంగా, శరీరంలో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది, ఇది అలసట మరియు బలహీనతకు దారి తీస్తుంది.

చర్మ సమస్యలు మరియు దురద

కిడ్నీలు వ్యర్థాలను శరీరంలో నిల్వ చేయకుండా బయటికి పంపుతాయి. అవి సరిగ్గా పని చేయకపోతే, వ్యర్థాలు శరీరంలో చేరి చర్మ సమస్యలను, దురదను కలిగించవచ్చు.

ఇది కూడా చదవండి: ఈ లక్షణాలు కనిపిస్తే… కిడ్నీలో రాళ్లు ఉన్నట్టే..!

ఆకలి కోల్పోవడం

కిడ్నీ వ్యాధితో బాధపడే వారికి తరచుగా ఆకలి తగ్గిపోతుంది. శరీరంలో వ్యర్థ పదార్థాలు నిల్వ ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

ముఖం మరియు కళ్ళు ఉబ్బటం

ముఖం, కళ్ల చుట్టూ ఉబ్బరాన్ని గమనిస్తే, అది మూత్రంలో ప్రోటీన్ నష్టాన్ని సూచించవచ్చు. ఇది కిడ్నీలకు సంబంధించిన ఆరోగ్య సమస్య కావొచ్చు.

కండరాల నొప్పులు లేదా క్రాంప్స్

కిడ్నీ పనితీరుపై ప్రభావం పడితే, శరీరంలోని ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు నష్టపోతాయి. ఇది కండరాల నొప్పులకు లేదా నరాల సమస్యలకు దారితీస్తుంది.

అధిక రక్తపోటు

కిడ్నీలు రక్తపోటును నియంత్రించడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. అవి సరిగా పని చేయకపోతే, రక్తపోటు పెరగవచ్చు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

కిడ్నీలు ద్రవాన్ని బయటికి పంపలేకపోతే, ఊపిరితిత్తుల్లో ద్రవం చేరి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగించవచ్చు.

మైకం మరియు తల తిరగడం

కిడ్నీ వ్యాధి కారణంగా శరీరంలో ఆక్సిజన్ సరఫరా తగ్గితే, మెదడుకు తగినంత రక్తప్రసరణ జరగదు. ఇది తలనొప్పి, తేలికగా మైకం కావడం, మరియు దృష్టి సమస్యలకు దారితీస్తుంది.

కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా?

  • రోజుకు కనీసం 2-3 లీటర్ల నీరు తాగండి
  • అధిక ఉప్పు మరియు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించండి
  • ఆరోగ్యకరమైన మరియు పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకోండి
  • అధిక రక్తపోటు మరియు డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచండి
  • తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి
  • మద్యం మరియు పొగాకు సేవనాన్ని తగ్గించండి
  • వ్యాయామాన్ని రోజువారీ అలవాటుగా చేసుకోండి

ముగింపు

కిడ్నీలు శరీరంలో ముఖ్యమైన అవయవాలు, వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యవసరం. పై లక్షణాలలో ఏవైనా మీరు గమనిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా, మీరు కిడ్నీ సమస్యలను నివారించగలరు మరియు ఆరోగ్యంగా జీవించగలరు.

డిస్క్లైమర్

ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment