నాన్ – స్మోకింగ్ విమెన్ లో కూడా లంగ్ క్యాన్సర్ ఎందుకు పెరుగుతుంది?

ప్రస్తుతకాలంలో లంగ్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా స్మోకింగ్ అలవాటు లేని మహిళల్లో కూడా అధిక సంఖ్యలో ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా లంగ్ క్యాన్సర్ అనగానే స్మోకింగ్ అలవాటు ఉన్నవారిలోనే ఎక్కువగా ఉంటుందని భావించేవారు. కానీ రీసెంట్ గా జరిగిన కొన్ని రీసర్చిలలో మెడికల్ రిపోర్ట్స్ చూస్తే నాన్ – స్మోకింగ్ విమెన్ లో కూడా లంగ్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. మరి అలాంటప్పుడు అసలు దీని వెనుక ఉన్న మెయిన్ రీజన్స్ ఏంటో తెలుసుకుందాం.

లంగ్ క్యాన్సర్ పై అవేర్నెస్

లంగ్ క్యాన్సర్ అనేది లంగ్స్ లో ట్యూమర్స్ వంటివి ఏర్పడి, అవి క్రమంగా పెరిగి పల్మనరీ ఫంక్షన్ ను దెబ్బతీయడం వల్ల కలిగే ప్రాణాంతక వ్యాధి. బేసిగ్గా ఇది 2 టైప్స్ లో ఉంటుంది.

స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ (SCLC)

ఇది చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది.

నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ (NSCLC)

ఇది తక్కువ స్పీడ్ తో స్ప్రెడ్ అవుతుంది.

ఈ రెండు రకాలలో, నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ ఎక్కువ మందికి కనిపిస్తుంది. స్మోకింగ్ అలవాటు ఉన్నవారిలో క్యాన్సర్ వస్తుందనే ఫీలింగ్ ఎక్కువగా ఉంది, కానీ రీసెంట్ స్టడీస్ లో స్మోకింగ్ అలవాటు లేని మహిళల్లో కూడా ఈ డిసీజ్ పెరుగుతోందని తేలింది.

స్మోకింగ్ అలవాటు లేని మహిళల్లో లంగ్ క్యాన్సర్ పెరుగటానికి కారణాలు

సాదారణంగా ఈ పెరుగుదల వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి:

ఎయిర్ పొల్యూషన్

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువైపోయింది. ఎయిర్ లో ఉండే డస్ట్ పాటికల్స్(PM2.5, PM10) మన లంగ్స్ లో చేరి క్యాన్సర్ కారకమైన ట్యూమర్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ముఖ్యంగా, సిటీస్ లో అయితే పొల్యూషన్ ఎక్కువగా ఉండటం వల్ల మహిళలు దీని ప్రభావానికి గురవుతున్నారు.

పాసివ్ స్మోకింగ్

అంటే, స్మోక్ చేసే వ్యక్తుల పక్కన ఉంటే కూడా వాళ్ళు వదిలే సిగరెట్ పొగ ఇండైరెక్ట్ గా బ్రీతింగ్ ద్వారా శరీరంలోకి వెళ్లి లంగ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఫ్యామిలీలో ఎవరైనా స్మోక్ చేసే అలవాటు ఉంటే, అది స్మోకింగ్ అలవాటు లేని వ్యక్తికి కూడా ప్రమాదకరంగా మారుతుంది.

హౌస్ పొల్యూషన్

సాదారణంగా హౌస్ వైఫ్స్ ఎక్కువ టైమ్ ఇంట్లోనే గడుపుతారు. కుకింగ్ టైమ్ లో ఉపయోగించే గ్యాస్, కోల్, ఇంకా అనేక రకాల హోమ్ అప్లయన్సెస్ వల్ల రిలీజయ్యే హర్మ్ఫుల్ కెమికల్స్ రెస్పిరేటారీ ప్రొబ్లెమ్స్ కి దారి తీస్తాయి.

జెనెటిక్ రీజన్స్

కొన్ని ఫామిలీస్ లో జెనెటిక్ రీజన్స్ వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. స్మోక్ చేసే అలవాటు లేకపోయినా, కొంతమంది మహిళల్లో ఈ జెనెటిక్ రీజన్స్ వల్ల ఈ వ్యాధి అభివృద్ధి చెందుతోంది.

హార్మోనల్ చేంజెస్

మహిళల్లో హార్మోనల్ చేంజెస్ కూడా లంగ్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచేలా చేస్తాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ పెరగడం లేదా తగ్గడం వల్ల కొన్ని ట్యూమర్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది.

డైటరీ ఫ్యాక్టర్స్

మాల్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవటం లేదా టూ మచ్ గా ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం, ప్రాసెస్ద్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వంటి కారణాలు కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

ఇది కూడా చదవండి: ఈ లక్షణాలు కనిపిస్తే… ఊపిరితిత్తులు డేంజర్‌లో పడినట్లే!

లక్షణాలు మరియు గుర్తించే విధానం

ఈ వ్యాధిని ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. లంగ్ క్యాన్సర్ యొక్క ప్రధాన లక్షణాలు:

  • దీర్ఘకాలిక దగ్గు (Chronic Cough)
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (Shortness of Breath)
  • ఛాతి నొప్పి (Chest Pain)
  • గాత్రమాంద్యం (Hoarseness)
  • అలసట (Fatigue)
  • ఆకలి కోల్పోవడం, బరువు తగ్గడం
  • రక్తంతో కూడిన తుమ్ములు

ఈ లక్షణాలు కనిపించిన వెంటనే మెడికల్ టెస్టులు చేయించుకోవాలి.

నిర్ధారణ మరియు చికిత్స

ఈ వ్యాధిని నిర్ధారించడానికి కొన్ని ముఖ్యమైన వైద్య పరీక్షలు చేస్తారు:

  • సీటీ స్కాన్ (CT Scan)
  • ఎక్స్-రే (X-Ray)
  • బయాప్సీ (Biopsy)
  • పెట్ స్కాన్ (PET Scan)

చికిత్స విధానం

సర్జరీ

క్యాన్సర్ గ్రస్త ట్యూమర్ ని తొలగించడం.

కీమోథెరపీ

క్యాన్సర్ కణితులను నాశనం చేయడానికి ఔషధాలు ఇవ్వడం.

రేడియేషన్ థెరపీ

కణితిని కిరణాలతో తగలబెట్టడం.

ఇమ్యునోథెరపీ

రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే మందులు వాడడం.

నివారణ

ఉపాయంగా, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నివారించడానికి కొన్ని మార్గాలను అనుసరించాలి:

  • శుద్ధమైన గాలి కలిగిన ప్రదేశాల్లో జీవించడం.
  • ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.
  • పాసివ్ స్మోకింగ్ నుండి దూరంగా ఉండటం.
  • ఇంట్లో వంటకాల సమయంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ వాడటం.
  • వ్యాయామం, యోగా వంటివి చేయడం.
  • ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవడం.

ముగింపు

స్మోకింగ్ అలవాటు లేని మహిళల్లో లంగ్ క్యాన్సర్ కేసులు పెరగడం భయంకరమైన విషయం. దీని వెనుక ఎయిర్ పొల్యూషన్, పాసివ్ స్మోకింగ్, జెనెటిక్ రీజన్స్ వంటి అనేకా అంశాలు దాగున్నాయి. కాబట్టి, ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం ద్వారా క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ సమస్యను అర్థం చేసుకుని, దాని నుంచి బయటపడేందుకు అవేర్నెస్ కలిగి ఉండటం చాలా ముఖ్యం.

డిస్క్లైమర్

ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment