బ్లాక్ వాటర్ అనేది ఇప్పుడు బాగా పాపులర్ అయిన ట్రెండ్. సాదారణంగా సెలబ్రిటీలు ఎక్కువగా ఈ బ్లాక్ వాటర్ ని తాగుతుంటారు. బ్లాక్ వాటర్ అనేది సహజంగానే మరింత శక్తివంతమైనది. ఇది ఆరోగ్యానికి ఉపయోగకరమైన పోషకాలను కలిగి ఉన్న ఒక రకమైన నీటి రూపం. ఈ వాటర్ సాధారణంగా కొన్ని ప్రత్యేకమైన ప్రక్రియల ద్వారా తయారు చేయబడుతుంది.
అసలు ఈ బ్లాక్ వాటర్ అంటే ఏమిటి? బ్లాక్ వాటర్ కి, నార్మల్ వాటర్ కి మద్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? బ్లాక్ వాటర్ లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? బ్లాక్ వాటర్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ఈ ఆర్టికల్ లో క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా…
బ్లాక్ వాటర్ అంటే ఏమిటి?
బ్లాక్ వాటర్ దీనినే ఆల్కలీన్ వాటర్ అనికూడా అంటారు. నార్మల్ వాటర్ లో pH లెవెల్స్ 6 -7 మద్య ఉంటాయి. అంటే అది న్యూట్రల్ గా ఉంటుంది. బ్లాక్ ఆల్కలీన్ వాటర్ లో pH లెవెల్స్ 8 – 9 మధ్య ఉంటాయి. అంటే ఎక్కువ విలువను కలిగి ఉంటాయి. ఇది సోడియం, పొటాషియం, కాల్షియం మరియు విటమిన్లు వంటి ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇందులో ఫుల్విక్ ఆమ్లం కూడా ఉండవచ్చు.
బ్లాక్ వాటర్ vs రెగ్యులర్ వాటర్
- బ్లాక్ వాటర్ ఆల్కలీన్ అయితే నార్మల్ వాటర్ న్యూట్రల్.
- రెగ్యులర్ వాటర్ తో పోలిస్తే బ్లాక్ వాటర్‌లో మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. బేసిక్ గా బ్లాక్ వాటర్ అదనపు ప్రయోజనాలతో కూడిన రెగ్యులర్ వాటర్ అని చెప్పవచ్చు.
- నార్మల్ వాటర్ కంటే బ్లాక్ వాటర్ లో ఆల్కలీన్ ఎక్కువ. అందుకే ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. దీనిని తాగడం వల్ల శరీరంలో మినరల్స్ ఎక్కువై, వాటి వల్ల ఎనర్జీ బూస్ట్ అవుతుంది.
- చాలా మంది బ్లాక్ వాటర్ రెగ్యులర్ వాటర్ రుచితో సమానంగా ఉంటుందని కనుగొన్నారు. కానీ కొందరు మొదట కొంచెం చేదుగా ఉండే మట్టి రుచిని కలిగి ఉన్నట్లు కనుగొన్నారు.
- రెగ్యులర్ వాటర్ ని నార్మల్ పీపుల్ వాడుతుంటే, బ్లాక్ వాటర్ మాత్రం సెలబ్రిటీలు, అథ్లెట్లు, హెల్త్ సీకర్స్ ద్వారా బాగా పాపులర్ అయింది.
ఇది కూడా చదవండి:What Are the Proven Health Benefits of Drinking Tamarind Water?
బ్లాక్ వాటర్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు
బ్లాక్ వాటర్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తేలింది. ముఖ్యంగా సెలబ్రిటీస్ లో బాగా పాపులర్ అవ్వటానికి ఇది ఒక కారణం. అయితే ఇందులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
హైడ్రేషన్
బ్లాక్ వాటర్ లో ఉండే మినరల్స్ శరీరంలో ఉండే వాటర్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడానికి, దాహాన్ని తగ్గించడానికి మరియు శక్తిని పొందటానికి సహాయపడుతుంది. అందుకే ఇది ఎక్కువ సమయం ఎండలో గడిపే వారికి, వర్కౌట్స్ చేసిన తర్వాత డీహైడ్రేషన్‌కు గురయ్యే వారికి, అథ్లెట్లకి గొప్ప ఎనర్జీ బూస్టర్ గా ఉపయోగ పడుతుంది. దీనిని తగిన మోతాదులో తాగితే, స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించి మూడ్ ని చేంజ్ చేస్తుంది.ఇంకా పీస్ అఫ్ మైండ్ ని కూడా అందిస్తుంది.
మెటబాలిజం
బ్లాక్ వాటర్ మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి లేదా ఫిట్‌నెస్ గురించి ఆందోళన చెందుతున్న వారికి ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మనల్ని మరింత చురుకుగా మరియు ఫిట్‌గా మారుస్తుంది. బ్లాక్ వాటర్‌లోని మినరల్ కాంబినేషన్ మన బాడీ మెటబాలిజాన్ని పెంచడానికి సహాయపడుతుంది. మరియు మన శరీర పనితీరును మెరుగుపరుస్తుంది.
డయాబెటిస్
బ్లాక్ వాటర్ డయాబెటిస్ ఉన్నవారిపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుందని తేలింది. ఇది బ్లడ్ లో ఉండే షుగర్ లెవెల్స్ ని తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఒక వ్యక్తి రక్తంలో HbA1c స్థాయిలను తగ్గించడంలో కూడా ఇది ప్రభావవంతంగా ఉంటుందని కనుగొనబడింది. HbA1c అనేది ఎక్కువ కాలం పాటు షుగర్ లెవెల్స్ ని కొలిచే ఒక మేజర్ మెంట్. అందుకే బ్లాక్ వాటర్ డయాబెటిస్‌కు అత్యంత ముఖ్యమైన మార్కర్‌గా పరిగణించబడుతుంది.
డైజెస్టివ్ సిస్టమ్
బ్లాక్ వాటర్ లో ఉండే మినరల్స్ డైజెస్టివ్ సిస్టమ్ కి ఎంతగానో సహాయపడతాయి. ఇది ఆహారాన్ని బాగా జీర్ణం చేసుకోవడానికి అవసరమైన హైడ్రేషన్ కూడా అందిస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ ని ఆరోగ్యంగా ఉంచడం ద్వారా డయాబెటిస్, మరియు ఫ్యాటీ ప్రొబ్లెమ్స్ కూడా తగ్గుతాయి.
హార్ట్ హెల్త్
బ్లాక్ ఆల్కలీన్ వాటర్ తాగడం వల్ల హార్ట్ రిలేటెడ్ ప్రొబ్లెమ్స్ మరియు కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందో స్పష్టంగా తెలియనప్పటికీ కొన్ని స్టడీస్ మాత్రం బ్లాక్ వాటర్ ని క్రమం తప్పకుండా తాగేవారికి హార్ట్ హెల్త్ బాగుంటుందని చెప్తున్నాయి.
హైపర్ ఎసిడిటీ
బ్లాక్ వాటర్ యొక్క హై pH లెవెల్స్ యాసిడ్ రిఫ్లక్స్‌ను నిర్వహించడంలో చాలా సహాయపడుతుంది. ఇది పెప్సిన్ వంటి యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణమైన ఎంజైమ్‌ల కార్యకలాపాలను తగ్గిస్తుంది. ఇంకా చాలా మందిలో ఉండే హైపర్ ఎసిడిటీ మరియు ఎసిడిటీకి దారితీసే హయ్యర్ యాసిడ్ లెవెల్స్ ని న్యూట్రలైజ్ చేయడంలో కూడా సహాయపడతాయి. ఇది ఎసిడిటీకి సంబంధించిన సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
డిటాక్సిఫికేషన్
బ్లాక్ వాటర్ లో ఉన్న కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్లు శరీరంలోని టాక్సిన్లను బయటకు తీయడంలో సహాయపడతాయి. ఇంకా శరీరంలో ఎలిమెంట్స్ ని రీస్టోర్ చేయటానికి కూడా ఇది ఎంతో అవసరం. బ్లాక్ వాటర్ లో ఉండే ఈ డిటాక్సిఫికేషన్ ప్రక్రియ ద్వారా, శరీరంలో విషాల పరిమాణం తగ్గిపోతుంది, తద్వారా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము.
బోన్ హెల్త్
ఇది ఎముకల నష్టాన్ని తగ్గించడం ద్వారా బోన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. బ్లాక్ ఆల్కలీన్ వాటర్ లో ఉండే ఖనిజాలు మరియు విటమిన్లు బోన్ లాస్ ని తగ్గిస్తాయి. మరియు బోన్స్ ని లోపలి నుండి స్ట్రాంగ్ గా మారుస్తాయి. అందుకే బోన్ హెల్త్ కి ఇది చాలా ముఖ్యం. ఎముకలు పెళుసుగా మారే ఎముక వ్యాధి అయిన ఆస్టియోపోరోసిస్ కేసులలో బ్లాక్ వాటర్ చాలా సహాయపడుతుంది.
హెల్దీ స్కిన్
బ్లాక్ వాటర్ ఉపయోగం కేవలం శరీరానికి మాత్రమే కాకుండా, చర్మం కూడా దానివల్ల ఇంప్రూవ్ అవుతుంది. బ్లాక్ వాటర్ లో ఉండే ఖనిజాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మంపై కాంతిని మెరుగుపరచడానికి కూడా ఇది సహాయపడుతుంది.
ఐ హెల్త్
బ్లాక్ వాటర్ వల్ల చర్మంపై వచ్చే మరింత శాంతి ఉంటుంది. ఇది కంటి చుట్టు వాపు, అండరేడ్, డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తుంది. ఇంకా ఇందులో ఉండే పోషకాలు కళ్ళ ఆరోగ్యానికి సహాయపడతాయి. అలాగే కంటి సమస్యలను తగ్గిస్తుంది.
మోషన్ సిక్ నెస్
బ్లాక్ వాటర్ తాగటం వల్ల కడుపు నొప్పులు, మరియు వాంతి వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది శరీరంలో వాటర్ బ్యాలెన్స్ ని పెంచడంలో సహాయపడుతుంది, అలాగే మరింత ఆరోగ్యాన్నిఅందిస్తుంది.
మైగ్రేన్
మైగ్రేన్ సమస్యలకు కూడా బ్లాక్ వాటర్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది మెదడులో అవసరమైన మినరల్స్ ని అందించి, మైగ్రేన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇతర ప్రయోజనాలు
బ్లాక్ వాటర్ అనేక ఇతర సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉందని చెబుతారు. ఆల్కలీన్ బ్లాక్ వాటర్ తాగడం వల్ల వృద్ధాప్యాన్ని నివారించడంలో సహాయపడుతుంది మరియు ఒక వ్యక్తి యొక్క ఆయుష్షు పెరుగుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తాగే వ్యక్తులు బాగా నిద్రపోతారని కూడా తెలుపుతుంది. మొత్తంమీద బ్లాక్ వాటర్ తాగేవారు మిగ్లిలిన వారితో పోలిస్తే మరింత ఆరోగ్యంగా ఉంటారు
ఇది కూడా చదవండి: కాపర్ వాటర్ తాగుతున్నట్లైతే… ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
బ్లాక్ వాటర్ తాగడం మంచిదేనా?
బ్లాక్ వాటర్ అనేది ఒక సరికొత్త కాన్సెప్ట్ అని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పటివరకు జరిగిన చాలా పరిశోధనలు బ్లాక్ వాటర్ తాగటం మంచిదేనని చూపిస్తున్నాయి. దీనిలో ఉండే విటమిన్స్, మినరల్స్ మానవ ఆరోగ్యానికి మంచివని తెలుసు. అయితే, చాలా అధ్యయనాలు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని చూపించినప్పటికీ, నిపుణులు బ్లాక్ వాటర్ యొక్క దీర్ఘకాలిక ప్రభావాలు ఇంకా తెలియవని అంటున్నారు. దీర్ఘకాలిక పరిణామాలను తోసిపుచ్చడానికి ఎక్కువ కాలం పాటు మరిన్ని పరిశోధనలు ఖచ్చితంగా అవసరం.
బ్లాక్ వాటర్ యొక్క దుష్ప్రభావాలు
బ్లాక్ వాటర్ తాగడం వల్ల హానికరమైన దుష్ప్రభావాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. అవి:
- బ్లాక్ వాటర్ గందరగోళం, వికారం మరియు వాంతికి దారితీస్తుంది.
- జంతువులపై చేసిన ప్రయోగాలలో, బ్లాక్ వాటర్ వలన పెరుగుదల మందగించగలదని మరియు గుండె కణాల మరణానికి దారితీస్తుందని తేలింది.
- ఇది యూరిన్ లో ఉండే pH స్థాయిలలో మార్పులకు కూడా దారితీస్తుంది. అధిక వినియోగం శరీరంలో పిహెచ్ స్థాయిలలో మార్పుకు కూడా దారితీస్తుంది.
ముగింపు
ఈ విధంగా, బ్లాక్ వాటర్ కొంతమందికి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, దానిపై మరింత డీప్ రీసర్చ్ అవసరం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇది ఒక వండర్ ఫుల్ డ్రింక్ అని నిరూపించబడటానికి ముందు మరిన్ని హ్యూమన్ ట్రైల్స్ అవసరం. కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకపోలేదు. సీజన్‌తో పాటు కొత్త ఫ్యాషన్ డైట్‌లు కూడా వచ్చి వెళ్తాయని గుర్తుంచుకోవాలి. ఈ కాన్సెప్ట్ కి సైన్స్ సపోర్ట్ చేస్తున్నట్లు అనిపించినప్పటికీ, ఈ కొత్త మ్యాజికల్ డ్రింక్ తాగడానికి తొందరపడే ముందు వైద్య నిపుణుల అభిప్రాయం తీసుకోవడం మంచిది.
“శరీరం ఆరోగ్యంగా ఉంటే, మనస్సు ఉల్లాసంగా ఉంటుంది! 😊✨”
డిస్క్లైమర్
ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.