గట్ హెల్త్ సీక్రెట్: పర్సనలైజ్డ్ న్యూట్రిషన్ తో హెల్త్ పవర్

గట్ హెల్త్ అండ్ పర్సనలైజ్డ్ న్యూట్రిషన్ అనే పదం విన్నప్పుడు మీకు ఏం గుర్తుకువస్తుంది? మన శరీరానికి సెకండ్ బ్రెయిన్ లాంటి గట్ కి పర్సనలైజ్డ్ న్యూట్రిషన్ తోడైతే హెల్త్ పవర్ పెరుగుతుందని. గట్ లో దాగి ఉన్న సీక్రెట్స్ మీ హెల్త్, మూడ్, ఇమ్యూనిటీ అన్నిటినీ ప్రభావితం చేస్తాయని మీకు తెలుసా? ఒక్కో మనిషి శరీరానికి ప్రత్యేకమైన డైట్ అవసరం ఉంటుందని చెబుతున్న సైన్స్ నిజంగా ఎంత వరకు నమ్మదగినది? ఈ రోజు మనం ఆ సీక్రెట్‌ని తెలుసుకుందాం.

గట్ హెల్త్ అంటే ఏమిటి?

గట్ హెల్త్ అంటే మీ డైజెస్టివ్  సిస్టమ్ లోని మైక్రో ఆర్గానిజమ్స్ (మంచి మరియు చెడు బ్యాక్టీరియా) యొక్క ప్రాపర్ బ్యాలన్స్.

  • ఆరోగ్యకరమైన గట్ పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది.
  • ఇది హానికరమైన బ్యాక్టీరియా నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.
  • ఇది గట్-బ్రెయిన్ యాక్సిస్ ద్వారా మీ బ్రెయిన్ తో కూడా  కమ్యూనికేట్ చేస్తుంది.

మీ గట్ అనారోగ్యంగా ఉంటే, మీరు ఈ క్రింది సమస్యలని  ఎదుర్కోవచ్చు:

  • బ్లోటింగ్ 
  • ఇండైజేషన్
  • కాన్స్టిపేషన్ లేదా డయేరియా 
  • లో ఎనర్జీ 
  • పూర్ ఇమ్యూనిటీ 

గట్ హెల్త్ ఎందుకు ముఖ్యమైనది?

మన శరీరం మొత్తం హెల్దీగా ఉండాలంటే, గట్ హెల్త్ చాలా కీలకం. అది ఈ క్రింది అంశాలతో ముడిపడి ఉంటుంది.

స్ట్రాంగర్ ఇమ్యూనిటీ 

మీ ఇమ్యూనిటీ సిస్టమ్ లో దాదాపు 70% మీ గట్ లోనే నివసిస్తుంది.

బెటర్ డైజేషన్ 

మంచి బ్యాక్టీరియా ఆహారాన్ని సరిగ్గా విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది.

మెంటల్ వెల్ బీయింగ్ 

మీ గట్ సెరోటోనిన్ (హ్యాపీ హార్మోన్) ను ఉత్పత్తి చేస్తుంది.

వెయిట్ మేనేజ్మెంట్  

హెల్దీ గట్ బ్యాక్టీరియా మెటబాలిజాన్ని బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది.

ఇదికూడా చదవండి: బరువు తగ్గడం ఇక సులభం: ఒబేసిటీపై ఒక సమగ్ర గైడ్

llustration showing health risks of consuming too much instant noodles, including stomach bloating, weight gain, and poor nutrition**
నూడుల్స్ తినడం ఆరోగ్యానికి హానికరమా? 90% మందికి తెలియని నిజాలు!

పర్సనలైజ్ద్ న్యూట్రిషన్ అంటే ఏమిటి?

పర్సనలైజ్ద్ న్యూట్రిషన్ అనేది మీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన న్యూట్రిషన్ ప్లాన్. అందరూ ఒకే రకమైన డైట్ ని ఫాలో అయ్యే బదులు, ఎవరికి వాళ్ళు సపరేట్  గా ఒక డైట్ ని ఫాలో అవ్వటం. దీనినే పర్సనలైజ్ద్ న్యూట్రిషన్ అంటారు. ఇది ఈ క్రింది అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి:

  • మీ ఏజ్  అండ్ జెండర్ 
  • మీ హెల్త్ గోల్స్ 
  • మీ గట్ మైక్రోబియం
  • మీ లైఫ్ స్టైల్ అండ్ యాక్టివిటీ లెవెల్
  • ఫుడ్ సెన్సిటివిటీస్ లేదా అలెర్జీస్ 

ఉదాహరణకు, ఒక వ్యక్తికి ఎక్కువ ఫైబర్-రిచ్ ఫుడ్ అవసరం కావచ్చు, మరొకరు ప్రోబయోటిక్స్ లేదా తక్కువ-కార్బ్ భోజనం నుండి ప్రయోజనం పొందవచ్చు.

