ఉదయాన్నే నిద్ర లేవగానే పొరపాటున కూడా ఈ పనులు చేయకండి!

రొటీన్ గా మనమొక మాట అంటుంటాం ఈ రోజు నా టైం చాలా బ్యాడ్ గా ఉంది అని.  రోజూ ఉండే టైమే కదా! అది గుడ్ గా… బ్యాడ్ గా ఎందుకు మారుతుందని మీరెప్పుడైనా ఆలోచించారా? లేదు కదూ! ఎపుడైనా ఒకవేళ ఆలోచించినా… మన గ్రహస్థితి బాలేదనో… మన తలరాత ఇంతేననో… సరిపెట్టుకుంటాం. కానీ, మనం చేసే కొన్ని పొరపాట్లే మన కొంప ముంచుతాయని ఎప్పుడైనా ఆలోచించారా..! 

ఉదయాన్నే నిద్ర లేవగానే చేయకూడని పనులు:

ఉదయాన్నే నిద్ర లేవగానే ఒక్కొక్కరికీ ఒక్కో విధమైన పని చేసే అలవాటు ఉంటుంది. అయితే, మనం చేసే ఆ పని వల్లే… ఆ రోజంతా పాజిటివ్ గా మారటమో… నెగెటివ్ గా మారటమో… జరుగుతుంది. అనుకోకుండా చేసే కొన్ని పనులు మనకి సమస్యలు తెచ్చిపెడతాయి. అలా జరగకుండా ఉండాలంటే, ఉదయాన్నే నిద్ర లేవగానే పొరపాటున కూడా పనులు చేయకూడదు. ఇంతకీ ఏంటా పనులు? వాటిని ఎందుకు చేయకూడదు? అనే విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 

మళ్లీ పడుకోవద్దు

కొంత మంది ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ఒకటే ఆవలిస్తూ… కొంతసేపటికి మళ్లీ పడుకునేస్తారు. ఈ విధంగా పొరపాటున కూడా చేయకండి. ఎందుకంటే, ఉదయపు ఆవలింతలు మనల్ని రోజంతా బోరింగ్ గా మారుస్తాయి. ఒకసారి నిద్ర నుంచి మేల్కొన్నాక ఈ విధంగా చేసినట్లయితే, ఆ రోజంతా మీరు మీ ఉత్సాహాన్ని కోల్పోయినట్లే! 

​అద్దంలో చూడొద్దు

కొంతమంది ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే తమ ముఖాన్ని అద్దంలో చూసుకునే అలవాటు ఉంటుంది. ఈ అలవాటును ఎంత త్వరగా మానుకుంటే అంత మంచిది. ఎందుకంటే, దీనివల్ల ప్రతికూల వాతావరణం  ఏర్పడే అవకాశముంటుంది. కాబట్టి ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత వీలైతే దేవుని పటం చూసి మీ దినచర్యను ప్రారంభించండి. ఇలా చేయడం ద్వారా మీలో సానుకూల శక్తి ప్రసరిస్తుంది.

Illustration showing a person taking control of their healthcare journey with health icons like fitness, nutrition, medical checkups, and technology.
హెల్త్ టిప్స్: హెల్త్‌కేర్ జర్నీని కంట్రోల్ చేయడానికి 6 మార్గాలు

వయోలెంట్ చిత్రాలను చూడొద్దు

కొన్ని ఇళ్లల్లో వయొలెన్స్ రేకెత్తే విధంగా కొన్ని జంతువుల పెయింటింగ్స్, లేదా బొమ్మలను గోడపై ఉంచుతారు. అలాగే, ఇంకొన్ని ఇళ్లల్లో తమ పిల్లల గదిలో అభిమాన కార్టూన్ ఫోటోని ఉంచడం చేస్తారు. ఈ రెండూ తప్పే! ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ఈ రెండింటిలోనూ దేనినైనా చూసినట్లయితే… ఆశుభంగా పరిగణించబడుతుంది. మీరు అలాంటి చిత్రాలను ఇంట్లో ఉంచితే వాటిని తొలగించడం మంచిది. అప్పుడే మీకు శుభకరంగా ఉంటుంది.

పెంపుడు జంతువులను చూడొద్దు

సాధారణంగా కొంతమంది నిద్ర లేవగానే తమ ఇంట్లో ఉండే పెంపుడు జంతువులను చూసి వాటితో ఆడుకోవడంతో రోజును ప్రారంభిస్తారు. అయితే పొరపాటుగా కూడా ఇలా చేయవద్దు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల రోజంతా చెడిపోతుంది. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మీ తల్లిదండ్రులు, లేదా పిల్లలతో గడపండి. ఈ విధంగా చేయడం ద్వారా రోజును మీరు ఉత్సాహంగా ప్రారంభిస్తారు. చురుకుగా పనిచేస్తారు.

నీడను చూడొద్దు

మీరు ఉదయం నిద్రలేచిన తర్వాత మీ సొంత నీడను కూడా మీరు చూడొద్దు. ఇలా చేయడం వల్ల మీ పనికి ఆటంకం ఏర్పడుతుందని, మీ మనస్సు ఏకాగ్రతతో పనిచేయదు. మీరు ఉదయం సూర్యుడిని చూస్తూ అనుకోకుండా పడమటి దిశలో మీ నీడను చూసినట్లయితే… దానిని  రాహవు సంకేతంగా పరిగణస్తారు. ఈ విధంగా జరిగితే మీరు ఆ రోజుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం లేదా డబ్బుకు సంబంధించిన పనులు వాయిదా వేసుకుంటే మంచిది.

​వంటగదిని చూడొద్దు

ఉదయాన్నే లేవగానే వంటగదిలోకి వెళ్లినట్లియితే అశుభ్రంగా ఉన్న ఎంగిలి పాత్రలను చూడగానే మన మైండ్ సెట్ మారిపోతుంది. ఎందుకంటే, వీటిలో ప్రతికూల శక్తులు ప్రసరిస్తాయి. అందుకే, వీలైనంత వరకు వెళ్లకపోవడమే మంచిది. ఒకవేళ అలా వెళ్ళాల్సి వస్తే… రాత్రి పూటే ఆ పాత్రలను శుభ్రం చేసిపెట్టుకోవాలి.

A person drinking water in summer to prevent heat stroke
వడదెబ్బ ఎవరినీ వదలదు… దాన్ని ఇలా హ్యాండిల్ చేయండి

రోజును ఇలా ప్రారంభించండి

ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే మొదట మన అరచేతులను చూసి, అనంతరం రెండు చేతులను కలిపి… వేడి పుట్టేలా రుద్ది… ముఖం మీద పెట్టుకోవాలి. చేతుల్లో లక్ష్మీ, సరస్వతి నివసిస్తారని నమ్ముతారు. అంతేకాకుండా మనలో నూతన సానుకూల శక్తి ప్రసారం అవుతుంది. 

ముగింపు 

పైన పేర్కొన్న వాటిలో ఏ ఒక్క అలవాటైనా మీకు ఉంటే… దానిని వెంటనే మానేయండి. మిమ్మల్ని మీరు మార్చుకొని… ఈ విధంగా చేయడం ద్వారా మీరనుకున్న కార్యాలు పూర్తవుతాయి.

డిస్క్లైమర్: ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment