ఈ రోజుల్లో తెల్ల జుట్టు ఒక ప్రధాన సమస్యగా మారింది. పూర్వకాలంలో వృద్ధులకు మాత్రమే కనిపించే ఈ సమస్య ఇప్పుడు యువతలో కూడా తరచుగా కనిపిస్తోంది. కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారం, మానసిక ఒత్తిడి, కెమికల్ ప్రొడక్ట్స్ వాడకం కారణంగా చాలా మందికి చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడుతోంది.
చాలా మంది దీనికి శాశ్వత పరిష్కారం కోసం హెన్నా లేదా హెయిర్ డై ఉపయోగిస్తున్నారు. అయితే, ఇవి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి, ఇంకా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది. అలా కాకుండా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడే నేచురల్ హెయిర్ డై ఏదైనా ఉందేమో అని గూగుల్ లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు. అలాంటి వారి కోసమే ఈ ఆర్టికల్.
తెల్ల జుట్టు సమస్య ఎందుకు వస్తుంది?
ఈ రోజుల్లో తెల్ల జుట్టు రావటం చాలా సాదారణం అయిపొయింది. అయితే, దానికి అనేక కారాణాలు దోహదపడతాయి. అవి:
పోషకాహార లోపం
విటమిన్ B12, ఐరన్, జింక్ వంటి పోషకాలు లేకపోవడం వల్ల జుట్టు తెల్లబడుతుంది.
ఆనువంశికత
మీ తల్లిదండ్రులకు, పెద్దలకు చిన్న వయస్సులో తెల్ల జుట్టు వచ్చి ఉంటే, మీకూ వచ్చే అవకాశాలు ఎక్కువ.
ఆరోగ్య సమస్యలు
థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత వల్ల జుట్టు రంగు కోల్పోతుంది.
జీవన శైలి
అధిక ఒత్తిడి, తినే భోజనం, తక్కువ నిద్ర, ఇంక ఇతర అలవాట్ల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.
కెమికల్ ప్రొడక్ట్స్ వాడకం
హెయిర్ జెల్స్, షాంపూలలో ఉండే హానికరమైన కెమికల్స్ వల్ల కూడా జుట్టు ముదురు రంగును కోల్పోతుంది.
హెన్నా, హెయిర్ డై వాడకంతో కలిగే నష్టాలు
కారణం ఏదైనా కానీ జుట్టు తెల్లబడినప్పుడు దానిని నల్లగా మార్చుకోవటం కోసం నానా తంటాలు పడుతుంటారు. అందులో భాగంగా హెన్నా, లేదా హెయిర్ డై వాడుతుంటారు. మరి వీటి వాడకం వల్ల కలిగే నష్టాలు ఏమిటో మీరే చూడండి!
హెన్నాలో కెమికల్స్
మార్కెట్‌లో దొరికే హెన్నాలో ఎక్కువగా కెమికల్స్ కలిపి ఉంటాయి. ఇవి జుట్టు రాలేలా చేస్తాయి.
హెయిర్ డై లో హానికరమైన పదార్థాలు
హెయిర్ డైలో PPD (Paraphenylenediamine) వంటి ఉంటాయి. ఈ కెమికల్స్ జుట్టుకి బలాన్ని తగ్గిస్తాయి.
తాత్కాలిక పరిష్కారం మాత్రమే
హెన్నా, లేదా డై వాడితే కొన్ని రోజులు మాత్రమే నల్లగా కనిపిస్తుంది. ఆ తర్వాత జుట్టు సహజ రంగుని కోల్పోతుంది. బ్రౌన్ కలర్ లేదా గ్రే కలర్ లో కనిపిస్తుంది.
జుట్టు పొడిబారడం
హెయిర్ డై ఎక్కువ వాడితే తల చర్మం పొడిగా మారి, డాండ్రఫ్ సమస్య వస్తుంది.
స్కిన్ అలర్జీ సమస్య
కొందరికి హెన్నా, లేదా డై వల్ల తలనొప్పి, చర్మ సమస్యలు రావచ్చు.
జుట్టును సహజంగా నల్లగా మార్చే అమ్లా మ్యాజిక్
ప్రాచీన ఆయుర్వేదంలో అమ్లాను అద్భుతమైన ఔషధంగా పరిగణిస్తారు. ఇండియన్ గూస్ బెర్రీగా పిలుచుకొనే అమ్లా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా జుట్టుకు ఇది ఒక వరంగా పని చేస్తుంది. ఇందులో అధికంగా ఉండే విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును సహజంగా నల్లగా మార్చడానికి సహాయపడతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, హెయిర్ ని నేచురల్ గా బ్లాక్ కలర్ కి మార్చే ఓ మ్యాజిక్ అని చెప్పొచ్చు.
అమ్లా జ్యూస్ ఎలా తాగాలి?
జుట్టుకి సహజ రంగుని అందించే ఈ ఆమ్లా జ్యూస్ ని ఎలా తయారుచేసుకొని తాగాలో తెలుసుకోండి.
- ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో 30ml అమ్లా జ్యూస్ నీటిలో కలిపి తాగాలి.
- తాజా అమ్లా పండ్లతో రసాన్ని తాయారు చేసుకోవాలి.
- దీనిలో తేనె కలిపి తాగితే ఇంకా మంచిది.
- మంచి ఫలితాలు రావాలంటే కనీసం 3 నెలలు నిరంతరం అమ్లా జ్యూస్ త్రాగడం అవసరం.
ఇది కూడా చదవండి: Health Benefits of Drinking Ash Gourd Juice
అమ్లా జ్యూస్ త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
ఆమ్లా జ్యూస్ కేవలం జుట్టుకి సహజత్వాన్ని అందివ్వటమే కాకుండా మరికొన్ని ఇతర జుట్టు సమస్యలని కూడా తగ్గిస్తుంది. అవేంటో తెలుసుకోండి!
మెలానిన్ ఉత్పత్తిని పెంచుతుంది
జుట్టుకు రంగునిచ్చే పదార్థం మెలానిన్. అమ్లాలోని పోషకాలు దీని ఉత్పత్తిని పెంచి జుట్టును నల్లగా మార్చుతాయి.
జుట్టు రాలడం తగ్గుతుంది
విటమిన్ C అధికంగా ఉండడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది.
హెయిర్ ఫాలికల్స్ బలపడతాయి
జుట్టు కుదుళ్లను బలపరిచి, కొత్త జుట్టు పెరుగుదలకి అమ్లా సహాయపడుతుంది.
రక్త ప్రసరణ మెరుగవుతుంది
తలలో రక్త ప్రసరణను మెరుగుపరచి, జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు సహాయపడుతుంది.
డాండ్రఫ్ సమస్య తగ్గుతుంది
యాంటీ బాక్టీరియల్ గుణాలున్న అమ్లా జ్యూస్ తలకు తేమనిచ్చి పొడి తలచర్మాన్ని తగ్గిస్తుంది.
అమ్లా వాడటానికి కొన్ని ఇతర మార్గాలు
జుట్టు సహజంగా, ఆరోగ్యంగా పెరగాలంటే కేవలం ఆమ్లా జ్యూస్ మాత్రమే కాదు, కొన్ని ఇతర మార్గాల ద్వారా కూడా దీనిని వాడవచ్చు. అవి:
అమ్లా హెయిర్ ఆయిల్
కొబ్బరి నూనెలో అమ్లా ముక్కలు వేసి మరిగించి వాడితే, జుట్టుకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
అమ్లా పొడి
ఇది నీటితో కలిపి తలపై అప్లై చేస్తే సహజమైన హెయిర్ ప్యాక్ అవుతుంది.
అమ్లా-శిఖాకాయ-రితా పౌడర్
వీటిని కలిపి షాంపూ వలె వాడితే జుట్టుకు పోషణ లభిస్తుంది.
సహజమైన జుట్టుకు ఆరోగ్య చిట్కాలు
కేవలం ఆమ్లా వాడకం మాత్రమే కాదు, జుట్టు నేచురల్ గా ఉండాలంటే, మరికొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించవలసి ఉంటుంది. అవి:
- ప్రతిరోజూ తలకు కొబ్బరి లేదా బాదం నూనెతో మసాజ్ చేయాలి.
- ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఉదాహరణకి పప్పులు, గుడ్లు, పాల ఉత్పత్తులు వంటివి.
- విటమిన్ C, ఐరన్, జింక్ అధికంగా ఉండే ఆహారాలు తినాలి.
- రోజూ ఎక్కువ నీరు తాగాలి. ఒత్తిడి తగ్గించుకునే యోగా, మెడిటేషన్ చేయాలి.
- కెమికల్స్ లేని నేచురల్ షాంపూలను మాత్రమే వాడాలి.
ముగింపు
తెల్ల జుట్టు సమస్యను రసాయనాలతో కాకుండా సహజమైన మార్గాల్లో పరిష్కరించుకోవడం చాలా మంచిది. అమ్లా జ్యూస్ త్రాగడం వల్ల జుట్టుకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. హెన్నా, హెయిర్ డై వంటి తాత్కాలిక పరిష్కారాలను మానుకుని, అమ్లా వంటి సహజమైన మూలాలను వాడితే ఆరోగ్యకరమైన, బలమైన, నల్లని జుట్టును పొందవచ్చు. కాబట్టి నేటి నుంచే అమ్లా జ్యూస్ త్రాగడం అలవాటు చేసుకుని మీ జుట్టును సహజంగా అందంగా మార్చుకోండి!
డిస్క్లైమర్
ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.