మీ వంట నూనె ప్యూరిటీని ఇలా చెక్ చేసుకోండి!

వంటనూనె లేనిదే వంట చేయడం కుదరదు. ఎందుకంటే, నూనె వంటకాల రుచిని మరింత పెంచుతుంది. అలాగే, నాణ్యమైన వంట నూనె వాడినప్పుడే ఆరోగ్యం మరింత పెరుగుతుంది. అందుకే ధర ఎంత పెరిగినా… కొనక తప్పదు. కానీ, ఈమధ్య కాలంలో ఈ నూనెని కూడా కల్తీ చేస్తున్నారు. మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

కల్తీకి ఎంత చెక్‌ పెట్టినా… ఏదో విధంగా ఈ కల్తీ పదార్ధాలు మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. వాటిని తినటం వల్ల వివిధ వ్యాధులకు గురవుతూనే ఉన్నాము. అయితే నిత్యం మనం వంటకాల్లో ఉపయోగించే నూనె కల్తీ ఉందా? లేదా? అనేది తెలుసుకోవడం ముఖ్యం. అది తెలుసుకోవాలంటే, మన ఇంట్లోనే కొన్ని చిన్నపాటి ట్రిక్స్ యూజ్ చేసి తెలుసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.

సాదారణంగా మనం వాడే ఆయిల్స్ ఏవైనా సరే ఫుడ్‌ సెఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆఫ్‌ ఇండియా (fssai) సర్టిఫైడ్ పొందిన కంపెనీలకి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి.

ముఖ్యంగా ఆయిల్‌లో ట్రై ఆర్థో క్రెసిల్ ఫాస్ఫేట్‌ అనే కెమికల్ కలిసిందో… లేదో… చెక్ చేసుకోవాలి. ఎందుకంటే, ఈ రసాయనాన్ని ఉపయోగించి ఆయిల్‌ ని కల్తీ చేసేస్తున్నారు. అలాంటి ఆయిల్ వాడటం వల్ల నాడీ సంబందిత రోగాలు, హృద్రోగాలు, ఊబకాయం, క్యాన్సర్, మధుమేహం వంటి రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అయితే కల్తీ నూనెను ఎలా గుర్తించాలో కొన్ని సింపుల్ ట్రిక్స్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: కల్తీ పాలను ఇంట్లోనే ఈజీగా చెక్‌ చేసుకోండిలా..!

మొదటిది ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ ని వేయండి. ఆ ఆయిల్ లో కొంచెం వెన్నను కూడా వేయండి. కొద్దిసేపటి తర్వాత పాత్రలో ఉన్న నూనె రంగుమారకుండా ఉంటే అది స్వచ్ఛమైన నూనె. అలా కాకుండా రంగు మారితే అది కల్తీ నూనె.

రెండవది ఒక చుక్క నూనెని నాలికపై వేసుకొని రుచి చూడండి. అది మంచి నూనె అయితే ఆయిల్ టేస్ట్ వస్తుంది. కల్తీ నూనె అయితే చేదుగా అనిపిస్తుంది.

మూడవది ఒక పాత్రలో కొద్దిగా నూనెను తీసుకొని ఫ్రిజ్ లో పెట్టండి. అరగంట తర్వాత చూస్తే, ఆ నూనె అలానే ఉంటే అది మంచి నూనె. అలాకాకుండా నూనెపై తెల్లటి పొర పేరుకొని పోతే అది కల్తీ నూనె అని అర్ధం.

నాల్గవది ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని అందులో కొద్దిగా నూనె తీసుకోండి. అందులో 2, లేదా 3 చుక్కలు నైట్రిక్ యాసిడ్ వేసి వేడి చేయండి. ఆయిల్ కలర్ మారితే అది కల్తీ నూనె, లేకుంటే మంచి నూనె.

ఇలా అనేక రకాలుగా పరీక్షించి వంటనూనెలో కల్తీ ఉందో… లేదో… తెలుసుకోవచ్చు.

డిస్క్లైమర్:

పై విషయాలన్నీ మీ అవగాహన కోసం మాత్రమే! అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment