మైదా పిండితో చేసిన వంటకాలు తింటే ఏం జరుగుతుందో మీరే చూడండి!

ఇటీవలి కాలంలో ఫుడ్ డెలివరీ యాప్స్ పుణ్యామా అని ప్రతి ఒక్కరు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసేయటం ఫ్యాషనై పోయింది. ఫుడ్ ఆర్డర్ చేయటం తప్పుకాదు, కానీ వాళ్ళు చూస్ చేసుకొనేది ఏంటో తెలుసా! పిజ్జాలు, బర్గర్లు, బ్రెడ్లు, కేకులు. ఇలాంటి జంక్ ఫుడ్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.

నిజానికి చాలా మంది పేరెంట్స్… తమ పిల్లలకు పెడుతున్న ఫుడ్ ఇదే! పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా కేక్స్, కుకీస్ వంటి వాటిని ఇష్టంగా తింటారు. ఇవి మాత్రమే కాదు, బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా తినే చపాతీ, పూరీ, పుల్కా, బోండా వంటివి కూడా చాలా డేంజర్. ఎందుకో తెలుసా! ఇవన్నీ మైదా పిండితో తయారు చేసినవే కాబట్టి.

నిత్యం మనకు తెలియకుండానే వివిధ రకాల ఫుడ్స్ రూపంలో మైదా పిండిని తినేస్తున్నాం. కానీ నిజానికి ఈ మైదాపిండి ఆరోగ్యానికి అంత మంచిది కాదు అనే విషయం మీకు తెలుసా!

మైదాపిండి ఎలా తయారవుతుంది?

వాస్తవానికి మైదాపిండి ఎలా తయారవుతుందో చాలామందికి తెలియదు. శనగపప్పు నుంచి శనగపిండి, బియ్యం నుంచి బియ్యప్పిండి, గోధుమల నుంచి గోధుమ పిండి తయారయినట్లే… మైదా పిండి కూడా గోధుమల నుండే తయారవుతుందన్న విషయం చాలా మందికి తెలియదు.

మైదా పిండి రావాలంటే… ముందుగా గోధుమలను మిల్లులో బాగా పాలిష్ చేస్తారు. వాటిని పిండి చేసి.. అజో బై కార్బొనమైడ్, బెంజోయిల్ పెరాక్సయిడ్, క్లోరిన్ వంటి కెమికల్స్ ని మిక్స్ చేస్తారు. మైదాలో “అల్లోక్సాన్” అనే టాక్సిక్ కెమికల్ ఉంటుంది. అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది.

మైదాపిండితో చేసిన పదార్ధాలను తింటే ఏం జరుగుతుతుంది?

మైదాపిండితో చేసిన పదార్ధాలను తినడం అంటే… మన చేత్తో మనమే వైట్ పాయిజన్ ని తినటం అనమాట. ఈ విషయం తెలియక చాలామంది పేరెంట్స్ తమ పిల్లలకి బ్రేక్ ఫాస్ట్, లేదా స్నాక్స్ రూపంలో వీటినే ప్రిఫర్ చేస్తున్నారు. మరి అలాంటి మైదాని మనం రెగ్యులర్ గా తింటే ఏం జరుగుతుందో మీరే ఓ లుక్కేయండి.

మైదా పిండితో చేసే ఆహారాలను తినడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు:

  • మైదా పిండితో తయారయ్యే ఆహారాలను రెగ్యులర్ గా తినడం వల్ల ఈజీగా బరువు పెరిగిపోతారు. మైదాలో క్యాలరీస్ ఎక్కువగానూ,. ఫైబర్ తక్కువగానూ ఉంటాయి. కాబట్టి దీన్ని ఎక్కువగా తింటే ఒబేసిటీకి ఛాన్స్ ఉంది.
  • మైదా పిండిలో గ్లైసెమిక్ ఇండెక్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల రక్తంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగిపోతాయి. ఈ కారణం చేత డయాబెటిక్ పేషెంట్లు ఈ మైదా పిండి కలిగి ఉన్న ఆహారాలు తింటే,.. వారి షుగర్ లెవల్స్ మరింత పెరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వీలైనంత వరకూ వీటికి దూరంగా ఉండటం మంచిది.
  • మైదాపిండితో చేసే ఆహారాలు ఎక్కువగా తీసుకునే వారిలో అరుగుదల సమస్యలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే.. మైదాలో ఫైబర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల బ్లోటింగ్, కాన్స్టిపేషన్ వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.
  • మైదా పిండితో చేసే ఫుడ్స్ తినటానికి రుచిగా అనిపించవచ్చు. కానీ అందులో ఏమాత్రం పోషకాలు ఉండవు. విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్.. ఇలాంటివి ఏమీ అస్సలు ఉండవు. అందుకే రెగ్యులర్ గా మైదా పిండి తినడం వల్ల మనలో పోషకాహార లోపం ఏర్పడే అవకాశం ఉంది.
  • మైదాపిండి తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా ఎక్కువవుతాయి.. మైదాలో కొలిస్ట్రాల్ కంటెంట్ ఎక్కువగా ఉండటం చేత వీటిని తింటే గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
  • మైదా తింటే… బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి… అది పేగులకు అతుక్కుపోతుంది. అక్కడ హాని చేసే బ్యాక్టీరియా ఉత్పత్తి పెరుగుతుంది. క్రమేపి అది ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. ఇదే రానురానూ ఆపెండిక్స్, క్యాన్సర్ వంటి రోగాలకు తలుపులు తెరుస్తుంది.
  • మైదాపిండితో చేసిన వంటకాలు అధికంగా తీసుకోవడం వలన సరిగ్గా జీర్ణం కాక కిడ్నీలో రాళ్ళను ఏర్పరుస్తుంది.

ముగింపు

ఇవి మాత్రమే కాదు, అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఈ మైదా పిండితో చేసిన వంటకాలని తినటం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే.. వీలైనంత వరకు దీనికి దూరంగా ఉండండి.

డిస్క్లైమర్:

ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment