ఫేక్ సప్లిమెంట్స్‌ ని గుర్తించడం ఎలా..?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యంగా ఉండటం కోసం కొంతమంది డైట్‌తో పాటు సప్లిమెంట్లని కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే, ఈ రోజుల్లో చాలా రకాల డైట్ సప్లిమెంట్స్ మనకి మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కానీ, వాటిలో రియల్ ఏవి? ఫేక్ ఏవి? అనేది గుర్తించడమే చాలా కష్టం.

సప్లిమెంట్లలో ఏవి రియల్? ఏవి ఫేక్ గుర్తించడం ఎలా?

సాదారణంగా ఫేక్ సప్లిమెంట్స్‌లో బ్యాన్ చేసిన స్టెరాయిడ్స్ వంటి హానికరమైన కెమికల్స్, మరియు స్ఫురియస్ వంటి పదార్ధాలు ఉంటాయి. కానీ, వాటి రంగు, గుణం మాత్రం చూడటానికి రియల్ సప్లిమెంట్స్‌ లానే ఉంటాయి. ఫేక్ సప్లిమెంట్స్‌ ని ఉపయోగించడం వల్ల బాడీ పర్మినెంట్ గా డ్యామేజ్ అవుతుంది. అందుకే, క్వాలిటీ సప్లిమెంట్స్ ని ఉపయోగిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రావాలి. మరి అలాంటప్పుడు ఫేక్ సప్లిమెంట్లని ఎలా గుర్తించవచ్చో ఈ ఆర్టికల్ ద్వారా నేను మీకు తెలియచేద్దామని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం రండి.

బార్ కోడ్స్‌ చూడండి

ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వాడుతున్నారు. పైగా దానిలో అనేక రకాల యాప్స్ కూడా ఉంటాయి. ఈ నేపధ్యంలో బార్ కోడ్స్, క్యూఆర్ కోడ్స్ వంటివి చూడడానికి ప్రత్యేకమైన యాప్స్ ఉన్నాయి. వాటి ద్వారా ప్రోడక్ట్ బార్ కోడ్ స్కాన్ చేసి వాటి వివరాలను తెలుసుకోవటం ఏమంత కష్టమైన పని కాదు. బార్ కోడ్ చెక్ చేయడం ద్వారా ఏది రియల్ ప్రోడక్ట్… ఏది ఫేక్ ప్రోడక్ట్… అనే విషయాలు స్పష్టమవుతాయి.

ప్యాకేజ్, మరియు సీల్‌ని చూడండి

మార్కెట్లో ఒక ప్రోడక్ట్ కొన్నారంటే, దాని ప్యాకేజ్, మరియు సీల్‌ని చూసినప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. ఆ ప్రోడక్ట్ పై స్పెల్లింగ్ మిస్టేక్ కానీ, లేదా సరైన పదాలు లేకుండా కానీ కనబడతాయి. దీనితో మీకు ఆ ప్రోడక్ట్ నిజమో… కాదో… తెలిసిపోతుంది.

ఎఫ్ఎస్ఎస్ఏఐ అప్రూవల్ చూడండి

ఏదైనా ప్రోడక్ట్స్‌ని కొనుగోలు చేసేటప్పుడు దాని మీద ఎఫ్ఎస్ఎస్ఏఐ (fssai) అప్రూవల్ ఉందో లేదో చూడాలి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అప్రూవల్ లేకపోతే అది ఫేక్ ప్రోడక్ట్ అని నిర్దారించుకోవాలి. మీరు ప్రోడక్ట్స్ కొనేటప్పుడు ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు.

హోలోగ్రామ్ చూడండి

నిజమైన ప్రోడక్ట్ ఏదో, ఫేక్ ప్రోడక్ట్ ఏదో తెలుసుకోవడానికి బ్రాండ్ యొక్క హోలోగ్రామ్‌ని చూడండి. దీని ద్వారా కూడా మీరు కొన్న ప్రోడక్ట్ నిజమయిందో, కాదో అనేది తెలుస్తుంది.

ఎమ్మార్పీ స్టిక్కర్‌ చూడండ

ఏదైనా ప్రోడక్ట్ ని కొనుగోలు చేసేటప్పుడు దాని మీద ఎమ్మార్పీ స్టిక్కర్‌ ఉందో… లేదో… మీరు గమనించాలి. ఈ ఎమ్మార్పీ స్టిక్కర్ ప్రింట్ కింద లేకుండా, ప్రత్యేకంగా అంటించినట్టు ఉంటే అది ఖచ్చితంగా ఫేక్ ప్రోడక్ట్ అని మీరు గమనించాలి. నిజమైన సప్లిమెంట్స్‌కి ఎమ్మార్పీ ట్యాగ్ ఉండి తీరుతుంది.

ప్రోగ్రామ్ చెక్ చేయండి

ఎప్పుడైనా మీరు ఏదైనా ఒక ప్రొడక్ట్‌ను కొనుగోలు చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ పై దాని ప్రోగ్రామ్ గురించి కూడా ఒకసారి చెక్ చేయండి. ఎమ్మార్పీ ట్యాగ్, మరియు హోలోగ్రామ్ తో పాటు ప్రోడక్ట్ ప్రోగ్రామ్ కూడా తెలుసుకోవడం తప్పనిసరి.

వాటర్‌తో టెస్ట్ చేసి చూడండి

ఏదైనా ఒక ప్రోడక్ట్‌ని కొనుగోలు చేసినప్పుడు దానిలో నుంచి ఒక స్పూన్ సప్లిమెంట్‌ని తీసుకుని వాటర్‌లో వేయండి. కొద్దిసేపు దానిని కలపండి. ఒక వేళ ఇది ఫేక్ అయితే గ్లాసు అడుగున పౌడర్ ఉండిపోతుంది. అదే నిజమైతే ఉండదు.

ఇది చాలా సింపుల్ టెస్ట్. ఎప్పుడైనా మీరు సప్లిమెంట్స్ ని కొనుగోలు చేసేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నిజమైన సప్లిమెంట్స్ అయితే మంచి సువాసన కలిగి ఉంటాయి. అదే ఒకవేళ ఫేక్ సప్లిమెంట్స్ అయితే ఎలాంటి సువాసన ఉండదు.

మంచి దుకాణం నుంచి కొనుగోలు చేయండి:

మీరు ఎప్పుడైనా నిజమైన ప్రొడక్ట్స్‌ని కొనుగోలు చేయాలంటే మంచి దుకాణం, అలానే మంచి బ్రాండ్ చూసి కొనుగోలు చేయండి. ఎందుకంటే, మంచి గుర్తింపు ఉండే రిటైలర్ అయితే ప్రొడక్ట్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే నాణ్యత విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

ముగింపు

ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు ఇలా అనేక విధాలుగా టెస్ట్ చేసి చూస్తే… అప్పుడు ఆ ప్రొడక్ట్స్ రియల్/ఫేక్ అనేది తెలుస్తుంది. అంతేకాక, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం.

డిస్క్లైమర్: ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment