జిమ్ చేసిన వెంటనే నీటిని తాగితే ఏమవుతుంది?

మానవ శరీరంలో 70 శాతం నీరు ఉంటుంది. మన శరీరంలో నీటి శాతం తగ్గి నపుడు ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. డీహైడ్రేషన్ కారణంగా మన గుండెలో మంట, తలనొప్పి, వెన్నునొప్పి, బలహీనత, నీరసం లాంటి సమస్యలు వస్తాయి. శరీరంలో నీటి శాతం తగ్గి నపుడు. మన శరీర భాగాల నుంచి నీరు బాగా తగ్గిపోతుంటుంది. అటువంటి పరిస్థితిలో శరీరం దాహం రూపంలో మనకి సిగ్నల్ ఇస్తుంది. దీని కోసం మనం క్రమం తప్పకుండా నీరు తాగడం చాలా అవసరం.

ఆయుర్వేదం ప్రకారం. మనం నీటిని ఒకేసారి తాగడం మంచిది కాదు. ఈ పద్దతిని మనం మానుకోవాలి. క్రమంగా      క్రమంగా నీటిని తాగడం మంచిది. దీనివల్ల నీరు మన శరీరంలో ఆహారాన్ని జీర్ణం చేసి జీవక్రియను చాలా బాగా పెంచుతుంది. మనం జిమ్ లేదా వర్కవుట్ చేస్తున్నప్పుడు మన శరీరం నుంచి చెమట రూపంలో నీరు బయటకు వచ్చి దాహంగా ఉంటుందీ. ఇలా మనకు అనిపించినప్పుడు ఈ దాహాన్ని గుర్తుగా భావించి నీళ్లు తాగాలా అనేది చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న? అసలు సమాధానం తెలియాలంటే జిమ్‌కి వెళ్లిన తరువాత మన శరీర పరిస్థితి వేడి లేదా చల్లగా ఎలా ఉందో మనం చూడాలి. అదే విధంగా జిమ్ తర్వాత మన శరీరం వెచ్చగా ఉంటుందీ. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే నీళ్లు తాగితే అవయవాలు దెబ్బతింటాయి. కావున జిమ్‌కు వెళ్లిన వెంటనే నీరు తాగేటప్పుడు, విషయాలను గుర్తుంచుకోండి..

Digital illustration showing a person walking after eating to reduce heart attack risk
భోజనం తర్వాత 15 నిమిషాల వాకింగ్ గుండెపోటుని తగ్గిస్తుందా?
  • జిమ్ చేసిన తర్వాత మనం కాస్త విశ్రాంతి తీసుకోవలీ. చెమట పూర్తిగా ఆగిపోయాక మాత్రమీ నీళ్లు తాగాలి.
  • ఒకే శ్వాసలో ఒక గ్లాసు నీరు తాగడం అసలు మంచిది కాదు. దాహం వేసినా వేయకపోయినా. నీరు  సిప్స్ చేస్తూ నీళ్లు తాగాలి.
  • నీటిలో కొంచెం ఉప్పు, పంచదార కలపి తాగండి. ఇది మన చెమటతో విడుదలయ్యే ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపుతుంది. మనం సాధారణ నీటికి బదులుగా కొబ్బరి నీటిని కూడా తాగవచ్చు.
  • ఎప్పుడూ మనం హాయిగా కూర్చుని నీళ్లు తాగాలి. నిలబడి నీళ్లు తాగడం వలన మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.
  • జిమ్ తర్వాత 3 గంటల పాటు ఫ్రిజ్ వాటర్ తాగడం మానుకోండి.
  • ఎప్పుడూ కూడా నీరు నెమ్మదిగా సిప్ చేస్తూ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది

మనం సాధారణ పరిస్థితిలో కూడా చల్లటి వాటర్ కి దూరంగా ఉండాలి. మనం నీటిని మరిగించి లేకపోతే గది ఉష్ణోగ్రత వద్ద తాగడం చాల మంచిది. జిమ్ తర్వాత మన శరీరంలోని రక్తం వేడిగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిల్లో చల్లటి నీరు తాగడం వల్ల మన శరీరానికి హాని కలుగుతుంది.

ముగీంపు: 

Eating carrots daily reduces cancer risk and improves blood health
క్యారెట్ తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందా?

ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

Leave a Comment