కొంతమందికి రాత్రి పూట నిద్రిస్తున్నప్పుడు పదే పదే పొడిదగ్గు వస్తుంటుంది. సింపుల్ గా అనిపించినా… నిజానికి ఈ పొడిదగ్గు చాలా ఇబ్బందే! నిద్రకు భంగం కల్గిస్తుంది. ఛాతీ నొప్పిని కూడా కలిగిస్తుంది. ఇది ఎప్పుడో ఒకప్పుడు అయితే పర్లేదు కానీ, ఎక్కువకాలం కొనసాగితే దానిని నివారించటంపై దృష్టి పెట్టాలి. అందుకోసం కొన్ని నేచురల్ రెమెడీస్ పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం, బెల్లం:
బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు, ఇది నేచురల్ షుగర్ ను కలిగి ఉంటుంది. ఈ కారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగదు. అయితే పొడి దగ్గు పోవాలంటే ఈ బెల్లాన్ని అల్లంతో కలిపి తినాలి.
ఇందుకోసం ఒక బౌల్ లో కొద్దిగా బెల్లం వేసి అది కరిగేవరకూ వేడి చేయాలి. అందులో అల్లం తురుము గానీ, లేదంటే అల్లం రసం గానీ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కొన్నిరోజులపాటు తీసుకుంటే పొడిదగ్గు సమస్య తగ్గిపోతుంది.
తులసి ఆకులు:
తులసి ఆకులలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి జలుబు, దగ్గు, ఫ్లూ వంటి లక్షణాలను తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. ఈ కారణంగా రాత్రిపూట వచ్చే దగ్గును పొడి దగ్గును కూడా దూరం చేస్తుంది.
అందుకోసం రాత్రి పడుకునే ముందు కొన్ని తులసి ఆకులను తేనెతో కలిపి తినాలి. దీంతో దగ్గు తగ్గుతుంది.
నల్ల మిరియాలు, ఉప్పు:
నల్లమిరియాలు దగ్గు సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఎంతగానో తోడ్పడతాయి. అయితే దీనిని ఉప్పుతో కలిపి తీసుకుంటే మరింత ప్రభావ వంతంగా పనిచేస్తుంది.
దీనికై ఒక పాత్రలో నల్లమిరియాల పొడి తీసుకుని, దానికి కొద్దిగా ఉప్పు కలపాలి. దీంతోపాటు కొద్దిగా తేనె కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు తింటే పొడి దగ్గు సమస్య తగ్గుతుంది.
తేనె, వేడి నీరు:
దగ్గుని నివారించటంలో వేడి నీరు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కేవలం దగ్గు మాత్రమే కాక ఇంకా అనేక సమస్యల నుంచి కూడా ఉపశమనం కల్గిస్తుంది.
అందుకు గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగడం వల్ల రాత్రిపూట వచ్చే పొడి దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.
డిస్క్లైమర్:
ఇవన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే! ప్రతిరోజూ రాత్రిళ్ళు నిద్రించే సమయంలో పొడి దగ్గు వస్తున్నట్లితే, దానిని తేలికగా తీసుకోకండి. వెంటనే డాక్టర్ ని సంప్రదించి తగు సూచనలు, సలహాలు తీసుకోండి.