చలికాలం వచ్చేసింది. చలిపులి గజగజ వణికిస్తుంది. బారెడు పొద్దెక్కినా మంచం దిగబుద్ది కావట్లేదు. ఉదయం 10 గంటలు దాటినా చలి తీవ్రత తగ్గట్లేదు. చలి గాలులనుంచి తప్పించుకోవడానికి హీటర్లు, గీజర్లు వంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు.
ఇక స్నానం విషయానికొస్తే, చలికాలంలో కూడా చన్నీటి స్నానమా..! అనే వారు కూడా లేకపోలేదు. అందుకే ప్రత్యామ్నాయంగా వేడి నీటి స్నానానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నిజానికి గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వటంతో పాటు, మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. కానీ, రెగ్యులర్ గా చేసే హాట్ వాటర్ షవర్ వల్ల స్కిన్ డిసీజెస్ కూడా ఎక్కువగా వస్తాయని అంటున్నారు వైద్య నిపుణులు.
ఇదికూడా చదవండి: చలికాలం కదా అని స్నానం చేయడానికి బద్ధకిస్తున్నారా..! అయితే ఈ సమస్యలను కొనితెచ్చుకున్నట్లే!!
వేడి నీటి స్నానం వల్ల నష్టాలు:
వేడి నీటితో చేసే స్నానం వల్ల లాభాలకంటే, నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. మన శరీరంలో అత్యంత సున్నితమైన చర్మం ఉండే ప్రదేశం మనం ముఖం. ముఖ చర్మం క్రింద చర్మ రంధ్రాలు, రక్త నాళాలు ఉంటాయి. వేడి నీరు పడ్డప్పుడు ఆ ప్రదేశంలో ఉండే చర్మ కణాలకు నష్టం కలుగుతుంది. ఇంకా ఇది ముఖంపై చికాకుకు కూడా కారణమవుతుంది. దీంతో మొటిమల సమస్య మొదలవుతుంది. వేడి నీళ్లను పోసుకోవడం వల్ల చర్మంలో ఉండే నేచురల్ ఆయిల్స్ తొలగిపోతాయి. ఫలితంగా చర్మం పొడిగా మారి పగుళ్లు ఏర్పడతాయి. ఇంకా స్కిన్ లో ఉండే కొల్లాజెన్ తగ్గుతుంది. దీని వల్ల స్కిన్ దెబ్బతింటుంది.
ఇదికూడా చదవండి: తిన్న వెంటనే స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా!
చివరి మాట:
గడ్డకట్టే చలిలో వేడినీటి స్నానం అప్పటికి హాయిగా అనిపించినా… ఫ్యూచర్ లో దాని తాలూకు ప్రభావం మనపై పూర్తిగా ఉంటుంది. ఇన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి కాబట్టే వేడి నీటిని ఉపయోగించకపోవడమే ఉత్తమం.
డిస్క్లైమర్:
ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే! అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.