పర్సనలైజ్ద్ న్యూట్రిషన్ గట్ హెల్త్ ని ఎలా ఇంప్రూవ్ చేస్తుంది?

మీ గట్ మీరు అనుకున్నదానికంటే చాలా శక్తివంతమైనది. ఆహారాన్ని డైజెస్ట్ చేయడమే కాకుండా మీ ఇమ్యూనిటీ, మూడ్ మరియు మొత్తం ఆరోగ్యంలో కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మీ శరీరం యొక్క ప్రత్యేక అవసరాల కోసం రూపొందించబడిన గట్ హెల్త్ అండ్ పర్సనలైజ్ద్ న్యూట్రిషన్ కలిసి వచ్చినప్పుడు, అవి జీవితాంతం ఆరోగ్యానికి బలమైన పునాదిని సృష్టిస్తాయి.

కస్టమైజ్డ్ డైట్స్ 

మీ గట్ మైక్రోబయోమ్ టెస్ట్ ఆధారంగా, పోషకాహార నిపుణులు మంచి బ్యాక్టీరియాను ఇంప్రూవ్ చేసే ఆహారాలను సూచిస్తారు.

టార్గెటెడ్ ప్రోబయోటిక్స్  

వేర్వేరు ప్రోబయోటిక్స్ వేర్వేరు వ్యక్తులకు సరిపోతాయి; పర్సనలైజ్ద్ విధానం సరైన వాటిని ఎంచుకుంటుంది.

బ్యాలెన్స్డ్  ఫైబర్ తీసుకోవడం 

కొంతమందికి హై ఫైబర్ ఫుడ్స్ అవసరం, మరికొందరికి ఉబ్బరం నివారించడానికి సెన్సిటివ్ ఫైబర్స్ అవసరం కావచ్చు.

ఫుడ్ ఇన్ టాలరెన్స్ మేనేజ్ చేయటం 

పర్సనలైజ్ద్ న్యూట్రిషన్ మీ గట్‌ను చికాకు పెట్టే ఆహారాలను నివారిస్తుంది.

గట్ హెల్త్ ని సపోర్ట్ చేసే ఫుడ్స్  

ప్రోబయోటిక్స్ 

పెరుగు, కేఫీర్, కొంబుచా, కిమ్చి, సౌర్‌క్రాట్

ప్రీబయోటిక్స్

అరటిపండ్లు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఆస్పరాగస్, ఓట్స్

Eating Tulsi Leaves for Health
తులసి ఆకులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలెన్నో!

హై ఫైబర్ ఫుడ్స్ 

తృణధాన్యాలు, కాయధాన్యాలు, బీన్స్, పండ్లు, కూరగాయలు

హైడ్రేషన్

జీర్ణక్రియకు మద్దతు ఇవ్వడానికి పుష్కలంగా నీరు

ఇదికూడా చదవండి: కడుపుని నేచురల్ గా ఇలా క్లీన్ చేసుకోండి!

బెటర్ గట్ హెల్త్ కి చిట్కాలు

  • నెమ్మదిగా తినండి మరియు ఆహారాన్ని సరిగ్గా నమలండి.
  • రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండండి.
  • మీ ఆహారంలో పులియబెట్టిన ఆహారాలను చేర్చండి.
  • ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు చక్కెరను తగ్గించండి.
  • యోగా, ధ్యానం లేదా వ్యాయామంతో ఒత్తిడిని నిర్వహించండి.
  • బాగా నిద్రపోండి – రోజుకు కనీసం 7–8 గంటలు.

గట్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఫ్యూచర్ 

సైన్స్ DNA-బేస్డ్ ఫుడ్ ప్లాన్స్ మరియు మైక్రోబయోమ్ టెస్ట్ ల వైపు కదులుతోంది. త్వరలో, మన గట్ బాక్టీరియా మరియు జెనెటిక్ సిస్టమ్ కి సరిగ్గా అనుగుణంగా ఆహారాలను కలిగి ఉంటాము. దీని అర్థం తక్కువ ఆరోగ్య సమస్యలు, మెరుగైన శక్తి మరియు ఎక్కువ కాలం జీవితం.

ముగింపు

గట్ హెల్త్ అండ్ పర్సనలైజ్డ్ న్యూట్రిషన్ మన ఆరోగ్యానికి నంబర్ 1 సీక్రెట్ అనేది ఖచ్చితంగా అర్థమైంది. మీ గట్‌ని స్ట్రాంగ్ గా ఉంచితే మీరు పొందేది మంచి డైజెషన్ మాత్రమే కాదు, బెటర్ మూడ్, స్ట్రాంగ్ ఇమ్యూనిటీ, హెల్దీ  లైఫ్ స్టైల్ కూడా.

🧘‍♀️ హెల్దీ గట్ 🥦 = హెల్దీ యు 🌸😊

👉మీకు ఈ ఆర్టికల్ నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య రహస్యాల కోసం మా వెబ్ సైట్ ని ఫాలో అవ్వండి!

డిస్క్లైమర్: ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment