మన శరీరంలో అన్ని అనారోగ్య సమస్యలకి మూల కారణం మన పొట్టే! కడుపు క్లీన్ గా ఉంటే… మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లే. అందుకే డైజెస్టివ్ సిస్టంని ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుకోవటం మన బాధ్యత. మనం తినే ఆహారం మొత్తం పెద్ద ప్రేగుల్లో చేరుకుంటుంది. పోషకాలన్నీ వివిధ భాగాలకి సరఫరా అవ్వగా మిగిలిన వ్యర్ధాలు మాత్రమే ఇక్కడ నిలిచి ఉంటాయి. ఇందులో విషపూరితమైన అనవసర పదార్థాలు ఎక్కువగా పేరుకుపోయినట్లైతే వ్యాధులు సంక్రమిస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని నేచురల్ పద్ధతులలో మన కడుపుని క్లీన్ చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
గోరువెచ్చని నీరు:
ప్రేగులను శుభ్రం చేయడంలో గోరువెచ్చని నీరు ఎంతగానో దోహదపడుతుంది. అందుకే ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత కనీసం 2 గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలి. దీనివల్ల సహజంగానే పొట్ట క్లీన్ అవుతుంది.
పాలు:
పాలు కూడా ప్రేగులను శుభ్రపరుస్తుంది. అందుకే ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తప్పనిసరిగా ఒక గ్లాసు పాలు తాగాలి. పాలలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడంలో తోడ్పడుతుంది.
వెజిటబుల్ జ్యూస్:
వెజిటబుల్ జ్యూస్ తాగడం వల్ల ప్రేగుల్లో ఉండే విషపదార్థాలు మొత్తం తొలగిపోయి… ప్రేగులు శుభ్రపడతాయి. అందుకోసం బీట్‌రూట్, కాకరకాయ, పొట్లకాయ, అల్లం, టమోటా, బచ్చలికూర మొదలైన కూరగాయలతో జ్యూస్ తయారు చేసుకోవచ్చు.
ఫైబర్:
ఆహారంలో ఫైబర్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా కడుపు క్లీన్ అవుతుంది. అందుకోసం యాపిల్, ఆరెంజ్, కీరా, అలోవేరా వంటి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.
మంచి నీరు:
నీరు కడుపులో ఉండే విష పదార్ధాలని బయటకు పంపుతుంది. ఇది మిమ్మల్ని ఎప్పుడూ హైడ్రేట్ గా ఉంచుతూ డైజెస్టివ్ హెల్త్ ని కాపాడుతుంది. అందుకే ఉదయాన్నే లేవగానే 2 గ్లాసుల మంచి నీటిని తాగాలి. అలానే, ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలి. అందుకోసం దోసకాయ, పుచ్చకాయ, టమోటా వంటి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాలను కూడా తినవచ్చు.
సాల్ట్ వాటర్:
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 2-3 టీస్పూన్ల సముద్రపు ఉప్పు కలిపి ఖాళీ కడుపుతో త్రాగండి. ఇలా చేయటం వల్ల కేవలం కొన్ని నిమిషాల్లోనే అది మీ పెద్దప్రేగును శుభ్రపరుస్తుంది.
తేనె, మరియు నిమ్మరసం:
పొట్టని క్లీన్ చేయటానికి పొందడానికి ప్రతిరోజూ ఉదయం నిమ్మరసంలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలుపుకుని తాగండి. దీనివల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
హెర్బల్ టీలు:
కొన్ని రకాల మూలికలతో తయారైన టీలు మలబద్ధకం, మరియు ఎసిడిటీని అధిగమించడంలో సహాయపడతాయి. ఇందులో చెడు బ్యాక్టీరియాను అణిచివేసే యాంటీమైక్రోబయల్ ఫైటోకెమికల్స్ ఉంటాయి. అందుచే వీలైతే అల్లం టీ, లేదా మిరియాల టీ తాగండి.
అల్లం:
కడుపుని శుభ్రం చేయడానికి అత్యంత ప్రభావవంతమైన నేచురల్ రెమెడీస్ లో అల్లం ఒకటి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పెద్దప్రేగు మంటను తగ్గిస్తుంది మరియు కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందుకోసం అల్లంను నేరుగా తినవచ్చు, లేదా టీ రూపంలో తీసుకోవచ్చు, లేదా గోరువెచ్చని నీటిలో అల్లం రసాన్ని కలపుకొని తాగవచ్చు.
స్టార్చెస్:
బియ్యం, బంగాళదుంపలు, చిక్కుళ్ళు, పచ్చి అరటిపండ్లు మరియు ధాన్యాలలో స్టార్చ్ లభిస్తుంది. ఫైబర్ వలె, ఈ పిండి పదార్ధాలు గట్ మైక్రోఫ్లోరాను పెంచడం ద్వారా పెద్దప్రేగు ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇవి పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
ఫిష్ ఆయిల్:
చేప నూనెలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం చేత ఇవి పొట్టను శుభ్రం చేయడంలో సహాయపడతాయి.
ఉపవాసం:
అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ ఫాస్టింగ్. ఉపవాసం ఉండటం వల్ల పెద్దప్రేగులో పేరుకుపోయి ఉన్న టాక్సిన్స్ అన్నీ తొలగించబడంతాయి. అందుకోసం ఉపవాసం ఉంటూ… ఆ సమయంలో పుష్కలంగా నీరు త్రాగినట్లితే పెద్దప్రేగు పూర్తిగా శుభ్రపడుతుంది.
డిస్క్లైమర్:
మనం చెప్పుకొన్న ఈ విధానాలన్నీ అన్ని వయసుల వాళ్ళు నిరభ్యంతరంగా పాటించవచ్చు. అయితే, ఏదీ కూడా మితి మీరి చేయకూడదని గుర్తు పెట్టుకోండి. అతిగా కడుపుని శుభ్రం చేయటం కూడా అంత మంచిది కాదు, అందుకే డాక్టర్ సలహాతో చేయండి.