పొడి దగ్గుని తక్షణమే తగ్గించే బెస్ట్ హోం రెమెడీ ఇదే!

మారుతున్న సీజన్‌లో పొడి దగ్గు చాలామందిని ఇబ్బంది పెడుతుంది. కొద్దిమందికి ఆహార మార్పుల వల్ల వస్తే… మరికొద్దిమందికి చల్లని వాతావరణం వల్ల వస్తుంది. కారణం ఏదైనా సరే… పొడి దగ్గు కామనే! సాదారణంగా రెస్పిరేటరీ సమస్యలైన బ్రాంకైటిస్, న్యుమోనియా, జలుబు, ఆస్తమా, అలర్జీల వంటి వ్యాధుల వల్ల ఈ పొడి దగ్గు వస్తుంది. 

పొడి దగ్గు చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు అందరినీ ఇది ఇబ్బంది పెడుతుంది. మరి అటువంటప్పుడు ఈ పొడి దగ్గుని నివారించటానికి బెస్ట్ హోమ్ రెమెడీ ఒకటి ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావలసిన పదార్ధాలు:

  • శొంఠి
  • నల్ల మిరియాలు
  • తమలపాకు
  • తులసి ఆకులు

తయారుచేయు విధానం:

పైన మనం చెప్పుకొన్న హెర్బ్స్ అన్నీ ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. అయితే వాటిని కషాయంలా తయారుచేసుకోవాలి. అందుకోసం ముందుగా ఒక బౌల్ లో రెండు గ్లాసుల నీటిని తీసుకోవాలి. అందులో ఈ మూలికలన్నీ వేసి ఓ 10 నిమిషాలపాటు మరగనివ్వాలి. పూర్తిగా ఆ నీరు మరిగిపోయి… బౌల్లో సగానికి రావాలి. అప్పుడు దానిని ఫిల్టర్ చేసి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలి. ఈ కషాయాన్ని రోజుకు రెండుసార్లు చొప్పున తీసుకోవడం వల్ల పొడి దగ్గు, జలుబు వంటివి తగ్గుముఖం పడతాయి.

Glass of jeera water and mint leaves for gas relief in hot summer
వేసవిలో గ్యాస్ వస్తే… హోమ్ రెమెడీ ఇదే బాస్!

ప్రయోజనాలు:

ఈ కషాయంవల్ల అనేక ప్రయోజనాలు చేకూరతాయి. ఇందులో ఉండే శొంఠిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది నొప్పి, వాపు వంటివి తగ్గిస్తుంది. బ్లాక్ పెప్పర్‌లో కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది వాపును తగ్గించి… దగ్గు, జలుబు, ఫ్లూ నుండి ఉపశమనం అందిస్తుంది. ఇక తులసి, మరియు తమలపాకుల వల్ల శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తి పెరుగుతుంది. 

చివరి మాట:

పొడి దగ్గు అనేక కారణాలతో దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. కానీ మీ దగ్గును తగ్గించే బెస్ట్ రెమెడీ మాత్రం మీ దగ్గరే…మీ ఇంట్లోనే… ఉంది. దానిని ఉపయోగించటం వల్ల మీ దగ్గు కాలక్రమేణా తగ్గుతుంది. ఒకవేళ మీ దగ్గు 2 నెలల్లోపు తగ్గకపోతే, తప్పకుండా  వైద్యుడిని సంప్రదించండి.

డిస్క్లైమర్: 

ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Applying coconut oil as the ultimate remedy for itching relief
ఒక్క చుక్క నూనె – ఇక దురదలకు గుడ్‌బై

Leave a Comment