ఇన్‌స్టంట్ కాఫీ తాగేవారు ఇది గమనించారా..!

కొంతమందికి ఉదయాన్నే లేవగానే వేడి వేడి కాఫీ కప్పు నోటికి అందితే కానీ తెల్లారదు. మరికొంతమందికి రోజుకి మూడు.. నాలుగు కప్పుల కాఫీ తాగితే తప్ప రోజు గడవదు. ఇలా ఎవరికి వారు కాఫీతో అనుబంధాన్ని పెంచుకుంటూ ఉన్నారు. బ్రేక్ ఫాస్ట్… లంచ్… డిన్నర్… వీటి

రోజుకు రెండు, లేదా మూడు కప్పుల కాఫీ తాగితే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవని రిసెర్చ్ లో తేలింది. అలాకాక, కప్పులకు కప్పులు కాఫీ లాగిస్తే మాత్రం ఆరోగ్యం దెబ్బతినడం ఖాయమని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే కాఫీ టూ మచ్ గా తాగకుండా లిమిట్ గా తాగటం బెటర్.

ఇన్‌స్టంట్ కాఫీ తాగడం వల్ల దుష్ప్రభావాలు

బ్లాక్ కాఫీ

డీకెఫినేటెడ్ కాఫీ తాగడం కంటే కెఫినేటెడ్ కాఫీ తాగడం బెస్ట్ అని చెప్తున్నారు రీసర్చర్స్. కెఫినేటెడ్ కాఫీ పౌడర్‌లో కెఫిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అదే డీకెఫినేటెడ్ కాఫీలో అయితే కెఫీన్ శాతం తక్కువగా ఉంటుంది. కానీ, టేస్ట్ మాత్రం ఇంచుమించు ఒకేలా ఉంటుంది.

కెఫినేటెడ్ కాఫీని కంట్రోల్ తప్పనంత వరకు తాగితే ఫర్వాలేదు. డీకెఫినేటెడ్ కాఫీని మాత్రం కంట్రోల్ తప్పి తాగితే, గుండె పనితీరు మందగిస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే, ఇన్‌స్టెంట్ కాఫీ కంటే… ఫిల్టర్ కాఫీ…, ఫిల్టర్ కాఫీ కంటే… బ్లాక్ కాఫీ బెస్ట్ అంటున్నారు.

కెఫిన్ డోసేజ్

రోజుకు ఇన్నిసార్లంటూ లెక్క పెట్టుకుని మరీ కాఫీ తాగేస్తుంటాం. కానీ, కాఫీ కప్పులకూ ఓ లెక్కుంది. రోజుకు 400 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ మోతాదులో కెఫిన్ తీసుకుంటే… దానివల్ల మన శరీరం అనారోగ్యం పాలవుతుందని సైన్స్ చెప్తుంది. 400 మిల్లీ గ్రాముల కెఫిన్‌ అంటే సుమారు 4 కప్పుల కాఫీకి సమానం. అంటే… రోజుకు 4 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే హాని తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కాఫీ డోసేజ్

ప్రెగ్నెంట్ లేడీస్ లేదా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న విమెన్ ఎవరితే ఉంటారో… అలాంటివాళ్ళు రోజుకు 200 మిల్లీ గ్రాములకు మించిన కెఫిన్ తీసుకోకూడదట. అంటే… రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ మోతాదులో కాఫీ తీసుకోకూడదు. అది కూడా డాక్టర్స్ ప్రిఫర్ చేస్తేనే తాగాలి. అలాకాకుండా, ప్రెగ్నెన్నీ, లేదా ఫీడింగ్ పూర్తయ్యే వరకు కాఫీ తాగడం మానేస్తే ఇంకా బెటర్.

ఇది కూడా చదవండి: బ్లాక్‌ కాఫీతో ప్రయోజనాలెన్నో!

హెల్త్ ఇష్యూస్

రోజుకు 4 కప్పులు కంటే ఎక్కువ కాఫీ తాగినట్లైతే… తీవ్రమైన తలనొప్పి, నిద్రలేమి, కాన్సన్ట్రేషన్ దెబ్బ తినడం, ఎక్కువ సార్లు మూత్రం రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం, కండరాల నొప్పి తదితర దుష్పరిణామాలన్నీ ఉంటాయి. అలాగే రిప్రొడక్టివ్ సిస్టంపై కూడా కాఫీ తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఎవైడ్ కాఫీ

టూ మచ్ గా కాఫీ తాగితే బ్లడ్ ప్రెజర్ పెరుగుతుందని ఓ పరిశోధన తేల్చింది. అందుకే హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్లు కాఫీ జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం. డైజేషన్ ప్రాబ్లెమ్స్ ఉన్నవారు కూడా కాఫీకి దూరంగానే ఉండాలి. పరగడుపున కాఫీ తాగితే తీవ్రమైన దుష్ప్రభావాలుంటాయట. నిద్రలేమితో బాధపడేవారు కూడా కాఫీ తాగకూడదు. అలాగే… ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకి కాఫీ ఇవ్వకూడదు.

ముగింపు

దీన్ని బట్టి రెగ్యులర్ కాఫీతో పోలిస్తే, ఇన్‌స్టంట్ కాఫీ లిమిట్ గా తాగినంత సేపూ మీ ఆరోగ్యానికి హెల్ప్ అవుతుంది. అలా కాక, ఓవర్ గా తాగారో.. సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. అందుకే ఇన్‌స్టంట్ కాఫీ తాగినప్పుడు మీలో ఏవైనా నెగెటివ్ సిమ్ టమ్స్ కనిపిస్తే… వెంటనే హెర్బల్ కాఫీ లేదా డికాఫ్ కాఫీకి షిఫ్ట్ అవ్వండి.

డిస్క్లైమర్: ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment