Natural Remedies for Sore Throat and Cough

వింటర్ సీజన్ వచ్చేసింది. దానితో పాటు చాలా ఆరోగ్య సమస్యలు కూడా పిలవకుండానే వచ్చెస్తాయి. ఇలాంటి వాటిలో జలుబు, దగ్గు, జ్వరం మరియు గొంతు నొప్పి ముఖ్యమైనవి. వీటితో పాటు, మీరు విపరీతమైన అలసట మరియు రోజువారీ పనులు చేసుకోవటంలో ఇబ్బందిని కూడా అనుభవించవచ్చు. అయినప్పటికీ, కొన్ని హోమ్ రెమెడీస్  పాటించి వాటిని నివారించవచ్చు. అవేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. 

జలుబు, దగ్గు, గొంతునొప్పి కి ఇంటి నివారణలు

జలుబు, దగ్గు, గొంతునొప్పి కి ఈ క్రింద తెలిపిన హోమ్ రెమెడీస్ పాటించండి.

అల్లం

అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాన్ని కలిగి ఉంది. ఇది దగ్గును ఎంతో సమర్ధవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. అందుకే అల్లాన్ని మీ ఆహారంలో జోడించండి. మరింత ప్రభావవంతమైన ఫలితాల కోసం తేనెతో తాజా అల్లం కలపండి లేదా అల్లం కలిపినా కప్పు టీ తీసుకోండి.

తేనె

దగ్గుకు తేనె ఎఫెక్టివ్ రెమెడీ. ఇది యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీమైక్రోబయల్ లక్షణాలతో లోడ్ చేయబడింది. ఇది చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరికీ ఉపయోగపడుతుంది. దగ్గు నుండి బయటపడటానికి సాధారణంగా ఒక టేబుల్ స్పూన్ తేనెలో కొన్ని చుక్కల అల్లం రసం కలుపుతారు. ఇంకా వేడి వేడి లెమన్ టీ లేదా గ్రీన్ టీకి కూడా తేనెని జోడించవచ్చు.

పసుపు

శీతాకాలం కోసం పసుపు వాడకం తప్పనిసరిగా ఉండాలి. ఇది మిమ్మల్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇంకా జలుబు మరియు దగ్గు లక్షణాలను కూడా తగ్గిస్తుంది. పసుపు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

Glass of jeera water and mint leaves for gas relief in hot summer
వేసవిలో గ్యాస్ వస్తే… హోమ్ రెమెడీ ఇదే బాస్!

విటమిన్ సి

వింటర్ సీజన్ లో విటమిన్ సి ఒక అద్భుతమైన రోగనిరోధక శక్తి. బలమైన రోగనిరోధక శక్తి సీజనల్ వ్యాధుల ఆగమనాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. తగినంత సిట్రస్ పండ్లను జోడించడం రోగనిరోధక పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: Winter Immune System Boosters

ఉప్పు నీటితో పుక్కిలించడం

ఉప్పు నీటితో పుక్కిలించడం శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఇది గొంతు మంట, గొంతు నొప్పి యొక్క తీవ్రతను కూడా తగ్గిస్తుంది. 

ఆవిరి పట్టటం 

ఆవిరి పట్టటం వల్ల శ్వాస తీసుకోవడం ఈజీ అవుతుంది. ఇది శ్వాసనాళాలకు తేమను అందించడం ద్వారా దగ్గు తగ్గటానికి కూడా సహాయపడుతుంది.

సూప్‌లు

సూప్‌లు చలి తీవ్రతను తగ్గించి త్వరగా కోలుకునేలా చేస్తాయి. అవి మిమ్మల్ని వెచ్చగా ఉంచుతాయి మరియు మీ రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇచ్చే అవసరమైన పోషకాలను పుష్కలంగా అందిస్తాయి.

Applying coconut oil as the ultimate remedy for itching relief
ఒక్క చుక్క నూనె – ఇక దురదలకు గుడ్‌బై

వేడి పానీయాలు

చలికాలంలో టీలను సాధారణంగా తీసుకుంటారు. వెచ్చగా ఉండటానికి మీరు మీ శీతాకాలపు ఆహారంలో ఇతర వేడి పానీయాలను కూడా జోడించవచ్చు. వేడి పానీయాలు తాగడం వల్ల గొంతు నెప్పి, గొంత మంట నుండి ఉపశమనం లభిస్తుంది.

చివరిమాట 

ఈ రెమెడీస్ అన్నీ వ్యాధి తీవ్రతను తగ్గించగలవు. అలాగే, వ్యవధిని తగ్గించవచ్చు. మీ లక్షణాలు తీవ్రమైతే, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.

డిస్క్లైమర్

ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment