షుగర్ పేషెంట్స్ ఈ చిన్న సంకేతాలు గుర్తించకపోతే… ప్రాణాలకే ప్రమాదం

ఇటీవలి కాలంలో డయాబెటీస్ అనేది ప్రతి ఒక్కరికీ చాలా కామన్ అయిపొయింది. ఒకప్పుడైతే వయసుమీరిన వారికి మాత్రమే వచ్చే క్రానిక్ డిసీజ్. కానీ ఇప్పుడలా కాదు, చిన్న పిల్లలకి సైతం వచ్చేస్తుంది. నిజానికి ఈ వ్యాధి రాబోయే ముందు శరీరంలో కొన్ని సంకేతాలు చూపిస్తుంది. వాటిని సకాలంలో గుర్తించకపోయినా… తగు జాగ్రత్తలు తీసుకోకపోయినా… ఈ వ్యాధి వచ్చేస్తుంది. ఒకసారి వచ్చిందంటే ఇక జీవితాంతం రాజీపడి బతకాల్సిందే! మరి ఇలా జరగకుండా ఉండాలంటే, ముందుగానే గుర్తించాల్సిన ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

డయాబెటీస్ రకాలు:

డయాబెటీస్‌లో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి. అవి:

  • టైప్ 1
  • టైప్ 2

టైప్ 1 డయాబెటీస్ కి కారణాలు:

టైప్ 1 డయాబెటీస్ లో పాంక్రియాస్ ఇన్సులిన్‌ని అస్సలు ఉత్పత్తి చేయదు. ఈ కారణంగా మన శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి అనేది పూర్తిగా నిలిచిపోతుంది.

టైప్ 1 డయాబెటీస్ సంకేతాలు:

  • షుగర్ వ్యాధి డయాబెటిక్ న్యూరోపతికి కారణమవుతుంది. అందుకే, దీనిని ‘పెరిఫెరల్ న్యూరోపతి’ అని కూడా అంటారు. దీనివల్ల నరాల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇది చేతులు, కాళ్ళకి సంబంధించిన నరాలను దెబ్బతీస్తుంది. డయాబెటిక్ పేషెంట్లలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు ఈ అధిక గ్లూకోజ్ బ్లడ్ వెజల్స్ ని దెబ్బతీయడం ద్వారా నరాలపై ఎఫెక్ట్ పడుతుంది. అందుకే అలాంటి సమయంలో నరాల సమస్యలు ఎక్కువవుతాయి.
  • డయాబెటిక్ న్యూరోపతి బాడీని అనేక ఇబ్బందులకి గురిచేస్తుంది. ముఖ్యంగా కాళ్ళు, చేతులు, వేళ్ళు, పాదాలలో తిమ్మిర్లని తీసుకొస్తుంది.
  • అలాగే అప్పుడప్పుడూ కాళ్ళు, చేతులు జలదరించినట్లు ఉంటాయి.
  • చేతులు, కాళ్ళలో మంటలు ఎక్కువవుతాయి.
  • చేతులు, కాళ్ళు, పాదాలలో నొప్పులుగా ఉండడం, కొన్నిసార్లు ముళ్ళు గుచ్చినట్లుగా కూడా అనిపించటం.

​టైప్ 2 డయాబెటీస్ కి కారణాలు:

టైప్ 2 డయాబెటీస్ లో పాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేయదు. అందువల్ల రక్తంలో ఉండే గ్లూకోజ్‌ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి.

టైప్ 2 డయాబెటీస్ సంకేతాలు:

  • దృష్టి లోపాలు
  • శ్వాస తీసుకోవటంలో మార్పులు
  • నిద్ర, ఆహారం విషయంలో మార్పులు
  • దాహంగా ఉండడం
  • నోరు డ్రై అవ్వడం
  • అలసట, నీరసం
  • మూత్రం ఎక్కువగా రావడం
  • అకారణంగా బరువు పెరగడం
  • మూత్రాశయ సమస్యలు
  • జీర్ణాశయ సమస్యలు
  • చర్మ సమస్యలు

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయాలంటే, హెల్దీ డైట్ అవసరం. అలాగే, గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు అస్సలు తీసుకోకూడదు.

ముగింపు:

ఈ ఇన్ఫర్మేషన్ కేవలం మీలో అవేర్నెస్ తీసుకురావటం కోసమే! ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా… వెంటనే వైద్యులను సంప్రదించటం మంచిది.

Leave a Comment