నల్ల యాలకులతో ఉపయోగాలెన్నో!

మనం ఎక్కువగా ఉపయోగించే మసాలా దినుసుల్లో నల్ల యాలకులు కూడా ఒకటి. ఇవి చిన్నగా కనిపించినా… మంచి సువాసనను కలిగి ఉంటాయి. వీటిని ఆహారంలో రుచిని పెంచుకోవడానికి కూడా ఉపయోగిస్తారు. నల్ల యాలకులు పొడి స్వీట్ల తయారీలో ఎక్కువగా వాడుతారు. మన అందరం పచ్చ యాలకులనే ఎక్కువ ఉపయోగిస్తుంటాం కానీ, నల్ల యాలకులు కూడా ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలీదు. ప్రస్తుతం మన మార్కెట్లో నల్ల యాలకులు బాగా విరివిగా దొరుకుతున్నాయి. నల్ల యాలకులలో చాలా రకాల పోషకాలతో పాటు ఔషధ గుణాలు కూడా ఉంటాయి. వీటిని ప్రతి రోజూ వాడటం వల్లన శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

బాడీ పెయిన్స్ తగ్గుతాయి:

ప్రతి రోజు నల్ల యాలకులను ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల శరీరంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. ప్రస్తుతం శీతా కాలంలో చాలా మంది బాడీ పెయిన్స్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారు నల్ల యాలకులతో తయారు చేసిన టీ తాగినా, ఆహారంతో తీసుకున్నా శరీరంపై వచ్చే వాపులు తగ్గుతాయి.

ఫ్రీ రాడికల్స్ నశిస్తాయి:

నల్ల యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. ఉదయం పూట గ్రీన్ టీతో పాటు నల్ల యాలకుల పొడిని మిక్స్ చేసుకుని తాగటం వలన శరీరంలో ఫ్రీ రాడికల్స్ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు.

కిడ్నీ సమస్యలు దూరమవుతాయి:

చాలా మందికి అనేక కారణాల వల్ల కిడ్నీ సమస్యలు వస్తుంటాయి.  అలాంటి వారు రెగ్యులర్‌గా నల్ల యాలకులని ఆహారంలో చేర్చుకున్నట్లైతే, ఇవి బాడీ నుండి ట్యాక్సిన్స్ దూరం చేయడమే కాకుండా… మూత్ర విసర్జనకి సంబంధించిన సమస్యల్ని కూడా దూరం చేస్తుంది.

Dietary fiber foods such as fruits, vegetables, whole grains, and legumes that support healthy aging and longevity
డైటరీ ఫైబర్ దీర్ఘాయువును పెంచుతుంది – శాస్త్రవేత్తలు చెప్పిన అద్భుత రహస్యాలు!

నోటి బ్యాక్టీరియా నుండీ ఉపశమనం:

నల్ల యాలకులలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల నోటి బ్యాక్టీరియా దూరమవుతుంది. దంతాల ఇన్ఫెక్షన్, చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వంటివి  దూరమవుతాయి. ఇంకా నోటి దుర్వాసనని కూడా  తగ్గిస్తుంది.

కడుపు సంబంధిత సమస్యలు పోతాయి:

నల్ల యాలకులని తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే పోతాయి. కొంతమందికి ఆకలి అస్సలు ఉండదు. అలాంటి వారికి నల్ల యాలకులు హెల్ప్ అవుతాయి. ఈ యాలకులు తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి. 

రక్తప్రసరణ పెరుగుతుంది:

నల్ల యాలకుల్లో విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణని పెంచుతాయి. ఇంకా చర్మాన్ని అందంగా మార్చి మెరిసేలా కూడా చేస్తాయి.

గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది:

నల్ల యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి గుండె పనితీరుని మెరుగు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి… గుండె కండరాల కణజాలం బాగా పనిచేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల గుండె సమస్యలు చాలా వరకూ తగ్గుముఖం పడతాయి.

Colorful Plant-Based Diet plate with fruits, vegetables, grains, and nuts representing sustainable wellness.
ప్లాంట్-బేస్డ్ డైట్ సీక్రెట్: హెల్త్ + సస్టైనబుల్ లైఫ్

ముగింపు:

నల్ల ఏలకులు ప్రకృతి ప్రసాదించిన అతిగొప్ప వరం. ఇది శరీరానికి ఎంతగానో మేలు చేస్తూ… జీవితకాలాన్ని పెంచే  ఉత్తమ మూలకాలను కలిగి ఉంది. అందుకే ఈ నల్ల యాలకులని మీ దినచర్యలో భాగం చేసుకోండి. 

డిస్క్లైమర్:

ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment