మీ మెమొరీని లాస్ చేసేది ఈ రోజువారీ అలవాట్లే!

మనం రోజు చేసే కొన్ని చిన్న చిన్న పనులు మన మెదడు పనితీరును ప్రభావితం చేస్తాయి. నిజానికి మనలో చాలామంది అవి సాదారణ పనులే కదా అనుకొంటారు. కానీ, అవి మన మెదడుపై తీవ్ర ప్రభావం చూపి, మెమరీని లాస్ చేస్తాయి. మీలో ఎవరైనా ఏదైనా విషయాలను పదే పదే మర్చిపోతుంటే, ఏకాగ్రతతో ఇబ్బంది పడుతుంటే లేదా మానసికంగా అలసిపోయినట్లు అనిపిస్తే, వారికి ఈ అలవాట్లే కారణం కావచ్చు. అవేంటో ఇప్పుడే చూసేద్దాం.

నిద్రలేమి

తగినంత నిద్ర లేకపోవడం మెదడు పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. నిద్రలో మెదడు మొత్తం రోజంతా జరిగిన విషయాలను జ్ఞాపకంగా నిలుపుకుంటుంది. నిద్రలేమితో బాధపడేవారు ఎక్కువగా మతిమరపుతో ఇబ్బంది పడతారు. కనుక, రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.  

అధిక ఒత్తిడి

స్ట్రెస్ లేదా ఒత్తిడి అధికంగా ఉండటం మెమొరీ తగ్గడానికి ప్రధాన కారణం. ఒత్తిడితో మెదడులో కార్టిసాల్ అనే హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది, ఇది మెదడు న్యూరాన్లను దెబ్బతీసే ప్రమాదం ఉంది. మెమొరీని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ధ్యానం, యోగా, వంటివి చేస్తూ, ప్రశాంతత కోసం సమయం కేటాయించాలి.  

శారీరక వ్యాయామం లేకపోవడం 

వ్యాయామం మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. వ్యాయామం ద్వారా రక్తప్రసరణ మెరుగుపడి మెదడుకు తగినంత ఆక్సిజన్ అందుతుంది. కదలికలు లేకపోతే మెదడు నెమ్మదిగా వృద్ధాప్య లక్షణాలను చూపించగలదు. కనుక ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడక, వ్యాయామం చేయడం మంచిది.  

అనారోగ్యకరమైన ఆహారం  

జంక్ ఫుడ్, అధిక చక్కెర, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం మెదడు పనితీరును దెబ్బతీయగలదు. అమైనో ఆమ్లాలు, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు లేని ఆహారం మెమొరీ బలహీనతకు కారణమవుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు నట్స్, పచ్చి కూరగాయలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మంచిది.  

ధూమపానం, మద్యపానం  

ధూమపానం, మద్యం ఎక్కువగా సేవించడం మెదడులోని నాడీ కణాలను నాశనం చేస్తాయి. దీర్ఘకాలికంగా వీటిని అలవాటు చేసుకుంటే మెమొరీ శక్తి తగ్గిపోతుంది. కనుక వీటిని పూర్తిగా మానుకోవడం ఉత్తమం.  

Digital illustration showing a person walking after eating to reduce heart attack risk
భోజనం తర్వాత 15 నిమిషాల వాకింగ్ గుండెపోటుని తగ్గిస్తుందా?

ఇది కూడా చదవండి: క్షణాల్లో నిద్ర పట్టాలంటే… సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!

మల్టీ టాస్కింగ్

మల్టిపుల్ పనులని ఒకేసారి చేయడం వల్ల మన మెదడు దృష్టిని ఏ పనిపైనా కేంద్రీకరించలేకపోతుంది. దీని వల్ల మనం చేసిన పనులను సరిగ్గా గుర్తుంచుకోలేం. ఒకేసారి ఒక పనిని చేయడం మెమొరీని మెరుగుపరచడానికి మంచిది. 

గాడ్జెట్లు ఎక్కువగా వాడడం

స్మార్ట్‌ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్ వంటివి ఎక్కువగా ఉపయోగించడం వల్ల మెదడు స్వతంత్రంగా ఆలోచించలేకపోతుంది. మెదడును ఎక్కువగా ఉపయోగించకపోతే, జ్ఞాపకశక్తి మందగిస్తుంది. కనుక గాడ్జెట్లపై ఆధారపడకుండా, పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి.  

నీటి లోపం

తగినంత నీరు తాగకపోతే మెదడు పనితీరు మందగిస్తుంది. మెదడులో 75% నీరు ఉంటుంది, కనుక నీటి లోపం మెమొరీపై ప్రభావం చూపుతుంది. కనీసం రోజుకు 2-3 లీటర్లు నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది.

ఒంటరితనం

ఒంటరితనం మీ మెదడును కుంచించుకుపోయేలా చేస్తుందని మీకు తెలుసా? మానసిక ఆరోగ్యానికి సామాజిక పరస్పర చర్య చాలా అవసరం. అందుకే, కాన్వర్జేషన్స్, మీ ఐడియాలని ఇతరులతో పంచుకోవటం, ప్రియమైనవారితో సమయం గడపడం ఇలాంటివన్నీ చేయటం వల్ల మీ  ఆలోచనా నైపుణ్యాలను పదును పెట్టడానికి జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది. 

మరోవైపు, మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉంచుకోవడం వల్ల మానసిక ఒత్తిడి మరియు నిరాశకు కూడా దారితీస్తుంది – ఇవి జ్ఞాపకశక్తిని నేరుగా ప్రభావితం చేసే పరిస్థితులు. మీ మెదడును చురుకుగా ఉంచడానికి స్నేహితులతో కనెక్ట్ అవ్వడం, సామాజిక సమూహాలలో చేరడం లేదా సరదా చర్చలలో పాల్గొనడం అలవాటు చేసుకోండి.

Eating carrots daily reduces cancer risk and improves blood health
క్యారెట్ తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందా?

ముగింపు

పైన చెప్పుకొన్న విషయాలలో మీ మెమొరీని  లాస్ చేసే మీ అలవాట్లు ఏవైతే ఉన్నాయో… ముందు వాటిని గుర్తించండి. తర్వాత ఆ అలవాట్లకి దూరమవ్వండి. ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబించడం ద్వారా బ్రెయిన్ పవర్ ని మెరుగుపరచుకోవచ్చు. 

డిస్క్లైమర్

ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment