ఆస్తమా వ్యాధి గ్రస్తులలో వచ్చే గురకను సింపుల్ గా తగ్గించుకోండి ఇలా..!

శ్వాసనాళాలు ఇరుకైనప్పుడు మరియు ఉబ్బినప్పుడు ఆస్తమా దాడి జరుగుతుంది. ఇది శ్వాసను మరింత కష్టతరం చేస్తుంది ఇంకా దగ్గు మరియు శ్వాసలోపం వంటి లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.

ఇలాంటి క్రమంలో ఆస్తమా వ్యాధి గ్రస్తులు రాత్రి పడుకొనే సమయంలో ఇన్హేలర్ ఎక్కువగా వాడుతుంటారు. అయితే, ఆ ఇన్హేలర్ గురకలను తగ్గిస్తుందని గ్యారంటీ ఏమి లేదు. దానికి బదులు ఇంట్లో ఉండే కొన్ని ఔషదాలు ఈ సమస్య నుండీ బయట పడేస్తాయి. అవి ఏమిటో ఇప్పుడే తెలుసుకుందాం.

గురకలను తగ్గించే గృహ నివారణలు

ఆస్తమా వ్యాధి అని నిర్దారణ అవగానే ఇన్హేలర్ ఎల్లపుడు మీతో ఉంచుకోని వైద్యుడు సలహా ఇస్తాడు. కానీ, రాత్రి పడుకుపుడు వచ్చే గురకని ఇన్హేలర్ లు ఎంత వరకు తగ్గిస్తాయి? కానీ కొన్ని రకాల ఔషదాలు ఇలాంటి గురకలను తగ్గించటమే కాకుండా, ఆస్తమా వ్యాధి తీవ్రతలను కూడా తగ్గిస్తాయి. ఆ ఔషదాలేంటో మీరే చూడండి.

ఇది కూడా చదవండి:నిద్రలో కాలి కండరాలు పట్టేస్తుంటే… ఈ హోమ్ రెమెడీస్ పాటించండి!

శ్వాస వ్యాయామాలు

శ్వాస వ్యాయామాలనేవి మన శ్వాసనాళాలను సడలించడం ద్వారా ఊపిరితిత్తులను విస్తరించడంలో మరియు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. అందుకే ఆస్తమాతో బాధపడేవారు రెగ్యులర్ గా యోగా, ప్రాణాయామం వంటివి చేయటం ద్వారా బ్రీతింగ్ ఫ్రీ అవుతుంది. ఊపిరితిత్తులకి సరిపడా ఆక్సిజన్ లభిస్తుంది. ఫలితంగా గురక రావటం తగ్గుతుంది.

యూకలిప్టస్ ఆయిల్

ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ కారణంగా, యూకలిప్టస్ ఆయిల్ ని ఆస్తమాకి విరుగుడుగా వినియోగిస్తారు. అందుకోసం యూకలిప్టస్ ఆయిల్ ని డిఫ్యూజర్‌లోఉంచి… అది విడుదల చేసే ఆవిరిని పీల్చటం వల్ల ఫలితం ఉంటుంది.

ఇది కూడా చదవండి:అర్ధరాత్రుళ్ళు గొంతు ఎండిపోయి… దాహం వేస్తుందా..! దానికి గల కారణాలు ఇవే!

క్యాంఫర్ మరియు ఆవాలు

ఆవాల నూనె శ్వాస నాళాలలో అభివృద్ధి చెందే మ్యూకస్ ను నివారించి, ఆస్తమా వ్యాధి గ్రస్తులకు ఉపశమనం కలిగిస్తుంది. క్యాంఫర్ ని ఆవాల నూనెతో మిక్స్ చేయటం ద్వారా దాని శక్తి మరింత పెరుగుతుంది. ఇందుకోసం కొద్దిగా ఆవాల నూనెను తీసుకొని, అందులో క్యాంఫర్ ని కలిపి, వేడి చేసి, దానిని ఒక జార్ లో పోసి, దాని నుంచీ వచ్చే ఆవిరులను పీల్చండి.

నిమ్మరసం

నిమ్మరసం రోజు తాగటం వలన మ్యూకస్ ని పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. నిదానంగా గురక కూడా తగ్గుముఖం పడుతుంది. ఒక చెంచా తాజా నిమ్మరసంను రోజు ఉదయాన్నే తాగటం వలన రాత్రి కలిగే గురక బాధ నుండి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా, చక్కెర కలపని ఒక గ్లాసు నిమ్మరసం మీ శ్వాస నాళాలని శుభ్రపరిచి దగ్గు మరియు జలుబులకు దూరంగా ఉంచుతుంది.

ఇది కూడా చదవండి: నిద్రలో మీ చేతులు, కాళ్ళు తిమ్మిర్లు రావటానికి కారణాలు ఇవే!

తేనె

తేనె సహజంగా హీలింగ్ ప్రాపర్టీస్ ని కలిగి ఉంటుందని మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ మైక్రోబియాల్ గుణాలను కూడా కలిగి ఉంటుంది. ఆస్తమా వ్యాధి గ్రస్తులలో గురకకు కారణమైన ఇన్ఫెక్షన్ ని నివారిస్తుంది. దానితో పాటు ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది.

వెల్లుల్లి

జలుబు, దగ్గు వంటి వివిధ రకాల బాక్టీరియా వ్యాధుల వల్ల శ్వాస నాళాలలో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. ఇలా ఏర్పడే ఇన్ఫెక్షన్ లు శ్వాస నాళాలలో మ్యూకస్ ని ఉత్పత్తి చేస్తాయి. అందుకే, ఆస్తమా వ్యాధి గ్రస్తులలో రాత్రి సమయంలో గురకలు కలుగుతాయి. వెల్లుల్లి ఇన్ఫెక్షన్లతో కూడిన జలుబు, దగ్గు వంటి వివిధ రకాల వ్యాధులను తగ్గించే శక్తి కలిగి ఉంటుంది. అందుకే దీనిని తీసుకోవటం వల్ల బెటర్ రిజల్ట్ ఉంటుంది.

ఇది కూడా చదవండి: రాత్రిపూట పదే పదే పొడిదగ్గు వస్తుంటే… ఈ రెమెడీస్ పాటించండి!

ముగింపు

గురక అనేది ఒక రకమైన హెల్త్ కండిషన్ కి ఇండికేషన్. అంతేకానీ, ఇది మీరు పడుకోగానే వినే సంగీతం కాదు. గురకకు కారణాలు అనేకం ఉండవచ్చు కాబట్టి, వైద్యుడిని సంప్రదించి దాని ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడం మంచిది. ఇక ఆస్తమా పేషెంట్లలో వచ్చే గురక శ్వాసపై మరింత తీవ్ర ప్రభావం చూపుతుంది. పైన మనం చెప్పుకోన్నవన్నీ తాత్కాలిక ఉపశమనం మాత్రమే అందిస్తాయి. శాశ్వత పరిష్కారం కోసం వైద్యుడ్ని సంప్రదించటం మర్చిపోకండి.

డిస్క్లైమర్: ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment