పచ్చిమిర్చి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా!

పచ్చి మిర్చి ఘాటు లేని వంటంటూ లేదు. ప్రతి వంటకంలోనూ దీనిని ఉపయోగిస్తుంటారు. అయితే, వంటల్లో ఎంత వాడినప్పటికీ పచ్చిగా వీటిని తింటే కలిగే ప్రయోజనాలు అంతా… ఇంతా… కాదు. అనారోగ్యం కలిగినప్పుడు ఆస్పత్రుల చుట్టూ తిరగకుండా ఉండాలంటే… దీనిని ఉపయోగిస్తే చాలని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు. మరి అలాంటి పచ్చిమిర్చి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

పచ్చి మిరపకాయలో ఉండే కొన్ని ప్రత్యేక గుణాల వల్ల మెటబాలిక్ రేట్ ని ఇంప్రూవ్ చేస్తాయి. అంతేకాదు, వీటిని తినేటప్పుడు అందులో ఉండే గింజలను తీసేయకుండా వాటిని కూడా కలిపి తినాలి. 

  • విటమిన్ సి కలిగి ఉంటుంది:

విటమిన్ సి ఒక ముఖ్యమైన పోషకం, ఇది అనేక శారీరక విధులను నిర్వహించడంలో సహాయపడుతుంది. సిట్రస్ పండ్లు ఈ విటమిన్ యొక్క ఉత్తమ మూలాలుగా చెప్పబడుతున్నప్పటికీ, ఆశ్చర్యకరంగా పచ్చి మిరపకాయలు కూడా అంతే మంచివి.

పచ్చి మిరపకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల వాటిని తీసుకోవడం వల్ల మీ చర్మాన్ని కాంతివంతంగా ఉంచుకోవచ్చు. 

  • ఇమ్యూనిటీ పెరుగుతుంది:

విటమిన్ సి యాంటీఆక్సిడెంట్ కాబట్టి, పచ్చిమిర్చి తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. 

  • బరువు తగ్గడానికి సహాయపడుతుంది:

చాలా మంది ఊబకాయం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పచ్చిమిర్చి  తీసుకుంటే.. బరువును నియంత్రించేందుకు సహాయపడుతుంది. 

llustration showing gut health and personalized nutrition with healthy foods and microbiome symbols
గట్ హెల్త్ సీక్రెట్: పర్సనలైజ్డ్ న్యూట్రిషన్ తో హెల్త్ పవర్

బరువు తగ్గాలంటే, ఫాస్టర్ మెటబాలిజం ముఖ్యం, ఎందుకంటే ఈ ప్రాసెస్ బాడీలో స్టోర్ అయి ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ ని కరిగిస్తుంది. ఇలా జరగటానికి పచ్చి మిరపకాయలు ఖచ్చితంగా సహాయపడతాయి.

మిరపకాయలు తీసుకోవడంలో ఉన్న మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే వాటిలో జీరో కేలరీస్ ఉంటాయి. కాబట్టి,  బరువు ఎప్పటికీ పెరగలేరు.

  • గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది:

పచ్చి మిరపకాయలు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. వీటిని తినడం వల్ల గుండెపోటుకు ప్రధాన కారణాలలో ఒకటైన రక్తం గడ్డకట్టటాన్ని నివారిస్తుంది. 

  • రక్తపోటును నియంత్రింస్తుంది:

రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు, మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించి అథెరోస్క్లెరోసిస్‌ను నివారిస్తుంది, ఇందులో ఉండే యాంటీ హైపెర్ టెన్సివ్ లక్షణాలు రక్తపోటును తగ్గించటంలో కృషి చేస్తాయి. పచ్చి మిరపకాయలలో ఉండే క్యాప్సైసిన్ అనే యాక్టివ్ కాంపోనెంట్ పొరల ద్వారా రక్త ప్రవాహాన్ని ప్రేరేపించడంలో సహాయపడుతుంది మరియు శ్లేష్మ స్రావం సన్నగా మారుతుంది.

  • సాధారణ జలుబుతో పోరాడుతుంది:

కామన్ కోల్డ్, లేదా సైనస్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లయితే పచ్చి మిర్చి తింటే చాలా  ఉపయోగకరంగా ఉంటుంది. అదనంగా, క్యాప్సైసిన్ మెదడులోని హైపోథాలమస్ ని స్టిమ్యులేట్ చేయటం ద్వారా బాడి టెంపరేచర్ ని తగ్గిస్తుంది.

  • శ్వాసకోశ వ్యవస్థ దృఢంగా చేస్తాయి:

మిరపకాయలో ఉండే క్యాప్సైసిన్ ముక్కులో ఉండే శ్లేష్మ పొరలను ప్రేరేపిస్తుంది. ఈ కారణంగా మూసుకుపోయిన శ్వాసకోశ వ్యవస్థ తిరిగి తెరుచుకోనేలా ప్రభావవంతగా పని చేస్తాయి.

llustration showing health risks of consuming too much instant noodles, including stomach bloating, weight gain, and poor nutrition**
నూడుల్స్ తినడం ఆరోగ్యానికి హానికరమా? 90% మందికి తెలియని నిజాలు!
  • చర్మానికి మేలు చేస్తుంది:

పచ్చిమిర్చిలో విటమిన్-ఇ సమృద్ధిగా ఉంటుంది. క్రమం తప్పకుండా వీటిని తినడం వల్ల చర్మానికి ఎంతో మేలు చేకూరుతుంది. అంతేకాకుండా స్కిన్ బ్రైట్ నెస్ ని కూడా తెస్తుంది. అందువల్ల ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.

  • క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది:

మిరపకాయ తినటం వల్ల క్యాన్సర్‌ సమస్యకు చాలా వరకు దూరంగా ఉండవచ్చు. ఇదుంలో యాంటీ-ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి  కాపాడతాయి. 

  • కళ్లకు మేలు చేస్తుంది:

పచ్చి మిరపకాయ కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.  ఇందులో ఉండే బీటా కెరోటిన్ కళ్లను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కంటి చూపును బాగా మెరుగుపరుస్తుంది.

  • ఐరన్ బూస్టర్ గా పని చేస్తుంది:

పచ్చిమిర్చి శరీరంలోని రక్తహీనతను తొలగిస్తుంది.  ఇందులో ఐరన్ పుష్కలంగా లభించటం వల్ల  దీనిని ఐరన్ బూస్టర్ అని అంటారు. అందుకే, దీన్ని తినడం వల్ల రక్తం గడ్డకట్టే సమస్యే ఉండదు. 

ముగింపు: 

పచ్చిమిర్చితో ఎన్ని లాభాలున్నాయో… అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వీటిని రోజూ 50 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఒకవేళ అలా తీసుకొంటే… డిమెన్షియా వంటి పరిస్థితికి దారితీస్తుంది. అలాగే, వీటిని అతిగా తినడం వల్ల శరీరంలో టాక్సిన్స్ పెరిగే ఛాన్స్ ఉంది.అలాగే, కడుపులో ఏర్పడిన కెమికల్ రియాక్షన్ వల్ల కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ వంటివి ఏర్పడే ప్రమాదముంది.

Leave a Comment