అకస్మాత్తుగా చెమటలు పడుతున్నాయా… అయితే అది దీనికి సంకేతం కావచ్చు!!

ఏదైనా కష్టమైన పని చేసిన తర్వాతో… లేదంటే వ్యాయామం చేసినప్పుడో… అదీ కాకపోతే, వాతావరణం వేడిగా ఉన్నప్పుడో… చెమటలు పట్టడం అనేది అందరికీ కామనే! అలా కాకుండా అకస్మాత్తుగా చెమటలు పడుతుంటే మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయమే! 

ఆత్రుత, లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు చెమట పడుతుంది. కానీ, అది అవసరానికి మించి చెమట పడితే అది అనర్ధమే! ఇలా టూమచ్ స్వెట్టింగ్ జరిగితే దానిని మెడికల్ టెర్మినాలజీ ప్రకారం ‘హైపర్‌ హైడ్రోసిస్‌’ అంటారు. 

ఈ డిసీజ్ కారణంగా ముఖం, చేతులు, పాదాలు, అండర్ ఆర్మ్స్ వంటివి ప్రభావితం అవుతాయి. అధిక చెమటతో తలనొప్పి, ఛాతీ నొప్పి, కడుపులో వికారం వంటివి కూడా ఏర్పడతాయి. 

ఇలా ఆకస్మికంగా చెమటలు పట్టడం గుండెపోటుకు సంకేతం. గుండెపోటు సమయంలో గుండెకు ఎక్కువ రక్తం అవసరమవుతుంది. అప్పుడు కరోనరీ ధమనులు గుండెకు రక్తాన్ని సరిగ్గా పంపింగ్ చేయలేవు. దీంతో రక్తాన్ని తీసుకువెళ్లడానికి ధమనులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో, బాడీ టెంపరేచర్ ని కంట్రోల్ చేయటానికి ఎక్కువ చెమట పట్టటం మొదలవుతుంది.

గుండెపోటు అనేది చాలా తీవ్రమైన శారీరక పరిస్థితి. ఈ సమయంలో వ్యక్తి కోలుకునే అవకాశం చాలా తక్కువ. ఎక్కువగా అతని ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. కరోనరీ ధమనులు గుండెకు రక్తాన్ని తీసుకువెళతాయి. కానీ. ఈ సమయంలో గుండె కండరాలకు రక్తాన్ని సరిగ్గా తీసుకెళ్లలేవు. దీని కారణంగా గుండెపోటు వస్తుంది. దీనినే ‘కార్డియాక్ అరెస్ట్’ అని అంటారు.

చెమట అనేది శరీరాన్ని నేచురల్ గా చల్లబరచుకునే ఓ ప్రక్రియ.. బాడీ టెంపరేచర్ పెరిగినప్పుడు నెర్వస్ సిస్టమ్ ఆటోమేటిక్ గా ఈ స్వెట్ గ్లాండ్స్ ని మోటివేట్ చేస్తుంది. దానివల్ల స్వెట్ అనేది ఏర్పడుతుంది. 

llustration showing gut health and personalized nutrition with healthy foods and microbiome symbols
గట్ హెల్త్ సీక్రెట్: పర్సనలైజ్డ్ న్యూట్రిషన్ తో హెల్త్ పవర్

అయితే, హైపర్‌ హైడ్రోసిస్‌ ఏర్పడినప్పుడు నెర్వస్ సిస్టమ్ స్వెట్ గ్లాండ్స్ ని మోటివేట్ చేయనప్పటికీ, అవి ఓవర్ గా రియాక్ట్ అవుతాయి. ఆ సమయంలో ఏర్పడిన ఒత్తిడి, లేదా భయంతో… సమస్య మరింత తీవ్రమవుతుంది. 

ఈ రకమైన హైపర్ హైడ్రోసిస్‌కు వైద్యపరమైన కారణం లేదు. ఇది వంశపారంపర్యంగా సంభవించవచ్చు.

సెకండరీ హైపర్ హైడ్రోసిస్‌ అనేది అధిక చెమట పట్టినప్పుడు సంభవిస్తుంది. ఇది విపరీతమైన చెమటకు దారితీస్తుంది. 

ఇక మెనోపాజ్ దశలో రాత్రిపూట స్త్రీలకు విపరీతంగా చెమటలు పడుతుంటాయి. అందుకే, జాగ్రత్తగా ఉండాలి.

చెమటలు పట్టడం అనేది ‘అథెరోస్క్లెరోసిస్‌’ వల్ల కూడా సంభవించవచ్చు ఈ పరిస్థితిలో ప్లేక్ అని పిలిచే కొవ్వు పేరుకుపోవడం వల్ల ధమనులు ఇరుకుగా మారుతాయి. అలాంటప్పుడు అథెరోస్క్లెరోసిస్ గుండెపోటుతోపాటు గుండె వైఫల్యానికి దారితీస్తుంది.

ఇవే కాక మరికొన్ని కారణాల వల్ల కూడా విపరీతమైన చెమట పడుతుంది. అవి – 

llustration showing health risks of consuming too much instant noodles, including stomach bloating, weight gain, and poor nutrition**
నూడుల్స్ తినడం ఆరోగ్యానికి హానికరమా? 90% మందికి తెలియని నిజాలు!
  • గుండెపోటు
  • మధుమేహం
  • థైరాయిడ్
  • మెనోపాజ్ లో వచ్చే వేడి ఆవిర్లు
  • కొన్ని రకాల క్యాన్సర్
  • లో బ్లడ్ షుగర్ 
  • నాడీ వ్యవస్థ లోపాలు
  • అంటువ్యాధులు
  • ఓపియాయిడ్ వంటి కొన్ని మందులు 

ఇవన్నీ అధిక చెమటకు దారితీయవచ్చు.

  • చిక్కులు:

విపరీతంగా చెమట పట్టే వ్యక్తులు త్వరగా అంటువ్యాధులు, లేదా చర్మవ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.

ముగింపు:

ఏదేమైనా ఇలా సడెన్ గా స్వెట్టింగ్ ఏర్పడితే అది ఖచ్చితంగా గుండె సంబంధిత జబ్బులకి దారితీస్తుంది. ఇలాంటి సమస్య కనుక ఎదురైతే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి… తగు జాగ్రత్తలు తీసుకోకుంటే… ప్రాణాపాయ స్థితి నుండీ బయట పడవచ్చు. లేదంటే, ప్రాణాలని ప్రమాదంలో పడేసినట్లే!

Leave a Comment