Foods to Improve Physical Performance

ఇటీవలి కాలంలో మజిల్ పవర్ ని పెంచుకోవటం కోసం జిమ్‌కి వెళ్ళటం ఫ్యాషన్ అయిపోయింది. వీక్‌గా ఉన్నవారు స్టామినా పెంచుకోవటానికి నానా రకాల తిండ్లు తింటుంటారు. అయితే, మజిల్ పవర్ తో పాటు స్టామినా కూడా ఒకేసారి పెరగాలంటే ఏం చేయాలి? అని కొందరు అనుకోవచ్చు. మనం రోజూ తీసుకొనే డైట్ లో కొన్ని సూపర్ ఫుడ్స్ ని చేర్చుకొంటే చాలంటున్నారు నిపుణులు. మరి ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడే తెలుసుకోండి.

ఫిజికల్ పెర్ఫార్మెన్స్ ని పెంచే సూపర్ ఫుడ్స్

ఇప్పుడు మేము చెప్పబోయే ఈ సూపర్ ఫుడ్స్ ని ప్రతిరోజూ తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అంతేకాక, మజిల్ పవర్ పెరిగి… స్టామినా కూడా పెరుగుతుంది.

పీనట్ బటర్

ఫిజికల్ గా మీరు బాగా వీక్ గా ఉన్నట్లయితే, శక్తిని పెంచుకోవడానికి పీనట్ బటర్ ని తీసుకోవచ్చు. పీనట్ బటర్‌లో గుడ్ ఫ్యాట్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుచేత క్రమం తప్పకుండా దీనిని తీసుకొన్నట్లయితే, శరీరంలో శక్తి పెరుగుతుంది. ఇంకా మజిల్స్ స్ట్రాంగ్ గా మారతాయి. పీనట్ బటర్ ని మిల్క్ లేదా రోటీ లేదా బ్రెడ్‌తో తీసుకోవచ్చు.

బాదంపప్పు

స్టామినా పెంచుకొనే సూపర్ ఫుడ్స్ లో బాదం పప్పు కూడా ఒకటి. బాదం పప్పులో విటమిన్ ఇ, ఫైబర్, ప్రొటీన్స్, ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇంకా పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు కూడా లభిస్తాయి. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి. బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి. ప్రోటీన్ ఫుడ్ కావటం చేత శరీరానికి శక్తి అందుతుంది. కండరాలు కూడా బలపడతాయి. బాదం పప్పుని నానబెట్టి, లేదా వేయించి ఎలాగైనా సరే తినొచ్చు.

అరటి పండు

అరటి పండు పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాల గని. ఇందులో విటమిన్ B6, మరియు న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి. అరటిలో ఉండే పొటాషియం అనేక రకాల క్రానిక్ డిసీజెస్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అలాగే దీనిలో ఉండే నేచురల్ షుగర్ వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే, అరటి పండు ఎనర్జీ బూస్టర్‌లా పనిచేస్తుంది. అందుకే, జిమ్ చేసేవారు, వర్కౌట్స్ చేసేవారు అరటిపండును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. రోజూ ఉదయాన్నే అరటి పండు తినడం వల్ల శరీర శక్తి స్థాయిల్ని పెంచుతుంది. అరటి పండుని నేరుగా తినవచ్చు, లేదా భోజనంతో పాటు తీసుకోవచ్చు, ఇంకా జ్యూస్ వంటివి చేసుకొని తాగొచ్చు.

ఇది కూడా చదవండి: Top 5 Foods To Purify Your Blood

చివరిమాట

శారీరక పనితీరును ఆప్టిమైజ్ చేయడానికి అవసరమైన పోషకాలు, శక్తిని అందించే సమతుల్య ఆహారం అవసరం. మీ ఆహారంలో సరైన అంశాలని చేర్చడం వల్ల పూర్తి సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయవచ్చు మరియు ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించగలరు.

డిస్క్లైమర్

ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment