How Do Hormonal Changes Affect Back Pain During Menstruation?

ఋతుస్రావం సమయంలో, శరీరం ప్రోస్టాగ్లాండిన్స్ అనే  హార్మోన్ లాంటి పదార్ధాలను విడుదల చేస్తుంది. ఇది సర్వైకల్ ని స్టిమ్యులేట్ చేయటం మరియు దాని  పొరను రిమూవ్ చేయటం వంటి పనులని ప్రేరేపిస్తుంది. ఈ సంకోచాలు నొప్పిని వీపు క్రింది భాగానికి ప్రసరింపజేస్తాయి.  హార్మోన్స్ లో ఫ్లక్చువేషన్స్ ఎక్కువైనప్పుడు అది స్వెల్లింగ్, వాటర్ రిటెన్షన్, మజిల్స్, మరియు నెర్వస్ లో టెండర్ నెస్ ని కలిగిస్తాయి. దీంతో బ్యాక్ పెయిన్ ని తీవ్రతరం చేస్తాయి. 

కొంతమంది స్త్రీలకి ఎండోమెట్రియోసిస్ లేదా ఫైబ్రాయిడ్స్ వంటి అంతర్లీన పరిస్థితులు ఈ అసౌకర్యాన్ని మరింత పెంచుతాయి, పీరియడ్స్ సమయంలో వెన్నునొప్పిని మరింత తీవ్రంగా చేస్తాయి. 

ఇది కూడా చదవండి: What Are the Common Signs and Symptoms of High Stomach Acid?

పీరియడ్స్ సమయంలో వెన్నునొప్పికి గల కారణాలు

ఈ ఆర్టికల్‌లో, పీరియడ్స్ సమయంలో మహిళల్లో వెన్నునొప్పికి గల కారణాలను మీతో షేర్ చేసుకుందామని అనుకొంటున్నాను. అవేంటో చూద్దాం పదండి.

గర్భాశయ సంకోచాలు

ఋతుస్రావం సమయంలో, గర్భాశయం దాని లోపలి పొరను తొలగిస్తుంది. ఈ సంకోచాలు తీవ్రంగా ఉంటాయి మరియు గర్భాశయ కండరాలు ఋతు రక్తాన్ని బయటకి పంపడానికి పని చేస్తున్నందున వీపు క్రింది భాగంలో నొప్పిని కలిగిస్తాయి.

హార్మోన్ల హెచ్చుతగ్గులు

ప్రొస్టాగ్లాండిన్స్ పెరుగుదల మరియు ఋతుస్రావం సమయంలో ప్రొజెస్టెరాన్ తగ్గుదల వంటివి వాపు మరియు నొప్పిని ప్రేరేపిస్తుంది. ఈ హార్మోన్ల మార్పులు వెనుక కండరాలు మరియు నరాలలో సున్నితత్వాన్ని పెంచుతాయి. ఇవి బ్యాక్ పెయిన్ ని తీవ్రతరం చేస్తాయి.

ఎండోమెట్రియోసిస్

గర్భాశయం గోడ లోపల పెరగాల్సిన ఎండోమెట్రియల్ అనే కణజాలం బయట ఏర్పడినప్పుడు ఇది జరుగుతుంది. ఇది కొన్నిసార్లు అండాశయాలు, ఫెలోపియన్ ట్యూబ్‌లు మరియు పెల్విస్ వంటి ఇతర అవయవాల చుట్టూ కూడా పెరుగుతుంది. ఎండోమెట్రియోసిస్ యొక్క సాధారణ లక్షణాలు డిస్మెనోరియా, భారీ రక్తస్రావం, బాధాకరమైన మూత్రవిసర్జన మరియు ప్రేగు కదలికలు మరియు మలబద్ధకం. కొంతమంది స్త్రీలు వారి మూత్రాశయంలో ఎండోమెట్రియల్ కణజాల పెరుగుదలను కలిగి ఉంటే మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ కూడా ఉండవచ్చు. 

Patient with chest pain showing second heart attack risk and prevention
రెండవ గుండెపోటు ప్రమాదం ఎందుకు రిస్క్ ఎక్కువ?

ఫైబ్రాయిడ్లు

గర్భాశయ గోడల కండరాలపై కణజాలం పెరగటాన్ని  ఫైబ్రాయిడ్లు అంటారు. అదృష్టవశాత్తూ, గర్భాశయ ఫైబ్రాయిడ్లు క్యాన్సర్ కణాలు లేనివి. నడివయస్సు మహిళల్లో ఇదొక సాధారణ సంఘటన. ఈ వ్యాధి దాదాపుగా ఎటువంటి లక్షణాలను చూపించదు కానీ కొంతమంది స్త్రీలలో అధిక రక్తస్రావం, కటి నొప్పి, దిగువ లేదా ఎగువ వెన్నునొప్పి మరియు కాలు తిమ్మిరి లేదా నొప్పులను కలుగచేస్తుంది. 

పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి 

PID అనేది పునరుత్పత్తి అవయవాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్. ఇది కటి ప్రాంతంలో మంట మరియు నొప్పిని కలిగిస్తుంది. తరచుగా దిగువ వీపు వరకు వ్యాపిస్తుంది. పీరియడ్స్ సమయంలో పెల్విక్ యాక్టివిటీ పెరగడం మరియు గర్భాశయ సంకోచం కారణంగా నొప్పి మరింత  తీవ్రమవుతుంది.

అండాశయ తిత్తులు

ఇది అండాశయాలపై కానీ లేదా లోపల కానీ అభివృద్ధి చెందగల ద్రవంతో నిండిన సంచులతో రూపొందించబడిన మరొక రకమైన పెరుగుదల. ఫైబ్రాయిడ్ల వలె ఇవి కూడా సాధారణంగా హానిచేయవు. అరుదుగా ఎవరికో ఈ లక్షణాలు తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి. అయినప్పటికీ, నీటి  తిత్తులు ఉండటం వలన పొత్తి కడుపులో ఉబ్బరం మరియు దీర్ఘకాలిక కటి నొప్పికి కారణం కావచ్చు. 

కండరాల అలసట

కొంతమంది స్త్రీలు ఋతు నొప్పిని భరించటానికి తెలియకుండానే వారి భంగిమను మార్చుకుంటారు. ఇది దిగువ వెనుక కండరాలను నొప్పికి గురిచేయవచ్చు. కాలక్రమేణా, ఈ భంగిమ పీరియడ్స్ సమయంలో కండరాల అలసట మరియు వెన్నునొప్పికి దారితీయవచ్చు.

నరాల ప్రమేయం

గర్భాశయం దిగువ వీపుతో నరాల మార్గాలను పంచుకుంటుంది. పీరియడ్స్ సమయంలో గర్భాశయం సంకోచించినప్పుడు, ఈ రిలేటెడ్ మార్గాలు కూడా నొప్పి సంకేతాలను వెనుకకు ప్రసారం చేయగలవు, ఫలితంగా నొప్పి ప్రసరిస్తుంది.

స్పైనల్ టెండర్ నెస్ 

పీరియడ్స్ సమయంలో హార్మోన్ల మార్పులు వెన్నెముక నరాల యొక్క సున్నితత్వాన్ని పెంచుతాయి. ఈ పెరిగిన సున్నితత్వం నొప్పి గర్భాశయం లేదా పెల్విక్ ప్రాంతంలో ఉన్నప్పటికీ, వెన్నునొప్పిని పెంచుతుంది.

మస్క్యులోస్కెలెటల్ సమస్యలు

పార్శ్వగూని, హెర్నియేటెడ్ డిస్క్‌లు లేదా బలహీనమైన కోర్ కండరాలు వంటి పరిస్థితులు పీరియడ్స్ సమయంలో వెన్నునొప్పిని తీవ్రతరం చేస్తాయి. గర్భాశయ సంకోచాల ఒత్తిడి మరియు హార్మోన్ల మార్పులు ముందుగా ఉన్న వెన్ను సమస్యలను తీవ్రతరం చేస్తాయి. ఇది అధిక అసౌకర్యానికి దారితీస్తుంది.

A close-up of a person sneezing in a doctor's office, a visual representation of respiratory infection symptoms.
శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు: లక్షణాలు, కారణాలు, చికిత్స మరియు నివారణా మార్గాలు

చివరిమాట 

మెరుగైన చికిత్స కోసం బహిష్టు వెన్నునొప్పికి మూలకారణాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. హీట్ థెరపీ, హీటింగ్ ప్యాడ్, మసాజ్, వెచ్చని స్నానం,  వ్యాయామం, యోగా, లేదా నడక వంటి పద్ధతుల ద్వారా బ్యాక్ పెయిన్ నుండీ రిలీవ్ అవ్వొచ్చు. 

మరికొంతమంది పీరియడ్స్-సంబంధిత లక్షణాల నుండి ఉపశమనం పొందడానికి తులసి, దాల్చినచెక్క, చమోమిలే, అల్లం రూట్, పార్స్లీ మరియు రెడ్ రాస్ప్ బెర్రీ లీఫ్ వంటి మూలికలు మరియు మొక్కల మూలాలను ఉపయోగిస్తారు. 

వీటన్నిటికంటే ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించి, పోషకాహారాన్ని పెంచితే సరిపోతుంది.

 డిస్క్లైమర్

ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment