చిరుధాన్యాలు తిన్న తర్వాత పొట్ట ఉబ్బరంగా అనిపిస్తే… ఈ సింపుల్ టిప్స్ పాటించండి!

Do You Feel Bloating After Eating Millets

ఈమధ్య కాలంలో తృణధాన్యాలపై ఎక్కువగా అందరూ మక్కువ చూపుతున్నారు. కారణం ఇవి శరీరానికి కావలసినంత పోషణని అందిస్తాయన్న ఉద్దేశ్యంతో. నిజానికి ఈ చిరుధాన్యాలతో చేసిన ఆహారం అనేది ఇప్పుడిప్పుడే వస్తున్న ఆచారం కాదు. పూర్వకాలంలో ఎక్కువగా అందరూ ఈ ఆహారాన్నే తీసుకొనేవారు. చిరు ధాన్యాలలో విటమిన్ బి, ఫైబర్, మినరల్స్, అమైనో యాసిడ్స్, కాల్షియం, మాంగనీస్, ఐరన్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన పోషణ అందించటంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గోధుమలు తినలేని వారికి … Read more

హఠాత్తుగా గుండెపోటు వస్తే ఇలా చేసి ప్రాణాలు కాపాడుకోండి..!

Heart Attack First Aid

ఇటీవలికాలంలో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు 40 ఏళ్ళు దాటితేనే వచ్చే గుండెపోటు ఇప్పుడు 20 ఏళ్లకే సంభవిస్తుంది. మానసిక ఒత్తిడి, తినే ఆహారం, మారిన జీవనశైలి తదితర కారణాలే గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతున్నాయి. మన శరీరంలోని అతి ముఖ్యమైన ఆర్గాన్స్ లో గుండె ఒకటి. రక్తాన్ని శరీరం అంతటా సరఫరా చేయడం దీని పని. ఇది యధావిధిగా పనిచేస్తూ… మిగిలిన అవయవాలను సజీవంగా ఉంచుతుంది. అయితే, గత కొన్నేళ్లుగా గుండె జబ్బులు, గుండెపోటు … Read more

ఈ 5 నెంబర్లు మీరు ఆరోగ్యంగా ఉన్నారో… లేరో… చెప్పేస్తాయ్!

Do You Know Your 5 Health Numbers?

మన శరీరం లోపల ఏం జరుగుతుందో మనకి తెలియకపోయినా పరవాలేదు కానీ, మన ఆరోగ్యానికి సంబంధించిన ఈ 5 నెంబర్ల గురించి మాత్రం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఎందుకంటే, ఈ 5 నెంబర్లు మనం పూర్తి ఆరోగ్యంగా ఉన్నామో… లేదో… చెప్పేస్తాయి. అందుకే మనం ఫిట్ గా ఉండాలంటే… ఈ నెంబర్లపై అవగాహన ఉండాలి. ఇక విషయానికొస్తే… ఒకప్పుడు బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులని టెస్ట్ చేయించుకోవాలంటే, ఖచ్చితంగా హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చేది. కానీ … Read more

వర్షాకాలంలో మీ పిల్లలను దోమ కాటు నుంచి రక్షించాలంటే… ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి!

Natural Tips to Protect your Kids against Mosquito Bites during Monsoon

మాన్ సూన్ సీజన్ వచ్చిందంటే చాలు.. సీజనల్ వ్యాధులు చుట్టుముడుతూ ఉంటాయి. ముఖ్యంగా చికన్‌గన్యా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలని దోమలు మోసుకువస్తాయి. శిశువులు, లేదా పిల్లలు ఎక్కువగా ఈ వ్యాదులబారిన పడుతుంటారు. పిల్లలనగానే ఎక్కడపడితే అక్కడ ఆడుకుంటూ ఉంటారు; అలానే ఏది పడితే అది తింటుంటారు. నిజానికి వీరు దోమల కాటు నుంచి తమని తాము రక్షించుకోలేరు. అందుకే పెద్దవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సింపుల్ టిప్స్ పాటించి తమ తమ పిల్లల్ని … Read more

యాలకులు తింటే ప్రయోజనాలెన్నో..!

Benefits of Cardamom

సుగంధ ద్రవ్యాలలో ఒకటిగా చెప్పుకొనే యాలకుల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. ఇవి ఆహార రుచిని పెంచడంతోపాటు, ఆకలిని కూడా పెంచుతాయి. రుచి, సువాసన మాత్రమే కాదు, రెగ్యులర్‌గా వీటిని తింటే… ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాక, పలు అనారోగ్య సమస్యలని కూడా నివారిస్తాయి. ఏలకులను చాలామంది మౌత్ ఫ్రెష్‌నర్‌గా తింటుంటారు. నిజానికి యాలకులలో విటమిన్ B3, B6, C, జింక్, కాల్షియం, పొటాషియం వంటివి ఉన్నాయి. అలాగే వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, … Read more

కల్తీ పాలను ఇంట్లోనే ఈజీగా చెక్‌ చేసుకోండిలా..!

How to Check Adulterated Milk at Home

పాలు పోషకాహారం. అలాంటి పాలు కూడా కల్తీ అయిపోతున్న రోజులివి. తినే ఆహారం నుండీ తాగే నీటివరకూ అన్నీ కల్తీ అయిపోతున్న ఈ రోజుల్లో నాణ్యమైన, స్వచ్చమైన పాలని మనం తాగలేమా అంటే… ఖచ్చితంగా దానికో సొల్యూషన్ ఉంది. పాల నాణ్యతను, స్వచ్ఛతను తనిఖీ చేసుకోవచ్చు. అదికూడా ఇంటివద్దనే. మీరు విన్నది నిజమే! పాలల్లో కల్తీని ఇంట్లోనే ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సింథటిక్: మనం తాగే పాలలో సింథటిక్ కలిస్తే… అలాంటి … Read more

తల వెనుక నొప్పి వస్తుందా..! కారణాలు ఇవే కావొచ్చు!

What Causes Pain in the Back of the Head

తల నొప్పి అనేది అందరికీ కామన్ గా వచ్చే రుగ్మత. అయితే కొంతమందికి మాత్రం తల అంతా నొప్పి రాకుండా… కేవలం తలలోని ఒక భాగం మాత్రమే నొప్పి వస్తుంది. వాళ్ళు తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు ఆ నొప్పి మరింత పెరుగుతుంది. ఇలా వచ్చే నొప్పి అనేక కారణాల వల్ల వస్తుంది. వెన్నెముకలో అన్నింటికన్నా పైన ఉండే వెన్నుపూసను ‘అట్లాస్‌ – C1’ అంటారు. ఇది పుర్రెను రెండో వెన్నుపూసతో కలుపుతుంది. మన తల భాగం కదలటానికి … Read more

గోధుమ రంగు గుడ్డు Vs తెలుపు రంగు గుడ్డు వీటిలో ఏది వెరీ గుడ్డు?

Brown Eggs Vs White Eggs: Which One is Better?

గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్తుంటారు. అందుకే డాక్టర్లు సైతం దీనిని సిఫార్సు చేస్తుంటారు. గుడ్డులో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడతాయి. ఇందులో ఉండే ఐరన్, కాల్షియం, సెలీనియం, ఫాస్పరస్ వంటివి మెదడు, మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో దోహదపడతాయి. గుడ్డులో ఉండే కోలిన్ మెదడు, మరియు శరీరంలోని ఇతర ముఖ్యమైన విధులను నియంత్రించడంలో సహాయపడుతుంది. గుడ్డు సొనలో లూటీన్, జియాక్సంతిన్ అనే రెండు పవర్ఫుల్ … Read more